E-Paper
Advertisement

‘బాహుబలిలా ప్రవర్తించడం ఆపండి’.. బిహార్ సెషన్స్ జడ్జిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!

‘బాహుబలిలా ప్రవర్తించడం ఆపండి’.. బిహార్ సెషన్స్ జడ్జిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!
Advertisement

Supreme Court: కోర్టు ఆదేశించినప్పటికీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదన్న కారణంతో ఓ పోలీసు అధికారిని దోషిగా తేల్చి జరిమానా విధించిన బిహార్ సెషన్స్ జడ్జి తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ‘బాహుబలి’ తరహాలో వ్యవహరించడం ఆపాలని సదరు న్యాయమూర్తికి హితవు పలికింది.

ఈ సెషన్స్ జడ్జికి సంబంధించిన పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు ఎదుటకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యవహారశైలిని, చట్టంపై ఆయనకున్న ప్రాథమిక అవగాహనను ధర్మాసనం నిలదీసింది. విచారణ సందర్భంగా జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ మాట్లాడుతూ సదరు న్యాయమూర్తి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టంపై ఆయనకున్న అవగాహనను ప్రశ్నించారు.

Advertisement

Also Read: ఏ పార్టీకైనా క్రమశిక్షణే ముఖ్యం.. కాంగ్రెస్‌లో అది బాగానే ఉంది: భట్టి విక్రమార్క

ఒక ఎస్పీని కోర్టుకు పిలిపించడమే కాకుండా అదే రోజున ఆయన్ను దోషిగా తేలుస్తూ దూకుడుగా తీర్పు ఇవ్వడం ఆందోళనకరమని న్యాయమూర్తి అన్నారు. జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీలను కోర్టుకు పిలిపించడం.. వారు హాజరుకాని పక్షంలో దానిని ‘కోర్టు ఎదుట జరిగిన నేరం’గా భావించి అదే రోజు హడావుడిగా శిక్ష విధించే అధికారం ఎక్కడిదని ధర్మాసనం నిలదీసింది. బాహుబలిలా ప్రవర్తించడం మానుకోవాలని సూచించింది. కోర్టు ఎదుట హాజరై ప్రత్యక్షంగా అంతరాయాలు కలిగిస్తేనే తక్షణ చర్యలు తీసుకునే అవకాశం జడ్జీలకు ఉంటుందని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఎఫ్ఐఆర్ వేయకపోవడం ఈ కోవలోకి రాదని స్పష్టం చేసింది.

Advertisement

Also Read: బంగారు నగలను”గులాబీ రంగు కాగితం”లోనే ఎందుకు ప్యాక్ చేస్తారో తెలుసా?

Tags

Related News

రూ. 2 కోట్ల నోట్ల దండలు.. వరులకు బావమరిది బంపర్ గిఫ్ట్.. వీడియో వైరల్!

యూపీలో సీట్ల కుస్తీ.. కాంగ్రెస్, ఎస్పీ మధ్య తేలని పొత్తు లెక్కలు.. ఢిల్లీలో 15 నిమిషాలకే ముగిసిన భేటి!

తండ్రి వీలునామాలో పేరు లేకున్నా ఆస్తిలో వాటా పొందిన కొడుకు.. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే

తమిళనాడులో కొత్త చిచ్చు.. కార్తీక దీపంపై రాజకీయ రగడ.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం!

ఢిల్లీలో రూ.55 లక్షల బంగారం మాయం.. 6 రోజుల తర్వాత బెంగళూరులో ట్విస్ట్.. చివరకు ఏం జరిగిందంటే?

నాడు రూ.300 పెట్టుబడి.. నేడు వేల కోట్ల అధిపతి.. రజినీ బెక్టర్ వ్యాపార విజయ ప్రస్థానం ఇదే!

సూట్ విషయంలో భార్యతో గొడవ.. రూ.500 నోట్లకు నిప్పు పెట్టిన భర్త, వీడియో వైరల్!

Big Stories

Advertisement
×