SSMB 29 : ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తున్న సినిమా SSMB 29. రాజమౌళి దొరక ఎక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఈ సినిమా రావడంతో విపరీతమైన అంచనాలు ఈ సినిమా మీద నెలకొన్నాయి. అయితే ఇప్పటివరకు రాజమౌళి చాలామందిని స్టార్ హీరోలను చేశారు. మొదటిసారి ఆల్రెడీ స్టార్ డం ఉన్న మహేష్ బాబు సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి రామోజీ ఫిలిం సిటీలో 15వ తారీఖున భారీ ఈవెంట్ క్రియేట్ చేస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించి దాదాపు మూడు నిమిషాల పాటు సాగే ఒక వీడియోను రెడీ చేసినట్లు తెలుస్తుంది. మహేష్ బాబు అభిమానులు అందరికీ కూడా ఆ వీడియో కిక్ ఇచ్చేలా ఉంటుందట. కేవలం మహేష్ బాబు అభిమానులకు మాత్రమే కాకుండా రాజమౌళికి కూడా ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు కాబట్టి వీడియో మీద సర్వత్ర ఆసక్తి నెలకొంది.
రాజమౌళి కథని చెప్పే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్కువగా అభిమానులను కన్ఫ్యూజ్ చేయడం తన సినిమా మొదలుపెట్టడానికంటే ముందే ఈ సినిమా కథ ఇది అని క్లారిటీ ఇచ్చేస్తుంటాడు.
సునీల్ తో మర్యాద రామన్న సినిమా చేసినప్పుడు కంప్లీట్ స్టోరీ ని కూడా ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. అలా ఎక్స్ప్లెయిన్ చేయడం వలన చాలామంది ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమాకి వస్తారు. ఆ తరుణంలో రాజమౌళి చేసే సర్ప్రైజెస్ కి ఆడియన్స్ కి మంచి హై వస్తుంది.
ఈగ సినిమా మొదలుపెట్టే ముందు కూడా నాని సినిమా స్టార్టింగ్ లోనే చనిపోతాడు. తర్వాత ఈగగా పుట్టి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేదే కథ అని చాలా క్లియర్ గా చెప్పేసాడు. అలానే ట్రిపుల్ ఆర్ విషయంలో కూడా కన్ఫ్యూజ్ చేయకుండా ముందే క్లారిటీ ఇచ్చేసాడు. ఇప్పుడు మహేష్ బాబు తో చేయబోయే సినిమా కథ గురించి కూడా ఆ వీడియో ద్వారా క్లారిటీ ఇస్తాడు అని చాలామంది ఊహిస్తున్నారు.
కొంతమంది సినిమాల్లో ఉన్న విషయాన్ని దాచేసి ఏమీ లేని కంటెంట్ షేర్ చేస్తూ ఉంటారు. కానీ రాజమౌళి మాత్రం సినిమాలు ఇది ఉండబోతుంది అని చెప్పి మరి ఆడియన్స్ సర్ప్రైజ్ చేస్తాడు. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద రాజమౌళి సినిమాలో మంచి సక్సెస్ సాధిస్తాయి. ఆడియన్స్ కి ఎలా చూపిస్తే ఇష్టపడతారు అనే క్లారిటీ రాజమౌళికి ఉంది కాబట్టే అతనికి 100% సక్సెస్ రేట్ ఉంది.
మహేష్ బాబు తో పాటు ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృధ్విరాజ్ సుకుమారన్ కూడా కీలకపాత్రలో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి కొన్ని రోజులు ముందుగానే వీళ్ళ ముగ్గురు కలిసి సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా హల్చల్ చేశారు. ఆ ట్వీట్స్ కూడా విపరీతంగా పాపులర్ అయ్యాయి. అయితే ఆ ట్వీట్స్ అన్నీ కూడా వాళ్ళు పిఆర్ లు చేశారు అని బయట వార్తలు కూడా వచ్చాయి.
Also Read: Fauzi : ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ తో ప్రభాస్ ఫిదా, రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్