DMart vs Metro: దేశంలో కిరాణా సామాన్ల నుంచి మొదలుకొని గృహోపకరణాల వరకు డిమార్ట్, మెట్రో క్యాష్ & క్యారీ అనేవి తక్కువ ధరలకు అందిస్తాయి. కానీ, ఈ రెండు స్టోర్ల ధరలు భిన్నంగా ఉంటాయి. ఇందులో వేటిలో చౌకగా వస్తువులు దొరుకుతాయి? ఈ రెండిండి మధ్య తేడాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ ఏ స్టోర్ లో వస్తువులు చౌకగా దొరుకుతాయి?
డిమార్ట్: డిమార్ట్ లో తక్కువ ధరలకు వస్తువులు లభిస్తాయి. ‘ఎవ్రీడే తక్కువ ధర’ (EDLP) అనే వ్యూహాన్ని ఫాలో అవుతుంది. ప్రతి రోజు ఇక్కడ తక్కవు ధరలకు సరుకులు లభిస్తాయి. డిమార్ట్ నేరుగా పెద్ద మొత్తంలో వస్తువులను కొనుగోలు చేయడంతో తక్కువ ధరలకు అమ్ముతుంది. ఇక్కడ కిరాణా సామాన్లపై ఏకంగా 7 నుంచి 16 శాతం తగ్గింపు ధర లభిస్తుంది. పండ్లు, కూరగాయలు, బాడీ వాష్ లాంటి వస్తువుల ధరలు కూడా కొన్నిసార్లు తక్కువ ధరలకే లభిస్తాయి.
మెట్రో: మెట్రో క్యాష్ & క్యారీ ప్రధానంగా చిన్న దుకాణాలు, హోటళ్ళు, రెస్టారెంట్ల లాంటి వాటికి అనుకూలంగా ఉంటుంది. ఇది పెద్ద పరిమాణంలో ఉత్పత్తులను విక్రయిస్తుంది. ఎక్కువ మొత్తంలో వస్తువులు కొనుగోలు చేసే వారికి చౌక ధరలకే లభిస్తాయి. కిరాణా సామాన్లు, గృహోపకరణాలను కొనుగోలు చేసే సాధారణ దుకాణదారులకు డిమార్ట్ బెస్ట్. వ్యాపారాలు, పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే వ్యక్తులకు మెట్రో మంచిది.
⦿ డిమార్ట్, మెట్రో మధ్య తేడా ఏంటి?
డిమార్ట్: ఇది రిటైల్ స్టోర్. ఇక్కడ ఎవరైనా కిరాణా సామాగ్రి, సబ్బులు, స్నాక్స్ లాంటి రోజువారీ అవసరాల కోసం వెళ్లి షాపింగ్ చేయవచ్చు.
మెట్రో: చిన్న దుకాణాలు, రెస్టారెంట్లు వంటి వ్యాపారాల కోసం వస్తువులు అమ్ముతారు. ఇది హోల్ సేల్ స్టోర్. కానీ, ఇప్పుడు సాధారణ వ్యక్తులు మెట్రో యాప్ ని ఉపయోగించి అక్కడ షాపింగ్ చేయవచ్చు.
⦿ ఎందులో ఏ వస్తువులను అమ్ముతారు?
డిమార్ట్: కిరాణా సామాగ్రి, టాయిలెట్లు శుభ్రపరిచే ఉత్పత్తులు, బట్టలు, చెప్పులను అమ్ముతుంది. డిమార్ట్ కూడా Premia లాంటి స్వంత బ్రాండ్లను కలిగి ఉంది. అవి ఇంకా చౌకగా ఉంటాయి.
మెట్రో: కిరాణా సామాగ్రి, తాజా పండ్లు, కూరగాయలు, డ్రింక్స్, ఎలక్ట్రానిక్స్, వ్యాపారాల కోసం వస్తువుల లాంటి ఉత్పత్తులను విక్రయిస్తుంది. ఇది పెద్దమొత్తంలో కొనడానికి చాలా బాగుంటుంది. సాధారణ ఉపయోగం కోసం చిన్న ప్యాక్ లు ఉండవు.
⦿ డిస్కౌంట్లు, ఆఫర్లు
డిమార్ట్: పెద్ద అమ్మకాలకు బదులుగా ప్రతిరోజూ తక్కువ ధరలపై దృష్టి పెడుతుంది. దీపావళి, హోలీ లాంటి పండుగల సమయంలో ఇది కాంబో డీల్స్, ప్రత్యేక ఆఫర్లను అందస్తుంది. స్వంత బ్రాండ్ల మీద 10-20% ఎక్కువ ఆదా అందిస్తాయి. దేశం అంతటా 330 కంటే ఎక్కువ స్టోర్లను కలిగి ఉంది. నగరాలు, పట్టణాలలో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. డిమార్ట్ రెడీ ఆన్ లైన్ స్టోర్, ముంబై, పూణే, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో అందుబాటులో ఉంటుంది. ఇక్కడి నుంచి వస్తువులను డోర్ డెలివరీ ఇస్తారు.
మెట్రో: బల్క్ కొనుగోలుదారులకు బెస్ట్ డీల్స్ అందిస్తుంది. పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినప్పుడు మెరుగైన ధరలను పొందుతాయి. దాదాపు 30-50 దుకాణాలు ఉన్నాయి. ఎక్కువగా పెద్ద నగరాల్లో ఉంటాయి. మెట్రోలో ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ కూడా ఉంది. కానీ, ప్రధానంగా పెద్దమొత్తంలో కొనుగోలు చేసే వ్యాపారాల కోసం. ఇది సాధారణ దుకాణదారులకు అంత సౌకర్యవంతంగా ఉండదు.
Read Also: డిమార్ట్ లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏ రోజుల్లో మరింత చీప్ గా కొనేయొచ్చు?