Sreeleela Photos:డాన్సింగ్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీల గత కొంతకాలంగా సరైన హిట్స్ లేక లైమ్ లైట్ లో నుండి మాయం అయింది.అందుకే కాబోలు ఇపుడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు పెడుతూ మరోసారి మీడియాలో హైలెట్ అయ్యే పనిలో పడింది.ఇదిగో ఆ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను ఫిదా చేస్తుంది.
ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా కనిపించే ఈ బ్యూటీ.. ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్ లుక్‌లో దర్శనమిచ్చి అందరి దృష్టిని తనవైపు తిప్పేసుకుంది..
అభిమానుల నుంచి రెస్పాన్స్
ఇక శ్రీలీల షేర్ చేసిన ఫొటోలకు అభిమానుల నుంచి రెస్పాన్స్ కూడా సాలిడ్ గానే వస్తోంది. ముఖ్యంగా ఆమె కళ్లు, చిరునవ్వు, స్టైలింగ్ అంతా టాప్ నాచ్ అని కొందరు అంటుంటే ,ఈ లుక్‌లో శ్రీలీల చాలా అందంగా ఉందంటూ మరి కొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు పెట్టిన ఫొటోలకి ప్రతీసారి సాలిడ్ రెస్పాన్స్ రావడం విశేషం..ఇలా శ్రీలీల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె పేరు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.
ఇక ఈ పోస్ట్‌కు శ్రీలీల పెట్టిన క్యాప్షన్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన అందం కంటే ఫొటోల్లో కనిపిస్తున్న ఎలిగెన్స్‌నే హైలైట్ చేసేలా ఈ పోస్ట్ ఉండటంతో అభిమానులు తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. కొందరు ‘బ్యూటీ క్వీన్’ అంటూ కామెంట్ చేస్తుంటే.. మరికొందరు ‘సింప్లీ గార్జియస్’ అంటూ ప్రశంసిస్తున్నారు.
కెరీర్‌కు మంచి బూస్ట్
ఇక శ్రీలీల విషయానికి వస్తే.. తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరని చెప్పాలి.ముఖ్యంగా డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీలీల వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది. ముఖ్యంగా రవితేజతో చేసిన ‘ధమాకా’ సినిమా ఆమె కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాలో ఆమె డ్యాన్స్, కామెడీ టైమింగ్, ఇచ్చిన పెర్ఫార్మెన్స్‌కు మంచి అప్లాజ్ దక్కింది.అలాగే బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’లోనూ శ్రీలీల నటనకి మంచి మారాజులు పడ్డాయి.
లైమ్ లైట్ నుండి దూరంగా
అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు తో నటించిన ‘గుంటూరు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం,ఇక అలాగే చేసిన పరాశక్తి ,ఉస్తాద్ భగత్ సింగ్ వంటి భారీ సినిమాలు అన్నీ డిజాస్టర్ టాక్ మూటగట్టుకోవడంతో ప్రస్తుతం లైమ్ లైట్ నుండి దూరంగా వెళ్ళిపోయింది.
మొత్తానికి సినిమాలలో జోరు తగ్గించినా సోషల్ మీడియాలోనూ శ్రీలీల చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా అప్‌డేట్స్ తో పాటు ఫ్యాషన్ లుక్స్, ఫొటోషూట్స్, ట్రావెల్ మూమెంట్స్, పర్సనల్ విషయాలు ..ఇలా వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకుంది.
ఎలాంటి సినిమాల్లో తళుక్కు మంటుందో !
ఒకవైపు కమర్షియల్ సినిమాల్లో గ్లామర్, డ్యాన్స్‌తో అదరగొడుతూనే మరోవైపు తన నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేయాలనే ఆసక్తిని కూడా ఈ బ్యూటీ చూపిస్తోందని తెలుస్తుంది .చూడాలి మరి . అందుకే రాబోయే రోజుల్లో ఈ బ్యూటీ ఎలాంటి సినిమాల్లో తళుక్కు మంటుందో !