E-Paper
Advertisement

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!
Advertisement

Prakash Raj: సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల కాలంలో రాజకీయాలకు సంబంధించిన విషయాల పట్ల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఏపీ రాష్ట్ర రాజకీయాలపై కూడా ఈయన తరచూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను తెలుపుతూ పోస్టులు చేయడం పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతుంది. ముఖ్యంగా కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం(Laddu Prasadam)లో జంతువుల కొవ్వు కలిసిందంటూ గతంలో ఆరోపణలు రావడంతో ఈ విషయంపై కూడా ప్రకాష్ రాజ్(Prakash Raj) గతంలో ఘాటుగా స్పందించారు.

లడ్డులో కొవ్వు లేదు..

ఇకపోతే తిరుమల లడ్డులో కల్తీ జరిగిందా లేదా అనే విషయంపై విచారణ జరిపిన అనంతరం ఈడీ నివేదికను సమర్పించారు. అయితే తిరుమల లడ్డులో ఎలాంటి కల్తీ లేదని ఇందులో కొవ్వు కలవలేదని ఈడి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలోనే గతంలో తిరుమల లడ్డుపై చేసిన ఆరోపణలన్నీ కూడా రాజకీయ లబ్ధి కోసమేనని స్పష్టమవుతుంది. తాజాగా ఈడీ నివేదికలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈయన తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈడీ సమర్పించిన నివేదికను షేర్ చేస్తూ..”లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు  తప్ప.. జస్ట్ ఆస్కింగ్” అంటూ ట్వీట్ వేశారు.

పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్..

Advertisement

ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక గతంలో కూడా ఈయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ని ఉద్దేశించి పరోక్షంగా తిరుమల లడ్డు కల్తి వివాదంపై పోస్టులు పెట్టారు. ఏపీలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ విషయంపై లోతుగా దర్యాప్తు జరిపి నిందితులకు శిక్ష పడాలి అంటూ ఈయన ఈ అంశం గురించి పదేపదే ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఇక తిరుమల లడ్డు కల్తీ విషయంలో ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే విధంగా సోషల్ మీడియా వేదికగా వార్ జరిగింది.

Advertisement

ఇకపోతే తాజాగా ఈడీ సమర్పించిన నివేదికను ఈయన షేర్ చేస్తూ లడ్డులో ఏ కొవ్వు లేదు మతోన్మాదుల కొవ్వు తప్ప అంటూ పోస్ట్ చేయడంతో మరోసారి ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియా వేదికగా చర్చలకు కారణమైంది. మరి ఈ పోస్ట్ పట్ల పవన్ కళ్యాణ్ నుంచి ఏ విధమైనటువంటి స్పందన ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఈడీ సమర్పించిన ఈ నివేదిక పట్ల ఇటు ప్రభుత్వం కానీ లేదా ప్రతిపక్షం కానీ స్పందించలేదు. ఏది ఏమైనా కోట్లాదిమంది భక్తులు ఆరాధ్య దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి (Venkateswara Swami) లడ్డు ప్రసాదం పై ఈ విధమైనటువంటి ఆరోపణలు రావడంతో పెద్ద ఎత్తున భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పాలి.

Also Read: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

Related News

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

వెండితెర పైకి ‘రఘుకుల తిలకరారా’ సాంగ్..

భూ కబ్జా వ్యవహారం.. నిర్మాత సి కళ్యాణ్ పై పోలీస్ కేసు నమోదు!

‘కొబ్బరి మట్ట’ సంపూ కాదు.. ‘ది ప్యారడైజ్’లో కొత్త సంపూని చూస్తారట!

విడాకుల వ్యవహారంపై స్పందించిన నీతి టేలర్.. అంత మాట అన్నారేంటి?

‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్ కోసం కయాదు లోహర్ కొత్త స్ట్రాటజీ.. ఫొటోస్ వైరల్!

Big Stories

Advertisement
×