The Paradise Sequel: ఇటీవల కాలంలో ఒక సినిమా మంచి సక్సెస్ అయ్యింది అంటే కచ్చితంగా ఆ సినిమాకు సీక్వెల్ రావడం సర్వసాధారణం అయింది ఇప్పటికే ఎన్నో సీక్వెల్స్ సినిమాలు సెట్స్ పై షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి. ఇకపోతే సెప్టెంబర్ అక్టోబర్ నెలలలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.ఇలా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలలో నాచురల్ స్టార్ నాని (Nani)హీరోగా నటించిన ది ప్యారడైజ్(The Paradise) సినిమా ఒకటి. తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ విడుదల కాబోతుంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో నానితో పాటు డైరెక్టర్ శ్రీకాంత్ సైతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ సినిమాకు సీక్వెల్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనే ప్రశ్న ఎదురవడంతో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా మాట్లాడుతూ.. ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్ లేదని క్లారిటీ ఇవ్వడమే కాకుండా ఈ సినిమా సింగిల్ బుల్లెట్ సినిమా అని తెలిపారు.
ఇక ఈ సినిమాలో నాని రెండు జడలు గురించి చర్చ వచ్చినప్పుడు టీం మొత్తం మొదట్లో వద్దని చెప్పారు కానీ నాని గారు తనపై ఉన్నటువంటి నమ్మకంతో సినిమా చేశారని తెలిపారు . ఈ సినిమా మొత్తం 171 రోజుల షూటింగ్ జరిగిందని శ్రీకాంత్ ఈ సందర్భంగా తెలిపారు. ఇలా ఈయన ఈ సినిమాకు సీక్వెల్ ఉండదని క్లారిటీ ఇవ్వడంతో ఈ సీక్వెల్ వార్తలకు తెరపడింది. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని, మోహన్ బాబు ప్రధాన విలన్ అంటూ కూడా శ్రీకాంత్ ఓదెల తెలియజేశారు. ఇక మోహన్ బాబు నాని మధ్య 4 భారీ ఫైట్ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలిపారు.
ఈ విధంగా సినిమా గురించి ఎన్నో ఆసక్తి కరమైన విషయాలను తెలియచేస్తూ డైరెక్టర్ సినిమా పై భారీగా అంచనాలను పెంచేశారు. మరి సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా తెలుగు, తమిళ,మలయాళ, కన్నడ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా సెప్టెంబర్ 23వ తేదీ ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి దాదాపు 800 షోలలో ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి .అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు టికెట్ ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో నాని జోడిగా కయాదు లోహర్ నటించగా, కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్ లో సందడి చేశారు.
Also Read: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?