బిగ్ బాస్ తో అందరికి దగ్గరైన అషూ రెడ్డి బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నట్టు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది. ఆమెకు బ్రెయిన్ సర్జరీ ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు ఆమె అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో, బ్రెయిన్ సర్జరీ ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ పూర్తి వివరాలు ఆమె బయట పెట్టలేదు. అయితే ఆమెకు బ్రెయిన్ సర్జరీ జరిగిన విషయం మాత్రం నిజమే. బ్రెయిన్ సర్జరీ అనేది మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు జరుగుతుంది.
కారణాలు ఇవిగో
మెదడులో ట్యూమర్ ఏర్పడడం లేదా రక్త స్రావం జరగడం, నరాల సంబంధిత రుగ్మతలు లేదా న్యూరోలాజికల్ సమస్యలు వచ్చినప్పుడే బ్రెయిన్ సర్జరీని చేస్తారు. మెదడులో ట్యూమర్స్ ఏర్పడినప్పుడు అవి గుండెకు లేదా ఇతర అవయవాలకు వ్యాపించకుండా శస్త్ర చికిత్స చేసి ఆ ట్యూమర్లను తొలగిస్తారు. అలాగే మెదడులో రక్తస్రావం జరిగినప్పుడు కూడా ప్రాణాంతకమైన పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని అరికట్టేందుకు కూడా ఆపరేషన్ చేస్తారు.
హైడ్రోసెఫాలస్
మెదడులో అధికంగా ద్రవం చేరడం వల్ల ఈ హైడ్రోసెఫాలస్ అనే వ్యాధి వస్తుంది. అషూ రెడ్డికి ఈ సర్జరీ ఎందుకు జరిగిందనే విషయంపై ఇంకా స్పష్తట రాలేదు. కానీ ఇక్కడ చెప్పిన సమస్యల్లో ఏదో ఒకటి కారణమయ్యే అవకాశం ఉంది.
బ్రెయిన్ సమస్యలు రావడానికి శారీరకంగా, జన్యుపరంగా, జీవన శైలి పరంగా ఎన్నో రకాల కారకాలు ఉండవచ్చు. అందులో ముఖ్యమైనవి ఇక్కడ చెప్పుకుందాం.
జన్యు కారణాలు
కొన్ని బ్రెయిన్ సమస్యలు అంటే అల్జీమర్స్, పార్కిన్ సన్స్ వంటివి జన్యుపరంగా వస్తాయి. అంటే అవి వారసత్వంగా తల్లిదండ్రులు, తాతల నుంచి పిల్లలకు వచ్చి ఆరోగ్య సమస్యలు. కుటుంబ చరిత్రలో ఎవరికైనా మెదడు సంబంధిత వ్యాధులు ఉంటే వారి వారసులు కూడా వాటి బారిన పడే అవకాశం ఎక్కువ.
మెదడుకు గాయాలు
తలకు గాయాలు తగిలినప్పుడు అంటే యాక్సిడెంట్ల సమయంలో మెదడులో రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కూడా బ్రెయిన్ సర్జరీ అవసరం పడుతుంది.
ఇన్ఫెక్షన్స్
మెదడును ప్రభావితం చేసే ఇన్ఫెక్షన్లు ఎన్నో ఉన్నాయి. వాటిలో మెనింజైటిస్, వైరస్ లు, బ్యాక్టీరియాలు, ఫంగస్, ఎన్సెఫాలైటిస్ వంటివి ముఖ్యమైనవి. ఇవి కూడా మెదడును దెబ్బతీస్తాయి. మూర్ఛా వంటి వ్యాధులు బారిన పడేలా చేస్తాయి. అలాంటి సమయంలో కూడా మెదడుకు సర్జరీ చేస్తూ ఉంటారు.
మెదడులో అసాధారణంగా కణితులు ఏర్పడి కణాల అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడా ఆ గడ్డలను తొలగించేందుకు ఆపరేషన్ చేస్తారు. అలాగే రేడియేషన్ థెరపీ కూడా అవసరం పడుతుంది.
అని ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం చేయకపోవడం, ధూమపానం, మద్యపానం బట్టి చెడు అలవాట్లు మాదకద్రవ్యాల వినియోగం వంటివి కూడా మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నిద్రలేమి, దీర్ఘకాలిక ఒత్తిడి వంటివి కూడా పనితీరును ప్రభావితం చేస్తాయి. అవి కూడా మెదడు సమస్యలకు కారణం అవుతాయి.
డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు కూడా మెదడులో రసాయనాలను దెబ్బతీస్తాయి. అలాంటప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్లు అసమతుల్యత ఏర్పడుతుంది. పోషకాహార లోపాలు కూడా దీనికి కారణం కావచ్చు. అలాంటప్పుడు కూడా జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయి.
రాకుండా ఏం చేయాలి
సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో అధికంగా పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ద్రవాహారాన్ని కూడా అధికంగా తీసుకోవాలి. నిద్రలేమి సమస్యను అధిగమించాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు సురక్షితంగా డ్రైవ్ చేయాలి. హెల్మెట్ కచ్చితంగా ధరించాలి. రెగ్యులర్ గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా అవసరం.