8 Vasantalu :ఈ వారం రిలీజ్ కి సిద్ధం అవుతున్న సినిమాలలో 8 వసంతాలు సినిమా ఒకటి. ఫణీంద్ర నరిశెట్టి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద కూడా కొద్దిపాటి అంచనాలు ఉన్నాయి. ఒకప్పుడు ఫణీంద్ర నరిశెట్టి తీసిన మధురం సినిమా షార్ట్ ఫిలిమ్స్ లోనే ఒక సెన్సేషన్. ఇప్పటికీ షార్ట్ ఫిలిమ్స్ ప్రస్తావన వస్తే ఆ సినిమా గురించి ఖచ్చితంగా టాపిక్ వస్తుంది. అంత అద్భుతంగా ఆ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఆ తరువాత మను అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఒక క్రౌడ్ ఫండెడ్. అప్పటికే మధురం సినిమాకి ఉన్న ఫాలోయింగ్ వలన చాలామంది ఫణి ఎంకరేజ్ చేస్తూ మను సినిమా కోసం డబ్బులు పంపించారు. అయితే ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. కానీ ఇప్పటికీ ఆ సినిమాకు విపరీతమైన ప్రశంసలు వస్తూ ఉంటాయి. ఇలా చాలా సినిమాలకు జరుగుతుంది.
8 వసంతాలు యూఎస్ రిపోర్ట్
రేపు రిలీజ్ కానున్న ఈ సినిమా ఆల్రెడీ యుఎస్ లో రిలీజ్ అయిపోయింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలు వైరల్ గా మారాయి. ఓవరాల్ గా ఈ సినిమాకి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఈ సినిమా మీద కొంతమంది రిలీజ్ కంటే ముందు నుంచే నెగటివ్ ఒపీనియన్ తో ఉన్నారు. దీనికి కారణం ఫణి చేసిన కొన్ని కామెంట్స్. మణిరత్నం సినిమాను ఈరోజు చాలామంది కామెంట్ చేస్తున్నారు వాళ్ళకి ఏమి అర్హత ఉంది అని అడగటం ఫణికు మైనస్ గా మారింది. చాలామంది అర్హత అర్హత అంటూ ఫణిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా యూఎస్ ఆడియన్స్ కి ఈ సినిమా విపరీతంగా కనెక్ట్ అవుద్ది అని చిత్ర యూనిట్ అంతా నమ్మింది. అయితే అక్కడినుంచి ఇప్పుడు కొద్ది కొద్దిగా నెగిటివిటీ స్టార్ట్ అయింది.
దర్శకుడు ఎలా స్పందిస్తాడో
ప్రతి దర్శకుడికి తీసే సినిమా పైన నమ్మకం ఉండటం అనేది సహజం. కానీ అతిగా నమ్మకం ఉండటం వలన కొన్నిసార్లు అది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు దాదాపు ఫణి పరిస్థితి అలానే ఉంది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందు నేను కాసేపు కలాన్ని పక్కనపెట్టి కమర్షియల్ సినిమా రాయాలి అంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో మీకు వారణాసి సీక్వెన్స్ చూసి అర్థమవుతుంది అని తెలిపాడు. అయితే ఈ కామెంట్స్ కూడా మళ్లీ వైరల్ గా మారాయి. వాస్తవానికి యుఎస్ ఆడియన్స్ నుంచి పని చెప్పిన ఆ సీక్వెన్స్ కి మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు వేచి చూడాలి. ఈ సినిమా ఫలితం తర్వాత ఫణి ఎలాంటి సినిమా తీస్తాడు అనే క్యూరియాసిటీ కూడా చాలామందికి ఉంది.
Also Read : Nara Rohit: అవి చేయకుండా ఉండాల్సింది, ఆ సినిమాల వల్లే నాకున్న గౌరవం పోయింది