Harleen Deol: ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 ఫైనల్స్ లో అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం రోజు లోక్ కళ్యాణ్ మార్గ్ లోని తన నివాసంలో అతిథ్యం ఇచ్చారు. మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో జట్టు సభ్యులు సాయంత్రం ప్రధాని నివాసానికి చేరుకున్నారు. అనంతరం వరల్డ్ కప్ విశేషాలను క్రీడాకారిణులు మోదీతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి భారత మహిళా జట్టును అభినందిస్తూ, టోర్నమెంట్ లో వరుసగా మూడు ఓటముల తర్వాత అద్భుతంగా పునరాగమనం చేసి గెలిచిన తీరును ప్రశంసించారు. అలాగే సోషల్ మీడియాలో ఎదురైన ట్రోలింగ్ ని సైతం ఎదుర్కొని గొప్ప విజేతలుగా నిలిచారని ప్రశంసించారు.
2017 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత జట్టు చివరి వరకు పోరాడినా విజయం సాధించలేదు. దీంతో రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఆ సమయంలో మిథాలీ రాజ్ నేతృత్వంలోని జట్టు నరేంద్రమోదీని కలిసింది. ఆ విషయాన్ని తాజాగా ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ఇదే విషయం గురించి జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. “2017లో ట్రోఫీ లేకుండానే మోడీ గారిని కలిశాం. కానీ ఈసారి ట్రోఫీతో కలవడం గర్వంగా ఉంది. ఇకనుండి మోదీ గారిని తరచూ కలిసేలా విజయాలు సాధిస్తాం” అని చెప్పుకొచ్చింది. ఇక వైస్ కెప్టెన్ స్మృతి మందానా మాట్లాడుతూ.. ” ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆయన దేశంలోని అన్ని రంగాలలో మహిళలకు స్ఫూర్తి” అని తెలిపింది.
2021 లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో హార్లీన్ పట్టిన అద్భుత క్యాచ్ గురించి ప్రస్తావించారు నరేంద్ర మోడీ. అప్పట్లో దీనిపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక ఇదే సమయంలో హార్లిన్.. ఇదే సమయంలో హార్లిన్.. ప్రధాని నరేంద్ర మోదీని ఓ ఫన్నీ క్వశ్చన్ వేసింది. మీరు ఎందుకు ఇంత హ్యాండ్సమ్ గా ఉంటారు..? అని అడిగింది. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెబుతూ.. అది దేశ ప్రజల ఆశీర్వాదమే అని వ్యాఖ్యానించాడు. దేశ ప్రజల ఆశీర్వాదం వల్లే తాను యాక్టివ్ గా, ఎంతో ఎనర్జీ గా పని చేసుకుంటూ ముందుకు వెళుతున్నానని చెప్పారు మోడీ.
Also Read: WI vs NZ 1st T20i: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్
ఇక ఫైనల్ మ్యాచ్ అనంతరం హర్మన్ ప్రీత్ బంతిని జేబులో వేసుకున్న విషయంపై చర్చించారు. అయితే ఆ బంతి నా వైపు రావడం అదృష్టం అని.. అందుకే దాన్ని జ్ఞాపకంగా ఉంచుకున్నానని తెలిపింది. ఇక క్రాంతి గౌడ్ మాట్లాడుతూ.. నా తమ్ముడు మీకు పెద్ద అభిమాని అని చెప్పింది. ఈ క్రమంలో ప్రధాన మంత్రి వెంటనే.. మీ కుటుంబాన్ని ఒకసారి కలవాలి అని ఆహ్వానం పలికారు.
Harleen Deol asking the skincare routine of Prime Minister Narendra Modi. 😄 pic.twitter.com/sFmFzDEmXb
— Johns. (@CricCrazyJohns) November 6, 2025