BigTV English

Tall: ఏం తిన్నా ఎత్తు పెరగడం లేదా.. ఈ ఫుడ్స్ ట్రై చేయండి

Tall: ఏం తిన్నా ఎత్తు పెరగడం లేదా.. ఈ ఫుడ్స్ ట్రై చేయండి

Tall: చాలా మంది పిల్లలు ఎదుగుతున్న వయసులో చాలా పొట్టిగా ఉంటారు. జీన్స్ లేదా పోషకాహార లోపం కారణంగానే ఎత్తు పెరగడం లేదని చాలా మంది అనుకుంటారు. కానీ, పొట్టిగా ఉండడం వెనుక చాలా కారణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎత్తు పెరగడం అనేది జన్యువులతో పాటు ఆహారం, వ్యాయామం, జీవనశైలి వంటి వాటి మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు. సమతుల్య ఆహారం తీసుకుంటే, ముఖ్యంగా టీనేజ్‌లో, ఎత్తు పెరగడానికి సరైన పోషకాలు అందుతాయి. ఎత్తు పెరగడానికి హెల్ప్ చేసే కొన్ని ఆహారాలు హెల్ప్ చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..


ప్రోటీన్ ఉన్న ఆహారాలు
ప్రోటీన్ కండరాలు, ఎముకలు, టిష్యూలు బాగా పెరగడానికి బేస్ లాంటిది. గుడ్లు, చికెన్, చేపలు, సోయాబీన్, బీన్స్, పప్పులు లాంటివి ఎత్తు పెరగడానికి హెల్ప్ చేస్తాయి. రోజూ ఆహారంలో కొంత ప్రోటీన్ తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల బరువు పెరగడం మరింత ఈజీ అవుతుందట.

కాల్షియం ఉన్న ఆహారాలు
ఎముకలు బలంగా, బాగా పెరగడానికి కాల్షియం చాలా కీలకమని డాక్టర్లు చెబుతున్నారు. పాలు, పెరుగు, చీజ్, రాగి, బాదం, ఆకుకూరలు లాంటి వాటిలో కాల్షియం బాగా ఉంటుంది. రోజూ ఒక గ్లాస్ పాలు లేదా కాల్షియం ఉన్న ఆహారాలు తీసుకుంటే ఎముకలు బలపడతాయని డాక్టర్లు చెబుతున్నారు.


విటమిన్ డి ఉన్న ఆహారాలు
విటమిన్ డి కాల్షియం శరీరంలోకి ఇమడడానికి హెల్ప్ చేస్తుంది, ఇది ఎముకల పెరుగుదలకు ముఖ్యం. చేపలు, గుడ్డు పచ్చసొన, విటమిన్ డి జోడించిన ఆహారాలు దీనికి మంచి సోర్సులట. ఉదయం కాసేపు ఎండలో ఉంటే విటమిన్ డి నేచురల్‌గా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

జింక్, మెగ్నీషియం
జింక్, మెగ్నీషియం ఎముకల పెరుగుదలలో పెద్ద రోల్ ప్లే చేస్తాయి. గింజలు, సీడ్స్, గోధుమలు, ఆకుపచ్చ కూరగాయలు ఇవి బాగా ఇస్తాయి. రోజూ ఒక గుప్పెడు గింజలు లేదా ఆకుపచ్చ కూరగాయలు తింటే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్
శరీరానికి ఎనర్జీ కోసం కార్బోహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్స్ అవసరం. బ్రౌన్ రైస్, ఓట్స్, ఆవకాయ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న చేపలు లాంటివి శరీర పెరుగుదలకు హెల్ప్ చేస్తాయి.

నీళ్లు ముఖ్యం
శరీర కణాలు సరిగ్గా పని చేయడానికి, పోషకాలు ఇమిడిపోవడానికి నీళ్లు బాగా తాగాలి. రోజూ 8-10 గ్లాసుల నీళ్లు తాగితే హెల్దీగా పెరగడానికి హెల్ప్ అవుతుందట.

ఈ ఆహారాలను రోజూ తీసుకుంటే టీనేజర్స్ తమ ఎత్తును నేచురల్‌గా పెంచుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఏదైనా డైట్ మార్పులు చేయడానికి ముందు న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకోవడం బెటర్.

Related News

Poor Kidney Function: కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Type 5 Diabetes: టైప్-5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Heart Disease: గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే !

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Big Stories

×