Premature Menopause: సాధారణంగా అయితే 40 ఏళ్లు పైబడిన తర్వాత ఆడవారిలో మెనోపాజ్ వస్తుంది. ఈ సమయంలో రుతుక్రమం శాశ్వతంగా ఆగిపోతుంది. కొందరిలో 45 నుండి 55 సంవత్సరాల మధ్య వయసులో మెనోపాజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే కొంత మంది మహిళల్లో 40 ఏళ్ల కన్నా ముందే రుతుక్రమం ఆగిపోతంది. దీన్నే ప్రీమెచ్యూన్ మెనోపాజ్ అని పిలుస్తారట. ఈ దశలో ఆడవారు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కునే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
సంతానలేమి:
ప్రీమెచ్యూన్ మెనోపాజ్ కారణంగా చాలా మందిలో సంతానలేమి వచ్చే ప్రమాదం ఉందని గైనకాలజిస్ట్‌లు వెల్లడిస్తున్నారు. అండాశయం సరిగా పని చేయకపోవడం వల్ల ఓవ్యూలేషన్ ప్రక్రియ జరిగినా అండాలు నాణ్యత లేకుండా ఉంటాయట. ఆలస్యంగా పెళ్లి చేసుకునే ఆడవారిలో ఈ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందట. ప్రీమెచ్యూన్ మెనోపాజ్ వల్ల చాలా మందిలో గర్భం పొందటానికి కూడా కష్టం అవుతుంది. ఒక వేళ గర్భం దాల్చినా అది ఎక్కువ కాలం నిలవకపోవచ్చట. అలాంటి పరిస్థితుల్లో గర్భస్రావం అవుతుందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.
ALSO READ: ఆలివ్ ఆయిల్‌తో ఇన్ని ప్రయోజనాలా..?
హార్మోనల్ ఇంబాలన్స్:
ప్రీమెచ్యూన్ మెనోపాజ్ కారణంగా, ఇస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ లాంటి మహిళా హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుందట. దీంతో శరీరంలో అనేక మార్పులు వచ్చే ఛాన్స్ ఉంది. కొంత మంది ఆడవారిలో హార్మోనల్ ఇంబాలన్స్ కారణంగా విపరీతమైన మూడ్ స్వింగ్స్ వస్తాయి. ఫలితంగా డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి.
చర్మ సమస్యలు:
ఈ హార్మోనల్ ఇంబాలన్స్ వల్ల చర్మం పొడిబారడం వంటివి కూడా జరుగుతాయట. మరికొందిరికేమో కండరాలు వదులుగా మారిపోయి. ప్రీమెచ్యూన్ మెనోపాజ్ కారణంగా చాలా మందికి చర్మం విపరీతంగా ముడతలు పడుతుందట.
ప్రీమెచ్యూన్ మెనోపాజ్ వల్ల ఎముకలపై కూడా చెడు ప్రభావం పడుతుందట. దీంతో తరచుగా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరికొందరిలో శరీర వేడి అధికంగా పెరిగే ఛాన్స్ ఉందట.
ఇప్పటికే ప్రీమెచ్యూన్ మెనోపాజ్ ఉన్న మహిళలు తమ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రీమెచ్యూన్ మెనోపాజ్ ప్రభావాన్ని తగ్గించేందుకు తరచుగా డాక్టర్ హెల్ప్ తీసుకోవాలని చెబుతున్నారు. దీని ప్రభావాన్ని పూర్తిగా తగ్గించకపోయినా హార్మోనల్ థెరపీ ద్వారా చికిత్స తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.