Threat to Gambhir: టీమిండియా హెడ్ కోచ్, బిజెపి పార్టీ మాజీ పార్లమెంటు సభ్యులు గౌతమ్ గంభీర్ కు ( Gautam Gambhi ) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆయనను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. గౌతమ్ గంభీర్ ను హత్య చేస్తామని.. కొంత మంది బెదిరింపులకు దిగుతున్నారట. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ( PahalgamTerroristAttack ) పర్యాటక క్షేత్రంలో ఉగ్రవాదులు దారుణ సంఘటనకు తెరలేపిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా ( Team India) హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు కూడా బెదిరింపులు వస్తున్నాయి.
Also Read: Memes on PSL : ఇదెక్కడి క్రికెట్ రా PSLలో లారీలు వస్తున్నాయి… త్వరలో రైలు కూడా వస్తాయి
అది కూడా ఐసిస్ (ISIS) కాశ్మీర్ ప్రాంతం నుంచి గంభీర్ కు బెదిరింపులు వస్తున్నాయి అని సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే కాశ్మీర్ నుంచి తనకు బెదిరింపులు వచ్చినట్లు… స్వయంగా ఢిల్లీ పోలీసులకు ( Delhi Police) ఫిర్యాదు చేశాడు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. తన కుటుంబానికి కూడా ప్రమాదం పొంచి ఉందని… ఈ నేపథ్యంలోనే తమకు భద్రత కల్పించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు గౌతమ్ గంభీర్. తనతో పాటు తన కుటుంబానికి కూడా.. టైట్ సెక్యూరిటీ ఇవ్వాలని కూడా కోరారు. అయితే ఈ బెదిరింపులు చేసింది పాకిస్తాన్ ఉగ్రవాదులు ( Pakistani terrorists ) అని అధికారులు అనుమానిస్తున్నారు. అటు జమ్మూ కాశ్మీర్ ( Jammu Kashmir) ప్రాంతంలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఈ తరహా బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా చర్చ నియాంశమైంది. వెంటనే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు భద్రత కల్పించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: SRH VS MI: ఇంకా SRHకు ప్లే ఆఫ్స్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి… ఈ మ్యాచ్ లు గెలుస్తే చాలు
ఇది ఇలా ఉండగా గతంలో బిజెపి పార్లమెంటు సభ్యులుగా…. గౌతమ్ గంభీర్ పనిచేసిన సంగతి తెలిసిందే. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో… ఢిల్లీ నుంచి ఎంపీగా గెలిచారు. ఐదు సంవత్సరాల పాటు ఢిల్లీ ఎంపీగా పనిచేసిన గౌతమ్ గంభీర్… ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత బిజెపి పార్టీకి కూడా రాజీనామా చేయడం జరిగింది. బిజెపి పార్టీ అలాగే రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత…. గౌతమ్ గంభీర్ కు బంపర్ ఆఫర్ తగిలింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆఫర్ ఇచ్చింది. దీంతో టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ( Coach Gautam Gambhir) ఫైనల్ అయ్యారు. అతని కెప్టెన్సీ లోనే మొన్న చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ గెలుచుకుంది టీమిండియా. ఇక ఇప్పుడు గౌతమ్ గంభీర్ ను కొంతమంది టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అతన్ని హత్య చేస్తామని… బెదిరింపులకు పాల్పడుతున్నారు కొంతమంది దుర్మార్గులు. దీంతో చేసేదేమీ లేక ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు గౌతమ్ గంభీర్. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.