E-Paper
Advertisement

వంగా ‘వైల్డ్’ వెంచర్స్.. అటు ప్రభాస్.. ఇటు సుమంత్ ప్రభాస్.. మధ్యలో సెన్సేషన్ ట్వీట్!

వంగా ‘వైల్డ్’ వెంచర్స్.. అటు ప్రభాస్.. ఇటు సుమంత్ ప్రభాస్.. మధ్యలో సెన్సేషన్ ట్వీట్!

Sandeep Vanga: సందీప్ వంగా …అర్జున్ రెడ్డి, యానిమల్ అంటూ ఇంటెన్స్ ఫిలిమ్స్ ని తెరకెక్కించి నేషనల్ వైడ్ క్రేజ్ కొట్టేసిన ఈ క్రేజీ ఫిలిమ్ మేకర్ ప్రస్తుతం స్పిరిట్ అంటూ డార్లింగ్ ప్రభాస్ తో వయోలెంట్ యాక్షన్ ఫిలిమ్ ని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ టైమ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ వేస్తుండటంతో అంచనాలు ఓ రేంజ్ లో పెట్టేసుకున్నారు రెబల్ ఫ్యాన్స్. ఇక ప్రస్తుతం తన సొంత సినిమాలకే ప్రొడ్యూసర్ గా వ్యవహరించే సందీప్  వంగా ఇపుడు సొంత బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ ద్వారా సరికొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే పనిలో పడ్డాడు.

సినిమాకి  ‘రొమాంచికం’ అనే టైటిల్‌

ఈ క్రమంలోనే ‘మేం ఫేమస్’ సినిమాతో ప్రామిసింగ్ హీరోగా స్టాంప్ వేసుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా ఒక పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో వైవిధ్యమైన లవ్ స్టోరీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఇక లేటెస్ట్ గా ఈ సినిమాకి ‘రొమాంచికం’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఈ సినిమా ద్వారా రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ గా పని చేసిన వేణు అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడని సమాచారం.

ఇందులో సుమంత్ ప్రభాస్ సరసన ‘మ్యాడ్’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం.ఇక ఈ అమ్మడు రీసెంట్ గా 8 వసంతాలు అనే సినిమాతో మంచి ఫెర్ఫామర్ గా పేరు తెచ్చుకుంది కూడా.ఇక ఈ సినిమాకి వంగా డైరెక్షన్ చేయకపోయినా, ఆయన ప్రొడక్షన్ నుంచి వస్తుండటంతో ఈ చిన్న సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయ్. ఇక ప్రస్తుతం జోరుగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమాలో వంగా మార్క్ రియలిస్టిక్ ట్రీట్మెంట్, ఎమోషన్స్ గట్టిగానే ఉంటాయన్న సంగతి స్పెషల్ గా చెప్పక్కర్లేదు.

ఎండుమిర్చి చల్లితే సరిపోదు.. ఏకంగా పొలాన్నే తగలేయాలి

ఇక వైపు సినిమా ప్రొడక్షన్ తో బిజీగా ఉన్న సందీప్ తాజాగా  తనదైన సెన్సేషన్ కామెంట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. తాజాగా తన ‘స్పిరిట్’ హీరో ప్రభాస్‌తో కలిసి హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్‌లో ‘ధురంధర్ 2’ ని చూసిన సందీప్ తనదైన స్టైల్ లో చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తుంది.ఈ సినిమాపై  ‘ప్రొపగండా’ అనే ముద్ర వేసే వారిపై  ఫైర్ అవుతూ “ఎదుటివారిని హేళన చేయడం మీ నైజం అయితే, మిమ్మల్ని మీరు లిబరల్స్ అని పిలుచుకునే అర్హత లేదు” అంటూ గట్టిగానే చురకలు అంటించాడు. ఇంకాస్త అడుగు ముందుకేసి  “ఈ కాల దృష్టి అంత సులభంగా పోదు, గుప్పెడు ఎండుమిర్చి చల్లితే సరిపోదు.. ఏకంగా పొలాన్నే తగలేయాలి” అంటూ’ధురంధర్ 2′ టీమ్‌ ని  తనదైన శైలిలో వెనకేసుకొచ్చాడు.

మొత్తానికి ప్రభాస్, సుమంత్ ప్రభాస్ అనే ఇద్దరు హీరోలతో రెండు క్రేజీ ప్రాజెక్టులను డీల్ చేస్తూ, తనదైన శైలిలో విమర్శకులకు ఆన్సర్ ఇస్తూ సందీప్  వంగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ అయిపోయాడు.చూడాలి మరి స్పిరిట్ రిలీజ్ అయ్యాకా ఇతగాడి క్రేజ్ ఇంకే రేంజ్ కి వెళ్తుందో !

also read:అజిత్ ‘డబుల్’ ప్లాన్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే! సొంతంగా రంగంలోకి దిగుతున్న ‘థాలా’..?

Related News

బాలీవుడ్ లో తెలుగు బ్యూటీల హవా.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

సలార్ 2 నుండి పుష్ప 3 దాకా.. అంచనాలు పెంచి చేతులెత్తేస్తున్నారా?

‘ప్రతి ఒక్కడు దొంగే..’ అంటూ పూరీ జగన్నాథ్ సంచలన ట్వీట్.. నెట్టింట వైరల్

థియేటర్ డోర్ వెనుక బాలీవుడ్ లవ్ బర్డ్స్ సీక్రెట్ ప్లాన్.. కెమెరామెన్స్ దెబ్బకు స్కెచ్ రివర్స్!

వివాదాల్లో పెద్ది…రామ్ చరణ్ సినిమాపై ఈ రేంజ్ నెగెటివిటీనా?

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

Big Stories

×