E-Paper
Advertisement

రైల్వే శాఖ సమ్మర్ షాక్.. తెలుగు రాష్ట్రాల్లో 15 రైళ్లు రద్దు

రైల్వే శాఖ సమ్మర్ షాక్.. తెలుగు రాష్ట్రాల్లో 15 రైళ్లు రద్దు
Advertisement

SCR Trains Cancelled: వేసవిలో సాధారణంగా రైలు ప్రయాణాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇస్తుండడంతో.. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు రైలు ప్రయాణాలనే ఎంచుకుంటారు. అయితే దక్షిణ మధ్య రైల్వే పలు రైలు సర్వీసులను రద్దు చేసి తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు సమ్మర్ షాక్ ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రయాణించే 15 సర్వీసులను ఏప్రిల్ 19 వరకు రద్దు చేసింది. పలు రైల్వే మార్గాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా పనుల కారణంగా మొత్తం 15 రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

ట్రాక్ పనులు

విద్యుదీకరణ, ట్రాక్ డబ్లింగ్, లేటెస్ట్ సిగ్నలింగ్ అప్‌గ్రేడ్ పనులు, ట్రాక్ నిర్వహణలో భాగంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సురక్షితమైన రైలు రాకపోకల కోసం ప్రస్తుతం మహబూబ్‌నగర్, మన్యంకొండ స్టేషన్ల మధ్య నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య నడిచే MEMU, DEMU సర్వీసులపై ఎక్కువగా ప్రభావం పడనుంది. దీంతో నిత్యం ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బందిపనున్నారు. విజయవాడ, విశాఖపట్నం, కాచిగూడ, గుంటూరు, సికింద్రాబాద్‌ మధ్య పలు లోకల్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.

Advertisement

వేసవి కాలంలో రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో రైళ్ల రద్దీ అసౌకర్యం కలిగిస్తున్నప్పటికీ, ప్రయాణికుల సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. పలు రైళ్లను స్వల్పంగా టైమ్ మార్చి తిరిగి ప్రారంభించారు. రైళ్ల రద్దుతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.

ఈ రైలు సర్వీసులు రద్దు

  • కాచిగూడ-మహబూబ్‌నగర్ (రైలు నంబర్ 67781) ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 18 వరకు రద్దు
  • మహబూబ్‌నగర్-కాచిగూడ (రైలు నంబర్ 67782) ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 19 వరకు రద్దు
  • కాచిగూడ -రాయచూర్ (రైలు నెంబర్ 67787, 67788) ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 18 వరకు రద్దు
  • గుంతకల్-బోధన్ (రైలు నంబర్ 57411) ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 18 వరకు రద్దు
  • బోధన్ -కాచిగూడ (రైలు నంబర్ 57414) ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 19 వరకు రద్దు
  • కాచిగూడ-గుంతకల్ (రైలు నంబర్ 57412) ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 19 వరకు రద్దు
  • కాచిగూడ -కర్నూలు సిటీ (రైలు నంబర్ 17435) ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 18 వరకు రద్దు
  • కర్నూలు సిటీ-కాచిగూడ ( రైలు నంబర్ 17436) ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 19 వరకు రద్దు
  • కాచిగూడ- రాయచూర్ (రైలు నెంబర్ 17693, 17694) ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 17 వరకు రద్దు
  • రాయచూర్ – గద్వాల్ వెళ్లే (రైలు నెంబర్ 67783, 67784) ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 17 వరకు రద్దు

ఈ సర్వీసులపై ప్రభావం

  • విజయవాడ-విశాఖపట్నం రైళ్లు (నెంబర్ 07466, 07467)
  • కాకినాడ పోర్ట్ -విశాఖపట్నం రైళ్లు (నెంబర్ 07456 , 07457)
  • విజయవాడ – తెనాలి రైళ్లు (నెంబర్ 07282 , 07279)
  • విజయవాడ- ఒంగోలు రైళ్లు ( నెంబర్ 07278, 07470)
  • గుంటూరు – తెనాలి రైళ్లు (నెంబర్ 7476, 07440)
  • విశాఖపట్నం-మచిలీపట్నం రైలు (నెంబర్ 17220)
  • మచిలీపట్నం -విశాఖపట్నం రైలు (నెంబర్ 17219)

రైళ్ల రద్దుతో ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైల్వే వెబ్‌సైట్ లేదా NTES ప్లాట్‌ఫామ్‌ను లో ట్రైన్ రన్నింగ్ స్టేటస్ తనిఖీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

Also Read:ప్రకృతి అందాల నడుమ 180 డిగ్రీ వ్యూ.. విస్టాడోమ్ ట్రైన్ జర్నీ ఒక్కసారైనా చేయాలి బ్రో!

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×