E-Paper
Advertisement

గురువు గంభీర్ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేందుకే హ‌ర్షిత్ రాణా రౌడీ బిహేవ్ చేశాడు

గురువు గంభీర్ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేందుకే హ‌ర్షిత్ రాణా రౌడీ బిహేవ్ చేశాడు
Advertisement

Ahmad Shahzad On Harshit Rana: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియాపై పాకిస్తాన్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. చివరి వరకు పోరాడిన టీమిండియాకు ఫలితం దక్కకపోవడంతో పాకిస్తాన్ అవ‌లీల‌గా గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో చోటు చేసుకున్న వివాదాల‌పై పాకిస్తాన్ మాజీ ఓపెనర్ అహ్మద్ షెజాద్ (Ahmad Shahzad) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. తన గురువు గంభీర్ దగ్గర మార్కులు కొట్టేసేందుకు ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా హర్షిత్ రాణా రౌడీలా బిహేవ్ చేశాడని మండిపడ్డాడు.

గంభీర్ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేందుకే హ‌ర్షిత్ రాణా రౌడీ బిహేవ్ చేశాడు

తన క్రికెట్ చరిత్రలో ఎప్పుడు ఇలాంటి వివాదాస్పద బౌలర్ ను తాను చూడలేదని హర్షిత్ రాణాపై ఫైర్ అయ్యాడు అహ్మ‌ద్ షెజాద్. ప్రతి బంతికి పాకిస్తాన్ క్రికెటర్ తో గొడవ పెట్టుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదన్నాడు. కేవలం గౌతం గంభీర్ మన్న‌న‌లు పొందేందుకు మాత్రమే హర్షిత్ రాణా ఇలా బిహేవ్ చేసి ఉంటాడని తనకు అనుమానంగా ఉందని వ్యాఖ్యానించాడు. ఇలాంటి క్రికెటర్ పై క‌చ్చితంగా ఐసీసీ చర్యలు తీసుకోవాలని అప్పుడే లైన్ లోకి వస్తాడని హెచ్చరించాడు. ఒకవేళ టీమ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇదే టోర్నమెంట్ లో ఫైనల్ జరిగితే హర్షిత్ రాణా ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరాడు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

టాస్ సమయంలో పాకిస్తాన్ ను తిలక్ వ‌ర్మ ముంచేశాడు

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన నిన్నటి మ్యాచ్ సందర్భంగా టాస్ వివాదంగా మారింది. పాకిస్తాన్ కెప్టెన్ అబ్దుల్ సమ‌ద్ టాస్ గెలిచిన త‌రుణంలో మ్యాచ్ రిఫ‌రీ పొర‌పాటు ప‌డ్డాడు. ఈ త‌రుణంలోనే టీమిండియా టాస్ నెగ్గినట్టు మ్యాచ్ రిఫరీ ప్రకటించారు. దీంతో వివాదం రాజుకుంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న అబ్దుల్ సమద్.. పాకిస్తాన్ టాస్ గెలిచింద‌ని గట్టిగా అరిచాడు. దీంతో మ్యాచ్ రిఫరీ అలర్టయి .. పాకిస్తాన్ టాస్ గెలిచినట్టు ఆ తర్వాత ప్రకటన చేశాడు. అయితే ఈ సంఘటనపై పాకిస్తాన్ మాజీ ఓపెనర్ అహ్మద్ షెజాద్ (Ahmad Shahzad) ఫైర్ అయ్యాడు.

Advertisement

టాస్ పాకిస్తాన్ గెలిచినప్పటికీ తిలక్ వర్మ మాత్రం సైలెంట్ గా నిలబడి నాటకాలు ఆడినట్టు ఫైర్ అయ్యాడు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉందని తెలిసి టాస్ విష‌యంలో రిఫ‌రీ చేసిన పొరపాటును ఆస‌రాగా చేసుకుని తిలక్ వర్మ కుట్రపూరితంగా వ్యవహరించాడని మండిపడ్డాడు. తప్పు జరిగిందని తెలిసి కూడా మౌనంగా ఉండి సినిమా చూసినట్టు చూసాడని సెటైర్లు పేల్చాడు. తిలక్ వర్మ స్థానంలో మరో జట్టు కెప్టెన్ ఉండి ఉంటే.. జెంటిల్ మేన్ తరహాలో తప్పు జరిగిందని ఒప్పుకునేవాడని వ్యాఖ్యానించాడు. తొండాట ఆడినందుకే అల్లా టీమిండియాను ఓడించాడని బాంబు పేల్చాడు.

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

Related News

ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

హ‌ర్షిత్ రాణాకు ఒళ్లంతా పొగ‌రే.. వీడు ఎక్కువ రోజులు టీమిండియాలో నిల‌దొక్కుకోలేడు

టీమిండియాపై విజ‌యం..నేష‌న‌ల్ హాలీడే ప్ర‌క‌టించిన పాకిస్తాన్ ప్ర‌ధాని ష‌రీఫ్‌

వైభవ్ జోలికి వస్తార్రా? పాక్ బౌలర్ కాలర్ పట్టుకున్న అభిషేక్ శర్మ

టీమిండియా ఘోర ఓట‌మి..మిడిల్ ఫింగ‌ర్ చూపిస్తూ రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్

పాక్ ప్లేయ‌ర్ల‌పై దాడి చేయాల‌ని హ‌ర్షిత్ రాణాను గంభీరే ఉసిగొల్పాడు

ఒరేయ్ తిల‌క్ వ‌ర్మ‌..టెస్టు మ్యాచ్ ఆడుతున్నావా? చేత‌కాక‌పోతే త‌ప్పుకో!

Big Stories

Advertisement
×