యుద్ధం మొదలవగానే.. పాకిస్తాన్ కుళ్లు, కుతంత్రాలు అన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పాకిస్తాన్ నేతలు ఎంత పాపాత్ములో అర్థమవుతోంది. అధికారం కోసం, దాన్ని నిలబెట్టుకునే క్రమంలో తమ దేశ పౌరుల్ని సైతం మోసం చేస్తూ ఎంత దారుణానికైనా దిగజారుతారని తెలుస్తోంది. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలే దీనికి తాజా నిదర్శనం. గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఖవాజా ఆసిఫ్.. పార్లమెంట్ లో తమ చేతగానితనాన్ని, నీఛ రాజకీయాలను మరోసారి బయటపెట్టారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే మదర్సాలలో చదువుకునే విద్యార్థులను పాకిస్తాన్ భద్రతకోసం ఉపయోగిస్తామన్నారాయన. మదర్సా విద్యార్థులను రెండవ రక్షణ రేఖగా ఉపయోగిస్తామని చెప్పారు. అంటే మదర్సాలలో చదువుకునే విద్యార్థులను అడ్డుపెట్టుకుని కుటిల రాజకీయాలు చేస్తామని స్పష్టం చేశారు ఖవాజా ఆసిఫ్. పార్లమెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యల్ని ప్రపంచ దేశాలన్నీ అసహ్యించుకుంటున్నాయి. అమాయక విద్యార్థులను యుద్ధంలో బలిచేస్తారా అని ప్రశ్నిస్తున్నారు వివిధ దేశాల నేతలు. మదర్సాలు అంటే విద్యాలయాలు అని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయని, అలాంటి విద్యాలయాల పరువుతీసేలా మాట్లాడొద్దని హెచ్చరిస్తున్నారు.
Pakistan’s Defence Minister drops the mask:
“Madrassa students are our second line of defence and can be used for any purpose."Let that sink in. A nuclear state openly admits grooming children for war.pic.twitter.com/PK7pAog01O
— Riccha Dwivedi (@RicchaDwivedi) May 9, 2025
నోరు తెరిస్తే అబద్ధాలే..
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నోరు తెరిస్తే అబద్ధాలే, అసత్యపు వాదనలే. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే లోని 9 ఉగ్రవాద కేంద్రాలపై భారత్ దాడి చేస్తుందని తమకు ముందే తెలుసని, కావాలనే తాము భారత డ్రోన్లను కూల్చి వేయలేదని అన్నారు. తమ స్థావారాల గురించి సమాచారం బయట పెట్టకూడదనే తాము ఆ దాడిని తిప్పి కొట్టలేదని కవర్ చేసుకున్నారు ఖవాజా.
5 ఫైటర్ జెట్స్ ని కూల్చేశారట..
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ కు చెందిన 5 ఫైటర్ జెట్స్ ని తాము కూల్చేశామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గొప్పలు చెప్పుకున్నారు. అయితే అదంతా అబద్ధం అని ప్రపంచదేశాలకు కూడా తెలుసు. మీడియాకు ఇంకా బాగా తెలుసు. అసలు ఆ ఫైటర్ జెట్లను ఎలా కూల్చేశారు, ఏ ఆయుధాలను ఉపయోగించారు, ఏ రక్షణ వ్యవస్థను వాడుకున్నారంటూ CNN న్యూస్ ఛానెల్ యాంకర్ ప్రశ్నించడంతో ఆయన గతుక్కుమన్నారు. తాము నిజంగానే ఫైటర్ జెట్స్ ని కూల్చేశామని సోషల్ మీడియాలో ఆ వీడియోలు ఉన్నాయి కదా చూస్కోండి అంటూ సమాధానమిచ్చారు. సోషల్ మీడియా వీడియోలు సాక్ష్యాలు ఎలా అవుతాయని యాంకర్ ప్రశ్నించగా.. వాటి శకలాలన్నీ కాశ్మీర్ లో పడ్డాయంటూ కబుర్లు చెప్పారు.
గుంటనక్క ఆసిఫ్..
యుద్ధం చేయడం చేతకాదు, కనీసం ధైర్యంగా వైరిపక్షాన్ని ఎదురొడ్డి నిలబడే సత్తా లేదు. అందుకే పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ గుంటనక్కలా ప్రవర్తిస్తుంటారు. అమెరికా కోసం పాకిస్తాన్ ఎలాంటి పాపాలకు ఒడిగట్టిందనే విషయాన్ని కూడా ఇటీవల ఆయన బయటపెట్టారు. పాకిస్తాన్.. ఉగ్రవాద గ్రూపులకు మద్దతివ్వడమే కాకుండా, నిధులు కూడా అందిస్తోందని చెప్పారు. స్కై న్యూస్ మీడియా ఛానెల్ తో మాట్లాడిన ఆయన మాటలు వైరల్ గా మారాయి. ఉగ్రవాదులకు మద్దతివ్వడమే కాదు, వారికి శిక్షణ ఇవ్వడం, నిధులు సమకూర్చడం, ఆయుధాలు కొనుగోలు చేసి ఇవ్వడంలో పాక్ కి చాలా చరిత్ర ఉందని అంగీకరించారు. దాదాపు 3 దశాబ్దాలుగా పాకిస్తాన్.. ఈ నీఛమైన పని చేస్తోందని.. అమెరికా కోసమే తాము ఈ పని చేస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు ఆసిఫ్.
ఆయుధ సంపత్తిపై కూడా అబద్ధాలే..
పాకిస్తాన్ ఆయుధ సంపత్తిపై కూడా ఆసిఫ్ ఎప్పుడూ అబద్ధాలే చెప్పేవారు. పాకిస్తాన్ వద్ద JF-17, JF-10 అనే చైనా యుద్ధ విమానాలు ఉన్నాయని, వాటిని ఇప్పుడు పాకిస్తాన్‌లోనే తయారు చేస్తున్నామని చెప్పారు. భారత్, ఫ్రాన్స్ నుండి విమానాలను కొనుగోలు చేస్తే, తాము చైనా, రష్యా, యూకే నుండి విమానాలు కొనుగోలు చేసి ధీటైన జవాబిస్తామన్నారు. పాకిస్తాన్ చైనా వద్ద నాసిరకం యుద్ధ సామగ్రి కొని, చిత్తు చిత్తుగా దెబ్బతినడానికి గల మూలకారణాల్లో ఆసిఫ్ కూడా ఒకరు.