E-Paper
Advertisement

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?
Advertisement

Deepika Padukone: బాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో దీపిక పదుకొనే(Deepika Padukone) ఒకరు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్న ఈమె ఇటీవల రెండోసారి తల్లి కాబోతున్నాననే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇలా తన ప్రేగ్నేన్సి ప్రకటించినప్పటి నుంచి ఈమె తరచూ తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ వచ్చారు.. ఇకపోతే ఇటీవల అంబానీ కుటుంబంలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా దీపికా పదుకొనే పాల్గొని సందడి చేశారు.

ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా…

ఇలా ప్రెగ్నెన్సీ తో ఉన్న దీపికా పదుకొనే తాజాగా డెలివరీ అయ్యారని తెలుస్తుంది. ఈ విషయాన్ని ఈమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు. తన బిడ్డకు స్వాగతం పలుకుతూ ఈమె పోస్ట్ చేశారు. అయితే మరోసారి కూడా దీపికా పదుకొనే ఆడబిడ్డకు (Baby Girl)జన్మనిచ్చారని తెలుస్తోంది. ఇలా రెండో సంతానంగా దీపికా పదుకొనే అమ్మాయికి జన్మనివ్వడంతో సోషల్ మీడియా వేదికగా దీపిక, రణవీర్(Ranvir Singh) దంపతులకు అభినందనలు తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు. ఇక దీపిక పదుకొనే పాప జన్మించిందనే విషయాన్ని తెలియజేశారు కానీ పాప ఫోటో మాత్రం సోషల్ మీడియా వేదికగా షేర్ చేయలేదు.

మొదటి సంతానంగా అమ్మాయి..

Advertisement

ఇకపోతే ఈమెకు తన మొదటి సంతానంలో భాగంగా అమ్మాయి జన్మించిన విషయం తెలిసిందే ఈ చిన్నారి 2024లో జన్మించారు. ఈ చిన్నారికి దువా అని నామకరణం చేశారు. ఇక రెండో సంతానంలో కూడా ఈమెకు పాప జన్మించటం విశేషం. ఇక దీపిక పదుకొనే ప్రెగ్నెంట్ కావడంతో కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి చిన్న బ్రేక్ ఇచ్చారు. త్వరలోనే ఈమె తిరిగి తన సినిమాల షూటింగ్ పనులలో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె పలు బాలీవుడ్ సినిమాలతో పాటు అల్లు అర్జున్ (Allu Arjun)నటిస్తున్న రాకా(Raaka) సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

ఇదివరకే కల్కి సినిమాలో సుమతి పాత్రలో నటించిన దీపికా పదుకొనే ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావడంతో ఈమె అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న రాకా సినిమాలో భాగమయ్యారు. ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది. ఇక ఈమె కల్కి 2 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాలో కూడా దీపికా పదుకొనే నటించే అవకాశాన్ని అందుకున్నప్పటికీ పలు వివాదాల కారణంగా స్పిరిట్ సినిమా నుంచి కూడా ఈమె తప్పుకున్నారు. ప్రస్తుతం రాకా సినిమాతో పాటు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Also Read: తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

Related News

నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

వెండితెర పైకి ‘రఘుకుల తిలకరారా’ సాంగ్..

భూ కబ్జా వ్యవహారం.. నిర్మాత సి కళ్యాణ్ పై పోలీస్ కేసు నమోదు!

‘కొబ్బరి మట్ట’ సంపూ కాదు.. ‘ది ప్యారడైజ్’లో కొత్త సంపూని చూస్తారట!

Big Stories

Advertisement
×