BigTV English

Hepatitis B: హెపటైటిస్ బి అంటే ఏమిటి ? ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ?

Hepatitis B: హెపటైటిస్ బి అంటే ఏమిటి ? ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ?

Hepatitis B: దేశ వ్యాప్తంగా నిత్యం ఇన్ఫెక్షన్ కారణంగా మరణించే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హెపటైటిస్ బి.. ఇటీవల 2, 700 మందికి పైగా మరణాలకు కారణం అవుతోంది. ఇదిలా ఉంటే ఈ వ్యాధి బారిన పడి 2024 లో 607 మంది మరణించారు. అత్యధిక మరణాలు మహారాష్ట్రలో నయోదయ్యాయి. ఇంత ప్రమాదకరం అయిన ఈ వ్యాధి ఎలా వస్తుంది ? నివారణ మార్గాలను సంబంధించిన పూర్తి వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


కాలేయాన్ని ప్రభావితం చేసే ఈ ఇన్ఫెక్షన్ ఇతర తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతుంది. హెపటైటిస్ చాలా కాలం పాటు ఉన్నా కూడా జాగ్రత్తలు పాటించకపోతే అది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

గత ఐదు సంవత్సరాలలో హెపటైటిస్ బి మరణాల సంఖ్య చాలా వరకు పెరిగింది. 2019-20 సంవత్సరంలో 173 మరణాలు నమోదవగా 2020-21లో ఈ సంఖ్య 139కి తగ్గింది. అయితే.. 2021-22లో హెపటైటిస్-బి సంబంధిత మరణాలలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. 323 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. 2023-24లో 972 మరణాలు, 2025లో 607 మరణాలు నమోదయ్యాయి.


హెపటైటిస్ బి కారణంగా అత్యధిక మరణాలు మహారాష్ట్ర (124), గుజరాత్ (95), పశ్చిమ బెంగాల్ (80), ఉత్తరప్రదేశ్ (79), మధ్యప్రదేశ్ (72), రాజస్థాన్ (64)లలో నమోదయ్యాయి.

హెపటైటిస్ తో కాలేయానికి నష్టం:
హెపటైటిస్ సి, ఎ , ఇ నిర్ధారణ , చికిత్స కోసం జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఆధ్వర్యంలో ప్రభుత్వం 2018లో జాతీయ వైరల్ హెపటైటిస్ నియంత్రణ కార్యక్రమం (NVHCP)ని ప్రారంభించింది. హెపటైటిస్ బి, సి రెండూ వైరస్‌ల వల్ల కలిగే కాలేయ వ్యాధులు,.కానీ వాటి వైరస్‌లు భిన్నంగా ఉంటాయి. అంతే కాకుండా వ్యాపించే విధానం కూడా కొద్దిగా భిన్నంగా ఉంటుంది.

హెపటైటిస్ బి అనేది హెపటైటిస్ బి వైరస్ (HBV) వల్ల కలిగే కాలేయ సంక్రమణ. చాలా మందిలో హెపటైటిస్ బి స్వల్పకాలికం. అయితే.. ఇన్ఫెక్షన్ 6 నెలల కన్నా ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం దీర్ఘకాలిక హెపటైటిస్ బి కాలేయ వైఫల్యం, కాలేయ క్యాన్సర్ , కాలేయ సిర్రోసిస్ వంటి సమస్యల ప్రమాదాన్ని కలిగిస్తుంది.

హెపటైటిస్ బి గురించి మరిన్ని విషయాలు:
హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ రక్తం, వీర్యం లేదా ఇతర శరీర ద్రవాల ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. ఇది తుమ్మడం లేదా దగ్గడం ద్వారా వ్యాపించదు. అంతే కాకుండా ఇది సోకిన గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో శిశువులకు కూడా ఇన్ఫెక్షన్‌ను వ్యాపింపచేస్తారు.

ఈ ఇన్ఫెక్షన్ కారణంగా, అలసట, కామెర్లు, కడుపు నొప్పి, వాంతులు, యూరిన్ రంగు మారడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి టీకాలు అందుబాటులో ఉన్నాయి. నవజాత శిశువులకు టీకాలు వేయలేకపోయినప్పుడు పిల్లలు ఈ టీకాను తప్పనిసరిగా వేయించుకోవాలి.

Also Read: ఇంట్లోనే పెరుగుతో.. ఫేషియల్ చేసుకోండిలా !

హెపటైటిస్ సి ప్రమాదం:
హెపటైటిస్ బి లాగే, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ కాలేయానికి వాపు , నష్టాన్ని కలిగిస్తుంది. యాంటీవైరల్ మందులతో దీనికి చికిత్స చేయవచ్చు. వైరస్ ఉన్న రక్తం మీ శరీరంలోకి ప్రవేశించినప్పుడు.. అది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని కలిగిస్తుంది.

దీని లక్షణాలు అంత స్పష్టంగా ఉండవు. అందుకే సకాలంలో గుర్తించడం కష్టం. ఈ ఇన్ఫెక్షన్ వల్ల కామెర్లు, అలసట, వికారం, జ్వరం , కండరాల నొప్పి వంటి సమస్యలు వస్తాయి. హెపటైటిస్ సి ని నివారించడానికి ప్రస్తుతం టీకా లేదు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×