BigTV English
Advertisement

Olive Oil: ఆలివ్ ఆయిల్‌‌తో.. ఇన్ని ప్రయోజనాలా ?

Olive Oil: ఆలివ్ ఆయిల్‌‌తో.. ఇన్ని ప్రయోజనాలా ?

Olive Oil: ఆలివ్ ఆయిల్‌ను ఆహార పదార్థాల తయారీలతో పాటు ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించినప్పుడు దాని దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? దీనిని సూపర్ ఫుడ్‌గా కూడా పరిగణిస్తారు. ఇందులోని పోషకాలు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ పరిశోధన ప్రకారం ప్రతిరోజూ అర టీస్పూన్ కంటే ఎక్కువ ఆలివ్ నూనె తీసుకునేవారికి ఇతరులతో పోలిస్తే 28% తక్కువ మతిమరుపు వచ్చే ప్రమాదం ఉంది.

గుండెకు మేలు చేస్తుంది:
ఆలివ్ ఆయిల్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. ఇందులో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వు , పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి మీ గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.


మెదడు ఆరోగ్యానికి ప్రయోజనకరం:
ఆలివ్ ఆయిల్ మెదడుకు కూడా చాలా మంచిదని భావిస్తారు. ఇందులో అనేక లక్షణాలు ఉంటాయి. ఇవి మీ మనసును ప్రశాంతపరుస్తాయి. తరచుగా ఆలివ్ ఆయిల్ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

క్యాన్సర్‌:
45 అధ్యయనాల విశ్లేషణలో పచ్చి ఆలివ్ నూనెను తీసుకునే వ్యక్తులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 31% తక్కువగా ఉందని తేలింది. క్యాన్సర్ పెరుగుదలను కూడా ఆలివ్ ఆయిల్ నివారిస్తుంది.

మధుమేహం కోసం:
ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర , ఇన్సులిన్ స్థాయిలు అదుపులో ఉంటాయని పరిశోధనలో తేలింది. ఒక అధ్యయనంలో రోజుకు 25 గ్రాముల ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 22% తగ్గిందని తేలింది. మధుమేహం ఉన్న వారు ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.

ఈ రోజుల్లో ప్రజలు ఆరోగ్యం పట్ల స్పృహ పెంచుకుంటున్నారు. అందుకే వారు తమ తినే వంట పద్ధతుల్లో చాలా మార్పులు చేసుకోవడం ప్రారంభించారు. వంటగదిలో శుద్ధి చేసిన నూనెకు బదులుగా ఆలివ్ నూనెను ఉపయోగించడం ప్రారంభించారు . ఈ నూనె చాలా ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. ఇది చాలా మంచి రుచిని ఆహార పదార్థాలకు కలిగిస్తుంది.

ఆలివ్ ఆయిల్ ఆహార పదార్థాల తయారీలో చాలా తక్కువ వేడి చేసి వాడాలి. ఆలివ్ ఆయిల్ తో వంట చేసేటప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవలసిన విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తేడా అర్థం చేసుకోండి:
మీరు ఆలివ్ ఆయిల్‌తో వంట చేస్తున్నప్పుడు.. అన్ని ఆలివ్ ఆయిల్ లు ఒకేలా ఉండవని మీరు తెలుసుకోవాలి. వాటి మధ్య తేడాను మీరు అర్థం చేసుకోవాలి.

Also Read: ఉల్లిపాయ రసంలో ఈ 2 కలిపి రాస్తే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది !

అతిగా వాడకండి​:
చాలా మంది ఆలివ్ నూనె ఆరోగ్యకరమైనదని భావిస్తారు . అందుకే వారు ఎటువంటి ఆందోళన లేకుండా దానిని ఉపయోగిస్తారు. ఆలివ్ నూనె ఆరోగ్యకరమైనది అనేది నిజం ఎందుకంటే ఇందులో మంచి కొవ్వులు , యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. కానీ ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీనిని పరిమిత పరిమాణంలో వాడండి.

Related News

Saliva Test: ఏంటి నిజమా? లాలాజలంతో గుండె పనితీరు గుర్తించొచ్చా..! అదెలా ?

Tips For Hair: జుట్టు త్వరగా పెరగాలా ? అయితే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Banana: ఖాళీ కడుపుతో అరటిపండు తింటే.. జరిగేది ఇదే ?

Heart Health:గుండె జబ్బులు ఉన్నాయని తెలిపే.. సంకేతాలు ఇవేనట !

Fruits For Weight loss: బరువు తగ్గాలనుకునే వారు.. ఎలాంటి ఫ్రూట్స్ తినాలి ?

Dark Tourism: చీకటి అధ్యాయాలపై ఉత్సుకత.. నాణేనికి మరో వైపే డార్క్ టూరిజం!

Zumba Dance: బోరింగ్ వర్కౌట్స్‌తో విసుగొస్తుందా.. అయితే మ్యూజిక్ వింటూ స్టెప్పులేయండి!

Karivepaku Rice: కరివేపాకు రైస్ పావు గంటలో చేసేయొచ్చు, రెసిపీ చాలా సులువు

Big Stories

×