E-Paper
Advertisement

Asparagus: తోటకూర ప్రయోజనాలు చూస్తే ఆశ్చర్యపోతారు

Asparagus: తోటకూర ప్రయోజనాలు చూస్తే ఆశ్చర్యపోతారు
Advertisement

Asparagus : కూరగాయల కంటే ఆకుకూరల్లో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో మేలుని చేకూరుస్తాయి. నిత్యం ఆకుకూరలను తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ ఆకుకూరల్లో తోటకూర రారాజు. తోటకూరలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ఈ తోటకూరలో చాలా రకాలు ఉన్నప్పటికీ అన్ని రకాల లోనూ ఒకే రకమైన పోషకాలు మనకు అందుతాయి. ఈ తోటకూరతో చేసే వంటకాలు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా కలుగజేస్తాయి. తోటకూర తినడానికి చాలామంది ఇష్టపడరు. అసలు ఇందులో పసరు ఎక్కువగా ఉంటుందని అనుకుంటుంటారు. కానీ అది ఏ మాత్రం నిజం కాదు. తోటకూర అలా కనిపిస్తుంది. కానీ అది తింటే మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ తోటకూరలో మన శరీరానికి అవసరమైన పోషకాలు, కంటి ఆరోగ్యానికి కీలకమైన విటమిన్ ఏ అందుతుంది. అంతేకాకుండా విటమిన్ కె, సి, బి6, ఫొలైట్‌, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ తోటకూర మన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. ఈ ఆకుల్లో ఉండే మాంగనీస్, కాపర్ , క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్ వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతాము. తోటకూరలో ఐరన్ శాతం అధికంగా ఉండటం వల్ల రక్తలేమి సమస్య నుంచి బయటపడేస్తుంది. ఈ రక్తలేమి సమస్య ఉన్నవారు ప్రతిరోజు తోటకూరలు భోజనంలో భాగంగా చేసుకుంటే మంచిది. ఆయుర్వేదిక్ మందుల్లో కూడా ఈ ఆకుల రసాన్ని ఉపయోగిస్తారు. బరువు తగ్గాలనుకునేవారు రోజువారి డైట్లో తోటకూర తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తోటకూరలో ఉండే ఫైబర్ మన జీర్ణ క్రియను మెరుగుపరిచి కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజన్ మారినా గాని వచ్చే వైరస్‌ల నుంచి మనం బయటపడవచ్చు. మాంసంతో సమానంగా ప్రోటీన్లు తోటకూరలో ఉంటాయి. ఈ తోటకూర తింటే కండరాలు దృఢంగా తయారవుతాయి. నిత్యం వ్యాయామం చేసేవారు తోటకూరను తినాలి. తోటకూరలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఎదిగే పిల్లలు తోటకూర తింటే ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. అంతేకాకుండా షుగర్ వ్యాధిగ్రస్తులు తోటకూర తింటే నెమ్మదిగా జీర్ణమవుతుంది. శరీరానికి కావలసిన శక్తి కూడా అందుతుంది. రక్తంలో గ్లూకోస్ అదుపులో ఉంచుతుంది. తోటకూరను వేపుడుగా కాకుండా కూరగా చేసుకుంటే పోషకాలు మన శరీరానికి మరింత అందుతాయని నిపుణులు అంటున్నారు.

Tags

Related News

మీ కండరాలు త్వరగా ముసలిబారుతున్నాయా? ఇంట్లోనే ఈ మూడు పరీక్షలు చేసి తెలుసుకోండి

నోట్లో వేయగానే కరిగిపోయే క్రిస్పీ ఫిష్ అమృత్‌సరి.. ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా ఇలా చేసుకోండి!

చికెన్ కీమా పరోటా ఇలా చేసుకుని తిన్నారంటే.. టేస్ట్ వేరే లెవెల్ అంతే!

హోటల్ స్టైల్ పూరీ కర్రీ..ఇంట్లోనే పక్కా కొలతలతో ఇలా చేయండి!

పక్కా కొలతలతో అదిరిపోయే టమాటో పచ్చడి..ఎన్ని రోజులైనా టేస్ట్ మారదు!

దీపావళికి ఇంటి టెర్రస్‌పై పార్టీ ఐడియా అదుర్స్.. ఈ విధంగా డెకరేషన్ చేయండి

30 ఏళ్లు దాటాక చేతులు, కాళ్ల చర్మంపై ముడతలు కనిపిస్తున్నాయా? ఈ 4 చిట్కాలు పాటించండి

మాట్లాడేటప్పుడు కళ్లు పక్కకు తిప్పడం బలహీనత కాదా? సైకాలజీ చెప్తున్న అసలు నిజమిదే!

Big Stories

Advertisement
×