 
					The Girl Friend: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఈమె థామా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే త్వరలోనే మరొక సినిమా ద్వారా రాబోతున్న సంగతి తెలిసిందే. సినీ నటుడు రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) దర్శకత్వంలో రష్మిక, దీక్షిత్ శెట్టి (Deekshith Shetty)ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend). ఈ సినిమా నవంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నటుడు రాహుల్ రవీంద్రన్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రాహుల్ రవీంద్రన్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు రష్మిక మొదటి ఎంపిక కాదని ఈ సినిమాలో రష్మికను తీసుకోవాలి అంటూ సలహా ఇచ్చింది నటి సమంత(Samantha) అని రాహుల్ రవీంద్రన్ తెలిపారు. తాను ఏదైనా ఒక కథ సిద్ధం చేసిన కచ్చితంగా దానిని నా స్నేహితులు వెన్నెల కిషోర్, సమంత, అడివి శేష్ , సుజీత్ వంటి వారికి చూపించడం అలవాటు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కథ సిద్ధం చేసి సమంతకు ఇచ్చాను ఆమె కథ మొత్తం చదివి ఈ సినిమా చేయడానికి నేను కరెక్ట్ కాదని తెలిపారు.
అలాగే ఈ సినిమా చేయడానికి కరెక్ట్ పర్సన్ రష్మిక అంటూ సమంత సలహా ఇచ్చారని ఇక సమంత ఇచ్చిన ఈ సలహా తర్వాత రష్మికకు ది గర్ల్ ఫ్రెండ్ స్టోరీ పంపించడంతో ఆమె రెండు రోజులపాటు ఈ స్టోరీ చదివి, ఈ సినిమాకు నేను బాగా కనెక్ట్ అయ్యాను, బయట ఉన్న అమ్మాయిలకు నేను ఇచ్చే హగ్ ఇదే, వెంటనే సినిమా స్టార్ట్ చేద్దాం అంటూ రష్మిక తెలిపారని రాహుల్ రవీంద్రన్ వెల్లడించారు. నిజానికి ఈ కథను చాలా సంవత్సరాల క్రితమే తాను సిద్ధం చేసుకున్నానని మొదట అల్లు అరవింద్ గారికి వినిపించి వెబ్ సిరీస్ లాగా చేద్దామని చెప్పాను కానీ ఆయన మాత్రం సినిమా చేద్దామని చెప్పినట్టు తెలిపారు.
సమంతకు మద్దతుగా రాహుల్ రవీంద్రన్..
ఇక ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా గీత ఆర్ట్స్ సమర్పణలో ధీరజ్ మొగలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ ఏడో తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్ సినిమా పట్ల మంచి అంచనాలని పెంచేసాయి. ఇక రాహుల్ రవీంద్ర సమంత మధ్య చాలా మంచి స్నేహబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన సమంతకు అండగా రాహుల్ రవీంద్రన్ చిన్మయి దంపతులు మద్దతుగా నిలిచారు. కెరియర్ మొదట్లో సమంతకు సింగర్ చిన్మయి డబ్బింగ్ చెప్పడంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధమే ఏర్పడింది తద్వారా వీరు మంచి స్నేహితులుగా మారిపోయారు.
Also Read: Prabhas: ప్రభాస్ కాలికి ఏమైంది.. ఆ సమస్యతో బాధపడుతున్నాడా.. టెన్షన్ లో ఫ్యాన్స్!