BigTV English

Cookware Products: వామ్మో.. ఈ వంట పాత్రలు అంత డేంజరా? షాకింగ్ విషయాలు వెల్లడించిన పరిశోధకులు!

Cookware Products: వామ్మో.. ఈ వంట పాత్రలు అంత డేంజరా? షాకింగ్ విషయాలు వెల్లడించిన పరిశోధకులు!

USFDA Warning: భారతీయ కంపెనీలు తయారు చేసే వంటపాత్రలు సేఫ్ కాదా? వాటిలో విషపూరిత పదార్థాలు ఉన్నాయా? వీటిలోవంట చేసి తినడం ద్వారా వ్యాధులు సోకే అవకాశం ఉందా? అవుననే అంటుంది  యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA). ముఖ్యంగా భారతీయ కంపెనీ సరస్వతి స్ట్రిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన వంట సామాగ్రి ఆహారంలోకి ప్రమాదకరమైన స్థాయిలో సీసం లీక్ అవుతుందని పరీక్షల్లో తేలిందని వెల్లడించిదంఇ. ఆ వంట సామాగ్రిని ఉపయోగించకూడదని హెచ్చరిక జారీ చేసింది.


ఆ వంట సామాగ్రి అత్యంత డేంజర్!

US హెల్త్ రెగ్యులేటర్ ప్రకారం, ఈ కంపెనీకి చెందిన వంటపాత్రలను టైగర్ వైట్ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నారు. స్వచ్ఛమైన అల్యూమినియం పాత్రలు అని చెప్పుతూ అమ్ముతున్నారు. అల్యూమినియం, ఇత్తడి మిశ్రమాలతో తయారు చేసిన వంట సామాగ్రి ఉపయోగించినప్పుడు సీసాన్ని విడుదల చేస్తాయని పరీక్షల్లో వెల్లడైందని USFDA తెలిపింది. “అల్యూమినియం, ఇత్తడి మిశ్రమాలతో తయారు చేసిన కొన్ని రకాల వంట సామాగ్రి హిండాలియం/హిండోలియం లేదంటే ఇండాలియం/ఇండోలియం అని పిలుస్తారు. వీటిని FDA అధికారులు పరీపరీక్షించారు. వీటిని వంట కోసం ఉపయోగించినప్పుడు ఆహారంలోకి సీసం లీక్ అవుతుందని గుర్తించారు. ఈ ఆహారం సురక్షితం కాదన్నారు” అని US అత్యున్నత ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడించింది.


ఈ వంట సామాగ్రిని న్యూయార్క్‌ జమైకాలోని మన్నన్ సూపర్‌ మార్కెట్‌ లో విక్రయిస్తున్నారని USFDA వెల్లడించింది. రిటైలర్లు అమ్మకాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. వినియోగదారులు ఈ పాత్రల్లో వంట చేయడం లేదంటే తయారు చేసిన ఆహార పదార్థాలను నిల్వ చేయకూడదని సూచించింది.

సీసంతో తీవ్ర ఆరోగ్య సమస్యలు   

సీసం తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని US రెగ్యులేటర్ హెచ్చరించింది. “లెడ్ విషపూరితమైనది. మనుషులకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అన్ని వయసుల వారిపైనా ఈ ప్రభావం ఉంటుంది. తక్కువ స్థాయిలో సీసం  కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీలపై ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది” అని USFDA తెలిపింది. సీసం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో సీసం పరిమాణం పెరుగుతుందని, ఫలితంగా క్యాన్సర్ లాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల్లో IQ లెవల్స్ తగ్గిపోతాయని తెలిపింది.

వినియోగదారులు, రిటైలర్లకు USFDA సూచన

సరస్వతి స్ట్రిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన వంటపాత్రలను వెంటనే నిలిపివేయాలని రిటైలర్లకు సూచించింది. ఇప్పటికే మిగిలిపోయి ఉన్న వంటసామాగ్రిని రిటర్న్ చేయడం లేదంటే అమ్మకాల జాబితా నుంచి తొలగించాలన్నది. వినియోగదారులు వంటపాత్రలను కొనుగోలు చేసే సమయంలో అన్ని వివరాలను పూర్తిగా తనిఖీ చేయాలని సూచించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించింది. నిబంధనలను అతిక్రమించి వంటసామాగ్రిని అమ్మతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Read Also:  డిమార్ట్, మెట్రో.. ఏ స్టోర్ లో సరుకులు చౌకగా దొరుకుతాయంటే?

Related News

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ పండ్లను అస్సలు తినొద్దు !

Lemon Grass Tea: నిమ్మ గడ్డితో.. ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్ !

Kadaknath Chicken: వావ్! నల్ల మాంసం ఇచ్చే కోడి.. దీనిని తింటే ఆ వ్యాధులన్నీ పరార్..

Breakfast: ఉదయం టిఫిన్ చేయడం మానేస్తే.. ఏమౌతుందో తెలుసా ?

Dark Spots: ముఖం పై నల్ల మచ్చలు.. ఇలా చేస్తే చిటికెలో మాయం

Big Stories

×