BigTV English

Alekhya Chitti Pickles: పచ్చళ్లు అమ్ముకోండి పర్వాలేదు.. ఆ పచ్చి బూతులు ఎందుకమ్మా?

Alekhya Chitti Pickles: పచ్చళ్లు అమ్ముకోండి పర్వాలేదు.. ఆ పచ్చి బూతులు ఎందుకమ్మా?

సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికెల్స్ పేరుతో ఓ యువతి చేసే బిజినెస్ బాగా పాపులర్ అయ్యింది. ఏపీలోని రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు.. అలేఖ్య చిట్టి పికెల్స్ పచ్చళ్ల బిజినెస్‌తో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే, పాపులారిటీ పెరిగితే.. విమర్శలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వీరిపై ట్రోల్స్ మమూలుగా ఉండవు. అవన్నీ తట్టుకుంటూ ఈ అక్కా చెల్లెళ్లు తమ బిజినెస్‌ను ఎంతో ధైర్యంగా కొనసాగిస్తున్నారు. ఇందుకు వారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. వీరు తయారు చేసే నాన్ వెజ్ పికిల్స్‌కు మంచి డిమాండ్ ఉంది. అయితే రేట్ల విషయంలోనే కస్టమర్లు నోరెళ్ల బెడుతున్నారు. తాజాగా ఓ కస్టమర్ వారిని వాట్సాప్ ద్వారా పచ్చళ్లు ఆర్డర్ ఇవ్వడానికి ట్రై చేశాడని, పచ్చళ్లకు అంత రేటు అన్నందుకు.. ఆ అక్క చెల్లెళ్లో ఒకరు దారుణమైన బూతులతో సమాధానం చెప్పారంటూ సోషల్ మీడియాలో పలు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.


కస్టమర్ పై నోరుపారేసుకున్నట్లు ప్రచారం

ఏ వ్యాపారం చేసే వారైనా వినియోగదారుల పట్ల మర్యాదగా వ్యవహరించడం అనేది చాలా ముఖ్యం. ఏ విషయం గురించి ఎలా అడిగినా, అణకువగా సమాధానం చెప్పాలి. ఫాలోయింగ్ ఉంది కదా అని అడ్డదిడ్డంగా వాగితే అసలుకే ఎసరు వస్తుంది. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు అలేఖ్య చిట్టి పికెల్స్ సిస్టర్స్. నిజానికి వీళ్ల బిజినెస్ సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యింది. అయితే, ధర విషయంలో చాలా విమర్శలు ఉన్నాయి. మార్కెట్ ధరలతో పోల్చితే మరీ ఎక్కువ ధరలకు అమ్ముతారనే ప్రచారం ఉంది. పచ్చళ్లలో క్వాలిటీ ఉంటే, ధర ఎక్కువగానే ఉంటుంది అంటారు అలేఖ్య చిట్టి పికెల్స్ టీమ్. ఇటీవల పచ్చళ్లు కొనుగోలు చేసేందుకు ఓ కస్టమర్ వారికి వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు. వాళ్లు పెట్టిన ధరలు చూసి మరీ ఇంత ధరా? అని ఆశ్చర్యపోయాడు. దీంతో అలేఖ్య చిట్టి పికెల్స్ నుంచి అభ్యంతరకర రీతిలో వాయిస్ మెసేజ్ వచ్చింది. పచ్చళ్ల ధరలు అడిగితే, పర్సనల్ లైఫ్ గురించి కామెంట్స్ చేయడం దారుణంగా ఉందని సదరు వ్యక్తి కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

అలేఖ్య చిట్టి పికెల్స్ నుంచి పచ్చళ్లు తెప్పించుకోవాలని ఓ వ్యక్తి వారి వాట్సాప్ కు హాయ్ అని మెసేజ్ చేశాడు. అటును పచ్చళ్ల రేట్లను చెప్తూ మెసేజ్ పంపించారు. అందులో అరకిలో చికెన్ పికెల్ ధర రూ. 1200 అని రావడం చూసి అతడు షాకయ్యాడు. ఈ ధరలు చూసి సదరు కస్టమర్.. చేతులు జోడించిన ఎమోజీ పెట్టి.. మరీ ఇంత ధరా? అంటూ మెసేజ్ చేశాడు. ఈ మెసేజ్ కు అలేఖ్య పికెల్స్ నుంచి కస్టమర్ ను కించపరిచేలా కామెంట్  చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాయిస్ మెసేజ్ అభ్యంతరకరంగా ఉండటంతో సదరు కస్టమర్.. ఆ ఆడియో మెసేజ్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ధరలు గురించి అడిగితే, నోటికొచ్చింది వాగారంటూ కామెంట్ చేశాడు.

నెటిజన్లు ఏం అంటున్నారంటే?

ఆమె వాయిస్ మెసేజ్ విని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్ అడిగిన దానికి నెమ్మదిగా సమాధానం చెప్పాలి. మరి వాదనకు దిగితే బ్లాక్ చేయాలి. అంతేగానీ, పర్సనల్ గా అటాక్ చేస్తూ, బూతులు తిట్టడం దారుణం అంటున్నారు. ఆమె వాయిస్ ను షేర్ చేస్తూ, పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇలాగే మాట్లాడితే దుకాణం సర్దేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. నెటిజన్ల ట్రోలింగ్ తో అలేఖ్య చిట్టి పికెల్స్ ఫోన్ నెంబర్ ను తాత్కాలింకంగా నిలిపివేశారు. అటు వాట్సాప్ అకౌంట్ ను కూడా డిలీట్ చేశారు. ఇన్ స్టాలో కూడా ఓపెన్ చేయడం లేదు. ప్రస్తుతం వెబ్ సైట్ కూడా ఓపెన్ కావడం లేదు. అతి చేస్తే ఇలాగే ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఆ బూతులు తిట్టింది వారేనా? లేదా వారిపై ఎవరైనా కుట్రపన్ని ఇదంతా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. మరి దీనిపై అలెఖ్య సిస్టర్స్ ఏం సమాధానం ఇస్తారో చూడాలి.

Read Also: చితి నుంచి లేచొచ్చిన పెద్దాయన.. మంట పెట్టగానే లేచి కూర్చొని..

Related News

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Viral Video: దాహమేస్తే ఇంజిన్ ఆయిల్ తాగేస్తాడు.. రోజూ ఏకంగా 8 లీటర్లు!

Big Stories

×