Film industry:ఈ మధ్యకాలంలో వ్యక్తుల అకాల మరణాలు అటు సామాన్యులను ఇటు కుటుంబ సభ్యులను, సినీ సెలబ్రిటీలను, అభిమానులను ఆందోళనలకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వయసు మీద పడి కొంతమంది వృద్ధాప్య కారణాలవల్ల తుది శ్వాస విడుస్తుంటే.. మరికొంతమంది అనారోగ్య సమస్యలతో చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొంతమంది ఇతరులకు సహాయం చేయడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇంకొంతమంది అకస్మాత్తుగా ప్రమాదంలో చిక్కుకొని ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇలా ఇప్పుడు ఒక నటుడు కూడా ఇలా అకస్మాత్తుగా భవనం పైనుంచి పడి తుది శ్వాస విడిచారు.
ఆయన ఎవరో కాదు ప్రముఖ చైనా నటుడు, సింగర్, డైరెక్టర్ యు మెంగ్లాంగ్ (Yu Menglong). ప్రస్తుతం ఆయన వయసు 37 సంవత్సరాలు. నిన్న (గురువారం) ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులు నిర్ధారించడం గమనార్హం. ఇకపోతే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
యు మెంగ్లాంగ్ సినిమా కెరియర్..
నటుడిగా, సింగర్ గా, డైరెక్టర్ గా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్న ఈయన.. 2013లో వచ్చిన ‘సూపర్ బాయ్’ అనే పాటల పోటీతో తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ‘గో ప్రిన్సెస్ గో’ అనే వెబ్ డ్రామాలో కూడా నటించి మంచి పేరు అందుకున్నారు. ఈయన నటించిన సినిమాల విషయానికొస్తే లిటిల్ ప్రిన్స్, లవ్ స్టూడియో, వారెంట్ ది రీబార్న్ ఇలా పలు చిత్రాలలో నటించిన ఈయన.. టెలివిజన్ సిరీస్ లలో కూడా నటించారు. అంతేకాదు వెబ్ సిరీస్లలో కూడా నటించి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ చిత్రీకరణలో ఉన్నట్లు సమాచారం. పలు మ్యూజిక్ ఆల్బమ్స్ లో పాటలు పాడి ప్రేక్షకులను అలరించిన ఈయన స్వతహాగా సింగర్?. అలా పలు చిత్రాలలో అద్భుతమైన పాటలను పాడి తన గాత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.
యు మెంగ్లాంగ్ అందుకున్న అవార్డులు:
2017లో ఆసియన్ మ్యూజిక్ గాలా అవార్డును అత్యంత ప్రజాధారణ పొందిన ఆల్ రౌండర్ ఆర్టిస్ట్ విభాగంలో అందుకున్నారు. అలాగే నూతన కళాకారుడు విభాగంలో వీబో టీవీ ఆన్లైన్ వీడియో అవార్డును కూడా దక్కించుకోవడం జరిగింది. గోల్డెన్ బర్డ్ నాల్గవ నెట్వర్క్ ఫిలిం అండ్ టెలివిజన్ ఫెస్టివల్లో.. బ్రేక్ త్రూ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో అవార్డును సొంతం చేసుకున్నారు. ఇలా పలు అవార్డులు అందుకొని అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను దక్కించుకున్నారు.
ALSO READ: TV: షూటింగ్ సెట్ లో ఇంత దారుణమా.. చిన్నారికి కరెంట్ షాక్ ఇచ్చి మరీ!