BigTV English

Health Benefits of Chickpeas: వేయించిన శెనగలు తరచూ తింటే కలిగే ప్రయోజనాలను మీరు ఊహించలేరు..

Health Benefits of Chickpeas: వేయించిన శెనగలు తరచూ తింటే కలిగే ప్రయోజనాలను మీరు ఊహించలేరు..

Health Benefits of Chickpeas: తరచూ ఇంట్లో ఏదో ఒక తినే ఆహార పదార్థం ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా సాయంత్రం వేళ స్నాక్స్ కోసం వేయించిన శెనగలు, పొటాటో చిప్స, సమోసా, బజ్జీలు, టీ వంటివి తింటూ ఆస్వాదించాలనుకుంటారు. ఈ తరుణంలో ప్రతీ ఇంట్లో ఎక్కువగా వేయించిన శెనగలు తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇవి కేవలం ఏదో తినాలనిపించి, ఆకలితో తినడం కాకుండా వీటియో ప్రయోజనాలు కూడా తెలుసుకుని తినాలని నిపుణులు చెబుతున్నారు. వేయించిన శెనగలు తినడం వల్ల ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫైబర్, జింక్, విటమిన్లు బీ, కే, ఫాస్పేట్ వంటి ఖనిజాలతో కూడి ఉంటుంది. అందువల్ల ఇది శరీరానికి అద్భుతమైన శక్తిని ఇస్తుంది.


వేయించిన శెనగలు తింటే ఎముకలు బలంగా, ధృడంగా మారుతాయి. జీర్ణక్రియ ప్రక్రియకు కూడా శెనగలు సహాయపడతాయి. మలబద్ధకం, అసిడిటి వంటి సమస్యలకు కూడా ఇది తోడ్పడుతుంది. వీటిని తింటే త్వరగా కడుపు నిండిన భావాన్ని ఇస్తుంది. శెనగల్లో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. మరోవైపు కొలస్ట్రాల్ తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. అంతేకాదు చెడు కొలస్ట్రాల్ తగ్గించడానికి కూడా తోడ్పడుతుంది.

శెనగల్లో ఉండే ఐరన్ కారణంగా కండరాలు, నరాలు మెరుగుపడతాయి. కాల్షియం వంటి మూలకాలు ఎముకల ఆరోగ్యాన్ని బలపరచేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా గర్భిణీలకు ఫోలేట్ శిశువు నాడీ గొట్టం లోపల నివారించడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు చెడు కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానికి శెనగలు అద్భుతంగా పనిచేస్తాయి. డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు కూడా వీటిని తీసుకోవచ్చు.వీటి వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి.


శెనగల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. వేయించిన శెనగల్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి వల్ల రోగనిరోధక శక్తి కూడా పెంచుకోవచ్చు. అంతేకాదు రక్తపోటును తగ్గించడానికి కూడా తోడ్పడుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

High Blood Pressure: కంటి సమస్యలా ? మీకు.. హైబీపీ కావొచ్చు !

Dandruff Tips: కేవలం వారం రోజులు చాలు.. చుండ్రు లేకుండా మెరిసే జుట్టు రహస్యం..

Gums Problem:చిగుళ్ల నుంచి రక్తం కారుతోందా ? కారణం ఇదేనట !

Drink for Better Digestion: జీలకర్ర నీరు తాగితే.. ఇన్ని లాభాలా ?

Fatty Liver Disease: ప్రతి ముగ్గురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ సమస్య.. ప్రారంభ లక్షణాలివే !

Symptoms Of Anxiety: ఒత్తిడితో బాధపడుతున్నారా ? ఈ చిట్కాలు పాటించండి చాలు !

Mint leaves benefits: ఉదయాన్నే ఈ ట్రిక్ చేస్తేచాలు.. మీ రోగాలన్నీ మాయం

Black pepper benefits: అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ పొడితో జస్ట్ ఇలా ట్రై చేయండి

Big Stories

×