Suriya: కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు సూర్య(Suriya) ఒకరు. ఈయన పేరుకే తమిళ హీరో అయినప్పటికీ తెలుగు మలయాళ భాషలలో ఈయనకు ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఇక సూర్య నటించిన సినిమాలకు ఇతర భాషలలో కూడా అదే స్థాయిలో ఆదరణ లభిస్తుంది. ఇక సూర్య సినిమా విడుదలవుతుంది అంటే తెలుగులో కూడా అభిమానులు పెద్ద ఎత్తున కటౌట్లను ఏర్పాటు చేస్తూ హంగామా చేస్తుంటారు. ఇలా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో సినిమాకు ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయని తెలుస్తోంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు కమిట్ అయిన సూర్య పలు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
వెంకీ అట్లూరి డైరెక్షన్లో సూర్య…
ఇక సూర్యకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి తెలుగు సినిమాలలో నటించడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగావంశీ నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాతో పాటు సూర్య ఆర్జె బాలాజీ (R.J.Balaji)దర్శకత్వంలో కరుప్పు(Karuppu) అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది ఇదివరకే సినిమా నుంచి టీజర్ కూడా విడుదల చేశారు.
ఆర్థిక ఇబ్బందుల్లో సూర్య కరుప్పు…
డ్రీమ్స్ వారియర్ పిక్చర్ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ఈ దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ ఈ సినిమాకు పెద్ద ఎత్తున ఆర్థిక ఇబ్బందులు తలెత్తినట్టు తెలుస్తుంది. ఇటీవల సూర్య సినిమాలు వరుసగా ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమా కోసం ముందుకు రాలేదు తద్వారా నిర్మాతలు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రస్తుతం అప్పులు తీర్చే పనిలో నిర్మాతలు ఉన్నారని తెలుస్తోంది.
వేసవిని టార్గెట్ చేసిన కరుప్పు…
ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ కూడా సినిమాపై ఏమాత్రం బజ్ క్రియేట్ చేయని నేపథ్యంలో నిర్మాతలు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పట్ల మంచి బజ్ క్రియేట్ కావాలంటే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి. అందుకే సోలో రిలీజ్ కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది దీపావళిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందుకే సూర్య కరుప్పు సినిమాని వచ్చే ఏడాది వేసవి సెలవులలో విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. మరి ఈ సినిమా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి ఈ సినిమా విడుదల గురించి నిర్మాతలు అధికారక ప్రకటన తెలియజేయాల్సి ఉంది.
Also Read: Arundhathi Child Artist: ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కిన అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్!