E-Paper
Advertisement

Apple: షుగర్‌ ఉన్నవాళ్లు యాపిల్‌ తింటే ఏమవుతుంది?

Apple: షుగర్‌ ఉన్నవాళ్లు యాపిల్‌ తింటే ఏమవుతుంది?
Advertisement

ప్రస్తుత కాలంలో చాలామంది మధుమేహంతో బాధపడుతున్నారు. అయితే మధుమేహం ఉన్నవారు ఏయే ఆహారాలు తీసుకోవాలనే విషయంలో కాస్త అయోమయానికి గురవుతుంటారు. మామిడి, ద్రాక్ష, సపోటా, సీతాఫలం పండ్లను మధుమేహం ఉన్నవారు దూరంగా పెడితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో పెరిగే చక్కెర స్థాయిలు కూడా శరీరంలోని ముఖ్య అవయవాలకు నష్టం చేకూరుస్తాయి. అందుకే మధుమేహం ఎక్కువ అయ్యేవరకు ఈ పరిస్థితి తెచ్చుకోవద్దని అంటున్నారు. మధుమేహం స్త్రీ ,పురుషులు ఎవరికైనా రావచ్చు. రక్తప్రసరణంలో చక్కెర శాతం తక్కువ అయితే షుగర్ ఉన్నట్లు గుర్తిస్తారు. ముఖ్యంగా షుగర్‌ను టైప్ 1, టైప్‌2 అని రెండు రకాలుగా వర్గీకరించారు. అంతేకాకుండా చిన్నపిల్లలు, గర్భిణులకు కూడా వచ్చే షుగర్‌ వస్తుంది. ఇది మూడు రకాలుగా ఉంటుంది. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసేందుకు నిపుణులు పరిశోధనల ద్వారా కృషి చేస్తున్నారు. మధుమేహం వ్యాధితో గుడ్డితనం, గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయి. షుగర్ వ్యాధిని నయం చేసుకోకపోతే ప్రమాదకర జబ్బులకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే మధుమేహం ముదరకముందే ముందుగానే గుర్తించి ఆహారం జీవన విధానంలో మార్పులు చేసుకుంటే అరికట్టవచ్చని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఆహారంలో కొన్ని పదార్థాలు తీసుకోవడం వల్ల షుగర్‌ను అదుపులో పెట్టుకోవచ్చు. అవేంటంటే యాపిల్, బొప్పాయి.. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. యాపిల్‌ చక్కెర స్థాయిలను పెంచేస్తుందని కంగారుపడుతూ ఉంటారు. కానీ నిజానికి అది కరెక్ట్ కాదు. యాపిల్లో విటమిన్ సి, ఫైబర్‌ ర్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పైగా రుచి కూడా బాగుంటుంది. కాబట్టి తీపి తినేందుకు భాగ్యం లేదని బాధపడేవారు యాపిల్ తినడం వల్ల ఆ కోరికను నెరవేర్చుకోవచ్చు. యాపిల్‌లో నీటి శాతం కూడా అధికంగానే ఉంటుంది. తినగానే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అంతేకాకుండా యాపిల్‌లో క్యాలరీల శాతం కూడా తక్కువే. అయితే యాపిల్ పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుందని చాలామంది సందేహ పడతారు. కానీ యాపిల్‌లో ఉండే ఫైబర్ ఆ రెండిటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఫలితంగా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. తక్కువ గ్లైసమిక్‌ ఇండెక్స్ ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామ ఒక అద్భుతమైన ఫలం. ఇది ప్రతిరోజు తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిని నిరంతరం అదుపులో ఉంచుతుంది. 100 గ్రాముల జామలో 9 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది. కాబట్టి అతిగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. మితంగా తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Tags

Related News

మాత్రను నోట్లో వేసుకుని నీళ్లు తాగాలా? లేదా నీళ్లతోపాటు మాత్ర వేసుకోవాలా? ఏది డేంజర్?

ప్లాస్టిక్ స్టూళ్ల మధ్య రంధ్రం.. డిజైన్ కోసం కాదా? కారణం తెలిస్తే పక్కా షాకవుతారు!

అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. రూ.46 లక్షల సాలరీ.. అన్నీ వదిలి ఇండియన్ ఆర్మీలోకి

బిడ్డకు ఆకలి వేసిందో లేదో ఎలా తెలుసుకోవాలి? తల్లిదండ్రులకు రెస్పాన్సివ్ ఫీడింగ్ గైడ్

మనసంతా ప్రేమ.. ఈ తేదీల్లో పుట్టినవారిని పెళ్లి చేసుకుంటే మీరు చాలా లక్కీ

పండుగ వేళ అందరిలో స్పెషల్‌గా కనిపించాలా? ఈ 5 మేకప్ లుక్స్ ట్రై చేయండి

డేటింగ్‌కు వెళ్లినప్పుడు బిల్లు ఎవరు చెల్లించాలి? 2026లో కొత్త ట్రెండ్ గురూ

పిల్లలు ఇంటి గోడలపై డ్రాయింగ్ వేస్తూ పాడు చేశారా? నో టెన్షన్ క్రేయాన్ మరకలు క్లీన్ చేసే సింపుల్ ట్రిక్స్ ఇవిగో

Big Stories

Advertisement
×