BigTV English
Advertisement

Fauzi : ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ తో ప్రభాస్ ఫిదా, రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్

Fauzi : ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ తో ప్రభాస్ ఫిదా, రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్

Fauzi : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో లవ్ స్టోరీస్ ఎవరు బాగా డీల్ చేస్తారు అంటే కచ్చితంగా వినిపించే పేరు హను రాఘవపూడి. ఒక సందర్భంలో హను రాఘవపూడి లవ్ స్టోరీ సినిమాలు చూసినప్పుడు మాకు ఉన్నాడు మణిరత్నం అనే ఒక ఫీలింగ్ కలిగింది. మామూలుగా మణిరత్నం ఎన్ని సినిమాలు చేసినా కూడా తాను చేసిన లవ్ స్టోరీస్ బాగా పాపులర్. మణిరత్నం చేసిన ఎన్నో లవ్ స్టోరీస్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి.


ఇకపోతే రీసెంట్ గా సీతారామం సినిమాతో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు హను. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో ఈ సినిమా జరుగుతున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే దీని గురించి అధికారక ప్రకటన రాలేదు.

కంటెంట్ కు ప్రభాస్ ఫిదా 

ఫౌజీ సినిమాకు సంబంధించిన కంటెంట్ చూసి ప్రభాస్ ఫిదా అయిపోయారట. ఈ సినిమాలో ప్రభాస్ ను ఇంకొంచెం కొత్తగా చూపించబోతున్నారు. బెస్ట్ లుక్, సూపర్బ్ సీన్స్, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా పాటలను కంపోజ్ చేస్తున్నారు.


హను రాఘవపూడి సినిమాలకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తారు. విశాల్ హనూకి మంచి మ్యూజిక్ ఇస్తాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో పాటలు అద్భుతమైన సక్సెస్ సాధించాయి. సీతారామం సినిమాకు సంబంధించి పాటలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా పాటలు సక్సెస్ కు కీలకంగా నిలిచాయి.

ఫౌజీ సినిమాకి సంబంధించిన అన్ని పాటలు కూడా అద్భుతంగా వస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. స్వతహాగా హను రాఘవపూడి కి కూడా మంచి మ్యూజిక్ టాలెంట్ ఉంది కాబట్టి ఇది ఇంకొంచెం ప్లస్ అవుతుంది.

రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ 

ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ రాజా సాబ్ సినిమా కూడా మరోవైపు సిద్ధం అవుతుంది. ఆ సినిమాలో ప్రభాస్ లుక్స్ ఆల్రెడీ అదిరిపోయాయి. ఇక ఫౌజీ సినిమాలో కూడా అదే స్థాయిలో లుక్స్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మామూలు సీజన్లో కంటే సంక్రాంతి సీజన్లో సినిమా చూసి ఆడియన్స్ చాలా ఎక్కువగా ఉంటారు. అలానే రెవెన్యూ కూడా ఎక్కువగా వస్తుంది. ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే చాలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మంచి లాభాలు గడిచినట్లే అని చెప్పొచ్చు.

Also Read: Singer Chinmayi : భావోద్వేగంలో బూతులు మాట్లాడిన చిన్మయి, ట్రోల్ చేస్తున్న మరో బ్యాచ్

Related News

Anasuya Bharadwaj: తమిళ సినిమాలో అనసూయ ఐటెం సాంగ్‌ రిలీజ్‌.. ప్రభుదేవతో రొమాన్స్‌!

Bahubali: The Epic Collections: బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

The Girlfriend Movie: ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ మూవీపై బేబీ నిర్మాత ఎస్‌కేఎన్‌ రివ్యూ.. ఏమన్నారంటే

Sandeep Reddy Vanga : నిర్మాతగా మారిన సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ హీరోగా కొత్త దర్శకుడు పరిచయం

#NTR Neel: తారక్ పై నీల్ స్పెషల్ ఫోకస్.. మరీ ఇలా అయితే ఎలా గురూ!

Actor Death: హీరో యష్ ఛాఛా మృతి.. దుఃఖంలో ఇండస్ట్రీ!

SSMB 29 : మూడు నిమిషాల పాటు వీడియో రెడీ, కథను కూడా చెప్పేస్తారా?

Big Stories

×