Singer Chinmayi : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ సింగర్ చిన్మయి. ఒకవైపు సినిమాల్లో పాటలు పాడుతూనే మరోవైపు డబ్బింగ్ కూడా చెబుతూ ఉంటుంది. ముఖ్యంగా సమంత చేసిన చాలా సినిమాలకు చిన్మయి డబ్బింగ్ చెప్పింది. కళ్ళు మూసుకొని చిన్మయి మాటలు వింటుంటే కొన్ని సందర్భాల్లో సమంత కూడా గుర్తుకు వస్తుంది. ఒక టైం లో అవార్డులు తీసుకుంటున్నప్పుడు మహేష్ బాబు కూడా ఇదే మాటని చెప్పారు సడన్ గా సమంత వచ్చింది ఏంటి అని.
తన పాటలు ఎంతగా పాపులర్ అవుతాయో అంతకంటే ఎక్కువగా ఆమె సోషల్ మీడియా పోస్టులు వైరల్ గా మారుతుంటాయి. ఇప్పటివరకు చిన్న ఎన్నో విషయాలు పైన స్పందించిన సందర్భాలు ఉన్నాయి. చిన్న ఈ భర్త రాహుల్ రవీంద్రన్ ది గర్ల్ ఫ్రెండ్ అని సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో టాక్ కూడా పాజిటివ్ వచ్చేసింది.
ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో భాగంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన హక్కులు ఉండాలి అని చెప్పాడు రాహుల్ రవీంద్రన్. ఈ విషయాన్ని నేను చిన్మయి తో చెప్పాను. మనకు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు తాళిబొట్టు వేసుకుంటావా వేసుకోవా అనేది నీ ఇష్టం నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పారట.
దాదాపు వారం రోజులు క్రితం చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే ట్విట్టర్ వేదికగా ఈ కంటెంట్ గురించి చాలామంది స్పేస్ కూడా క్రియేట్ చేసి మాట్లాడుకున్నారు. దీనిలో చిన్మయిని ఇన్వాల్వ్ చేస్తూ బూతులు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు.
మొత్తానికి ట్విట్టర్ స్పేస్ గురించి చిన్మయి రియాక్ట్ అయ్యారు. ఏకంగా ఒక స్పేస్ లో జాయిన్ అయి తనను ఏవైతే బూతులతో సంబోధించారు అవే బూతులను మళ్లీ రిపీట్ చేస్తూ చిన్నవి మాట్లాడింది. అలా మాట్లాడుతున్న తరుణంలో విపరీతమైన భావోద్వేగానికి గురి అయిపోయి బూతులు మాట్లాడేశారు. ఆ భావోద్వేగాన్ని బట్టి ఆమె బూతులు మాట్లాడటం లో తప్పులేదు అని అభిప్రాయం చాలా మందికి కలిగింది.
అయితే గతంలో సమంత సినిమాలకు చిన్మయి డబ్బింగ్ చెప్పింది కాబట్టి. కేవలం చిన్మయి మాట్లాడిన బూతులు మాత్రమే కట్ చేసి సమంత వీడియోలకి అటాచ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కొంతమంది చిన్మయిను హేట్ చేసే బ్యాచ్ ఈ వీడియోలను వైరల్ చేయడం మొదలుపెట్టారు. మరోవైపు చిన్మయి కూడా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ను ట్విట్టర్ వేదికగా మెన్షన్ చేస్తూ అలా మాట్లాడే వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ ట్వీట్ కు రెస్పాండ్ అయ్యారు.
Also Read: Chinmayi : ఇలాంటి మగాళ్లు చచ్చిపోవాలి చిన్మయి షాకింగ్ కామెంట్స్