E-Paper
Advertisement

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు
Advertisement

Sandeep Reddy Vanga:ఎట్టకేలకి తెలంగాణకి రెండో ఎయిర్ పోర్ట్ వస్తుండటంతో మురిసిపోతున్నారంతా ..ఇక ఈ ఎయిర్ పోర్ట్ వరంగల్ కి దక్కడంతో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.ఇక ఇదే విషయం పై టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ డైరెక్టర్ సందీప్ వంగా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు.. ఎయిర్‌పోర్టుకు ఏ పేరు పెడితే బాగుంటుందో తనకు తోచిన రెండు పేర్లను కూడా ఇక్కడ సూచించడం విశేషం.

వరంగల్ ఎయిర్‌పోర్టుపై రియాక్ట్

Advertisement

సందీప్ రెడ్డి వంగా తన ఎక్స్ లో వరంగల్ ఎయిర్‌పోర్టుపై రియాక్ట్ అవుతూ తన సొంత ఊరైన వరంగల్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కల నిజం కాబోతుండటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎయిర్‌పోర్టుకు ‘రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’ లేదా ‘కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’ అనే పేర్లు పెట్టాలని సూచించారు. వరంగల్‌కు ఉన్న గొప్ప చరిత్ర, కాకతీయుల సంస్కృతి, వారసత్వం గుర్తుండిపోయేలా ఎయిర్‌పోర్టుకు పేరు ఉండాలంటూ ఎక్స్ లో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.

రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు

Advertisement

అంతేకాదు.. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా సందీప్ రెడ్డి వంగా ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఆయన చేసిన ఈ  పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తుందన్న సంగతి తెల్సిందే.. వరంగల్‌కు ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ తర్వాత తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరఁగల్ కూడా డెవలప్ అవడానికి ఎంతో అవకాశం ఉంది కూడా .

రేవంత్ సర్కార్ ప్రజల నుంచి పేర్లపై సూచనలు చేయాలని అడుగుతున్న సమయంలోనే సందీప్ రెడ్డి వంగా తన సజెషన్స్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన చెప్పిన రెండు పేర్లలో ‘రుద్రమ’ పేరు రాణి రుద్రమదేవిని గుర్తు చేస్తే.. ‘కాకతీయ’ పేరు  వరంగల్ చరిత్రను గుర్తు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కూడా.

టాలీవుడ్‌లో కూడా వరంగల్‌కు మంచి కనెక్షన్

ఇప్పటికే టాలీవుడ్‌లో కూడా వరంగల్‌కు మంచి కనెక్షన్ ఉంది. తెలంగాణలో సినిమా షూటింగ్స్‌ బాగా జరిగే ప్రదేశంగా వరంగల్ కి మంచి పేరు ఉంది . కాకతీయుల చరిత్ర, పాత కట్టడాలు, రామప్ప టెంపుల్ .. ఇలా ఎన్నో రకాల లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ . అందుకే భవిష్యత్తులో ఎయిర్ పోర్ట్ వస్తే ఇక్కడ మరిన్ని షూటింగ్స్ జరగడం పక్కా.

పేర్లని పరిశీలిస్తుందా లేక మరే పేరు ఏదైనా పెడుతుందా

ఇక ఎయిర్‌పోర్టు పేరు విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి .సందీప్ రెడ్డి వంగా చెప్పిన ‘రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’, ‘కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’ పేర్లని పరిశీలిస్తుందా లేక మరే పేరు ఏదైనా పెడుతుందా చూడాలి .

మొత్తానికి వరంగల్ ఎయిర్‌పోర్టు విషయంలో సందీప్ రెడ్డి వంగా చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరలేపిందనడంలో సందేహం లేదు !

ALSO READ:ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!
.

Tags

Related News

నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

వెండితెర పైకి ‘రఘుకుల తిలకరారా’ సాంగ్..

భూ కబ్జా వ్యవహారం.. నిర్మాత సి కళ్యాణ్ పై పోలీస్ కేసు నమోదు!

Big Stories

Advertisement
×