BigTV English

Valentine’s Week – Teddy Day: టెడ్డీ డే.. రంగుల టెడ్డీబేర్‌ల ప్రాముఖ్యత ఇదే!

Valentine’s Week – Teddy Day: టెడ్డీ డే.. రంగుల టెడ్డీబేర్‌ల ప్రాముఖ్యత ఇదే!

History of Teddy Day 2024: ప్రేమికులకు ఇష్టమైన వాలెంటైన్ వీక్ లో అప్పుడే మూడు రోజులు అయిపోయాయి. చూస్తుండగానే వాలెంటైన్ వీక్‌లో నాలుగో రోజు రానే వచ్చింది. ఈ రోజు పూర్తిగా టెడ్డీబేర్‌లకు అంకితం. ప్రియమైన వారికి ప్రేమను తెలిపేందుకు టెడ్డీబేర్‌‌కు మించిన అందమైన గిఫ్ట్ ఏముంటుంది. అందుకే వాలెంటైన్ వీక్‌లోనే కాదు.. వీటి అమ్మకాలు ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయి. తమ మనసులోని ప్రేమను ప్రియమైన వారికి టెడ్డీబేర్‌ ద్వారా తెలియజేస్తారు.


టెడ్డీబేర్‌లు చూడటానికి ముద్దుముద్దుగా, చాలా మృదువుగా ఉంటాయి. టెడ్డీలను పట్టుకుని నిద్రపోయే వారు ఎంతో మంది లేకపోలేరు. ఇక ప్రేమికులు అయితే టెడ్డీలపై చచ్చేంత ఇష్టం చూపిస్తారు. టెడ్డీ డే రోజున రంగురంగుల టెడ్డీలు అమ్ముడుపోతుంటాయి. టెడ్డీ డే రోజున ప్రేమికులు టెడ్డీబేర్‌ను ప్రెసెంట్ చేసి తమ ప్రేమను తెలియజేస్తారు. అంతేకాదు టెడ్డీలు అంటే అమ్మాయిలకు మహా ఇష్టం. అందుకనే తమరు ప్రేమించిన వారు టెడ్డీలను ఇస్తుంటారు. అయితే ఒక్కో కలర్ టెడ్డీబేర్‌ ఒక్కో భావాన్ని తెలియజేస్తుంది. ఏ కలర్ టెడ్డీ ఎలాంటి భావాన్ని చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం.

రెడ్ కలర్ టెడ్డీబేర్‌


రెడ్ గులాబీలానే రెడ్ కలర్ టెడ్డీబేర్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అందుకే రెడ్ కలర్ టెడ్డీని కొనడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. ఈ రెడ్ కలర్ టెడ్డీబేర్‌ ద్వారా మీరు ప్రేమించే వారిపై ఎంత ప్రేముందో తెలియజేయచ్చు. మీ ప్రేమ గాఢతను కూడా ఈ రెడ్ కలర్ టెడ్డీబేర్‌ తెలుపుతుంది. మీ బంధాన్ని ఇది మరింత ధృడంగా మారుస్తుంది.

పింక్ టెడ్డీబేర్‌

పింక్ కలర్ టెడీ‌బేర్ అమ్మాయిలకు ఎంతో ఇష్టమైనది. ప్రేమను, స్నేహాన్ని,అనుంబంధాన్ని ఈ టెడ్డీ తెలియజేస్తుంది. మీరు ఎవరినైనా ఇష్టపడుతుంటే ఈ పింక్ కలర్ టెడ్డీబేర్‌ ఇవ్వండి.

బ్లూ కలర్ టెడ్డీబేర్‌

బ్లూ కలర్ టెడ్డీబేర్‌ ఎన్నో భావాలను తెలియజేస్తుంది. ఈ కలర్ టెడ్డీబేర్‌ మీరు ఎవరికైనా ఇస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని అర్థం. అది ప్రేమలో అయినా, పెళ్లి అయ్యాక అయినా కావచ్చు. ఈ టెడ్డీ ఇస్తే పట్టుకున్న చేయి ఎప్పటికీ విడువనని ప్రామిస్ చేసినట్లే.

గ్రీన్ కలర్ టెడ్డీబేర్‌

గ్రీన్ కలర్ టెడ్డీబేర్‌ మీ సహనాన్ని, ఓర్పును సూచిస్తుంది. ఈ కలర్ టెడ్డీ ఎవరికైనా ఇస్తే.. వారి కోసం ఎన్నాళ్లయినా వేచి ఉంటారని చెప్పడం.

ఆరెంజ్ కలర్ టెడ్డీబేర్‌

ఆరెంజ్ కలర్ టెడ్డీబేర్‌ ఇతరులపై ఉన్న ఇష్టాన్ని సూచిస్తుంది. ఈ టెడ్డీని ఇచ్చి.. వారివల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో చెప్పవచ్చు. మీ ప్రియమైన వారికి ఆరెంజ్ కలర్ టెడ్డీని ఇచ్చి వారివల్ల కలిగిన మార్పులు తెలియజేస్తే ఎంతో సంతోషిస్తారు.

Tags

Related News

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Dengue Fever: వర్షాకాలంలో జ్వరమా ? డెంగ్యూ కావొచ్చు !

Big Stories

×