Lokesh Kanagaraj:దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కూలీ మూవీ తర్వాత హీరోగా మారబోతున్నారు. ఆయన ప్రముఖ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రాబోతున్న యాక్షన్ సినిమాతో నటుడిగా మారబోతున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా సినీ ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమాలో లోకేష్ కనగరాజ్ సరసన నటిస్తున్న ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..
తమిళ సినీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. లోకేష్ కనగరాజ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ నటి డైరెక్టర్ అయినటువంటి వామికా గబ్బి (Wamiqa Gabbi ) నటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ధ్రువీకరించకపోయినప్పటికీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం ఈ సినిమా కోసం థాయిలాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలా లోకేష్ కనగరాజ్ సరసన వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తుందనే వార్త వైరల్ అవ్వడంతోనే చాలామంది వామికా గబ్బికి సంబంధించి మరిన్ని విషయాలు వైరల్ చేస్తున్నారు.
ALSO READ:Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ మూవీలో నటించాలని ఉందా…అయితే ఇలా చేయండి..!
వామికా గబ్బి సినిమాల విషయానికి వస్తే.. తమిళ, తెలుగు,హిందీ, పంజాబీ, మలయాళీ సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది. అలా తెలుగులో అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారి మూవీకి సీక్వెల్ గా వస్తున్న గూఢచారి 2 లో కూడా హీరోయిన్ గా అవకాశం అందుకుంది. అలాగే బాలీవుడ్లో ఆయుష్మాన్ ఖురానా హీరోగా వస్తున్న పతీ పత్నీ ఔర్ వో నదో మూవీలో కూడా వామికా గబ్బి నటిస్తోంది.ఈ మూవీలో వామికా తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ లు నటిస్తున్నారు. అలాగే అక్షయ్ కుమార్ బూత్ బంగ్లా మూవీ తో పాటు ఆసిఫ్ అలీ నటిస్తున్న టికి టాకా అనే మూవీలో కూడా చేస్తోంది. అంతేకాకుండా తమిళ నటుడు జయం రవి నటిస్తున్న జెనీ మూవీలో కూడా వామికా గబ్బి కనిపించబోతోంది.. అలా వరుస సినిమాలను లైన్లో పెట్టిన వామికా గబ్బికి లోకేష్ కనగరాజ్ సరసన కూడా హీరోయిన్ అవకాశం వచ్చినట్టు తమిళ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..
లోకేష్ కనగరాజ్ ఈ మధ్యనే రజినీకాంత్ తో కూలీ అనే మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అలా రజినీకాంత్ హీరోగా.. నాగార్జున విలన్ గా.. వచ్చిన ఈ మూవీలో ఉపేంద్ర, శృతిహాసన్, సత్యరాజ్,సౌబిన్ షాహిర్,రచితా రామ్ లు కీలకపాత్రలు పోషించారు. అంతేకాకుండా ఈ సినిమాలో అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ పోషించగా.. పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది.. లోకేష్ కనగరాజ్ ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతోనే తమిళనటుడు కార్తీతో కైతి 2 మూవీ షూటింగ్ ని ప్రారంభించబోతున్నారు.