Asian – Chiranjeevi: చిత్ర పరిశ్రమలో అతిపెద్ద నిర్మాణ , ఎగ్జిబిషన్ సంస్థగా పేరుపొందిన ఏషియన్ సినిమాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు సినిమాలు నిర్మిస్తూనే.. డిస్ట్రిబ్యూట్ చేస్తూనే.. స్టార్ హీరోలతో చేతులు కలుపుతూ పెద్ద ఎత్తున మల్టీప్లెక్స్ థియేటర్లు నిర్మిస్తూ దూసుకుపోతోంది. అలాంటి ఈ ఏషియన్ సినిమాస్ సంస్థతో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) చేతులు కలపడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. భారతీయ సినీ రాజధానిగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ ఏర్పాటుకు సన్నహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అంతర్జాతీయ స్థాయి ప్రీమియం మల్టీప్లెక్స్ ప్రాపర్టీని నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే ఇప్పటివరకు ప్రపంచంలో జర్మనీలోని ట్రౌమ్ పలాస్ట్ (127×69 అడుగులు) , అమెరికాలోని పూలర్ రాయల్ సినిమాస్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డులను ఇప్పుడు బద్దలు కొట్టేలా ప్లాన్ చేస్తున్నారట ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని సూళ్లూరుపేట ‘వి ఎపిక్ ‘ (106×56 అడుగులు) ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్ గా ఉండగా.. హైదరాబాదులో రానున్న ఈ మెగా ప్రాజెక్ట్ ఏకంగా గ్లోబల్ స్థాయిలోనే సినిమా చరిత్రను తిరగరాయనుంది అని సమాచారం.
ఇకపోతే టాలీవుడ్ లో ఇప్పటికే అత్యాధునిక మల్టీప్లెక్స్ లను తీర్చిదిద్దిన ప్రముఖ నిర్మాత , పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో చేతులు కలపడం ట్రేడ్ వర్గాలలో సంచలనం సృష్టిస్తోంది నగరంలోని ఐటి, కార్పొరేట్ హబ్ గా వేగంగా విస్తరిస్తున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వేదికగా ఒక అల్ట్రా – ప్రీమియం మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్ ను నెలకొల్పేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. అయితే ఇది కేవలం ఒక విలాసవంతమైన థియేటర్ మాత్రమే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్ ఇక్కడ ఆవిష్కరించాలనే గొప్ప లక్ష్యంతో ఈ భాగస్వామ్యం ముందడుగు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
also read; ఆ ఇద్దరూ మరీ అంత వరస్ట్? ఇచ్చిపడేసిన నాగ్!
ఇప్పటికే భారీ స్క్రీన్ల చరిత్ర తెలుగు రాష్ట్రాలకు ఉంది. ఆంధ్రప్రదేశ్లోని సూళ్లూరుపేటలో చెన్నై – కోల్కతా జాతీయ రహదారి పక్కన నిర్మించిన వి ఎపిక్ మల్టీప్లెక్స్ ఇండియాలోనే కాకుండా ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్ గా పేరు సొంతం చేసుకుంది. దీనిని 2019లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. సినీ ప్రేక్షకులకు విలాసవంతమైన స్క్రీన్ అనుభవాన్ని అందించడంలో ఇది ఒక మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా 676 సీట్ల సామర్థ్యంతో దీనిని రూపొందించారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మెగాస్టార్ చిరంజీవి ఏసియన్ భాగస్వామ్యంతో ప్లాన్ చేస్తున్న ప్రాజెక్టు కేవలం దేశీయ, ఆసియా రికార్డులను మాత్రమే కాకుండా గ్లోబల్ రికార్డులను సైతం తిరగరాయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న చిరంజీవి ఇప్పుడు ఏకంగా ఈ థియేటర్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.