Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)ప్రస్తుతం హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణంగా మహేష్ బాబుకు షూటింగ్ లో ఏమాత్రం విరామం దొరికిన వెంటనే తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు పయనం అవుతూ అవుతుంటారు. ఏడాదిలో కనీసం నాలుగైదు సార్లు ఈయన వెకేషన్ లోనే గడుపుతూ ఉంటారు. ఎప్పుడైతే రాజమౌళి సినిమాకు కమిట్ అయ్యారో రాజమౌళి ఏకంగా మహేష్ బాబు పాస్ పోర్ట్ లాగేసుకొని తనని బంధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం రాజమౌళి(Rajamouli) నుంచి మహేష్ బాబుకు విముక్తి దొరికిందని చెప్పాలి. దీంతో ఈయన ఏమాత్రం ఆలోచించకుండా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లారు..
ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కు వెళ్లారని తెలుస్తోంది. తాజాగా మాల్దీవ్స్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇందులో భాగంగా సముద్రం మధ్యలో ఎగసిపడుతున్న అలల మధ్య ఉన్న ఫోటోని మహేష్ బాబు షేర్ చేస్తూ అద్భుతమైన ప్లేసులో.. గొప్ప అనుభవం థాంక్యూ ఫర్ ద వండర్ ఫుల్ స్టే అంటూ ఈ ఫోటోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో పై అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29(SSMB 29) సినిమా షూటింగుకు కాస్త బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది. రాజమౌళి బాహుబలి ది ఎపిక్ (Bahubali The Epic) సినిమా పనులలో బిజీగా గడుపుతున్నారు. ఇలా బాహుబలి సినిమా రెండు భాగాలుగా తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రాజమౌళి కూడా బిజీగా ఉండటంవల్లే మహేష్ బాబుకి బ్రేక్ దొరికిందని చెప్పాలి. ఇలా షూటింగ్ పరంగా బ్రేక్ రావడంతోనే ఈయన ఫ్యామిలీతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక బాహుబలి ది ఎపిక్ సినిమా అక్టోబర్ 31వ తేదీ విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదలైన అనంతరం రాజమౌళి తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు. వచ్చేనెల మొదటి వారంలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.
అడ్వెంచర్స్ మూవీగా..
ఇక ఎస్ఎస్ఎంబి 29 విషయానికి వస్తే ఈ సినిమా అడ్వెంచర్స్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. అయితే సినిమా నుంచి ఏ ఒక్క చిన్న అప్డేట్ ఇవ్వకుండా రాజమౌళి చాలా రహస్యంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నారు అయితే ఈ సినిమా నుంచి ఏదైనా ఒక అప్డేట్ వస్తే బాగుండని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం కూడా ఒక ఈవెంట్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ తో పాటు ఒక గ్లింప్ కూడా విడుదల చేయడానికి రాజమౌళి ప్లాన్ చేశారని ఈ కార్యక్రమాన్ని వచ్చే నెలలో నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు వార్తలు కూడా వచ్చాయి.
Also Read: The Girl Friend: ది గర్ల్ ఫ్రెండ్ పస్ట్ ఛాయిస్ రష్మిక కాదా.. ఆమె రిజెక్ట్ చేస్తేనే ?