Nara Rohit: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొంతమంది హీరోలపై ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. దీనికి కారణం వాళ్ళు ఎంచుకునే సినిమాలు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమాలు కమర్షియల్ గా సెక్షన్స్ సాధించకపోయిన, అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టకపోయినా కానీ ఆ హీరో అంటే ఒక రకమైన గౌరవం ఉంటుంది. అలాంటి హీరోల ప్రస్తావన వస్తే మొదటి వినిపించే పేరు నారా రోహిత్. బాణం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్ సోలో సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. పరశురాం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఇప్పటికీ పరశురాం కెరియర్ లో బెస్ట్ వర్క్ ఏది అంటే సోలో అని చెప్పాలి. ఆ తర్వాత గీత గోవిందం అని చెప్పొచ్చు. ఇక సోలో సినిమా చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కి నారా రోహిత్ ను దగ్గర చేసింది. సోలో సినిమా తర్వాత పరుశురాంకి కూడా దర్శకుడుగా వరుస అవకాశాలు వచ్చాయి.
వరుస కాన్సెప్ట్ బేస్ సినిమాలు
ఇక నారా రోహిత్ వరుసగా ఎన్నో అద్భుతమైన సినిమాలను చేశాడు. నారా రోహిత్ సినిమా అంటేనే విభిన్నమైన కాన్సెప్ట్ లు ఉంటాయి. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నారా రోహిత్ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఎన్నో విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుని అద్భుతమైన సినిమాలను తన కెరియర్లో చేసేసాడు. అయితే నారా రోహిత్ ఆ తరువాత సినిమాలకు గ్యాప్ ఇవ్వడం మొదలుపెట్టాడు. విభిన్నమైన సినిమాలు చేస్తున్న తరుణంలో కొన్ని సినిమాలు మిస్ఫైర్ అయ్యి సరైన రిజల్ట్ రాకపోవడం జరిగింది. అక్కడితో సినిమాలు చేయడం తగ్గించాడు. ఇక దీని గురించి రీసెంట్ గా నారా రోహిత్ ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు.
నా గౌరవం పోయింది
నేను వరుసగా మంచి కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ కి దగ్గరయ్యను. ఒక తరుణంలో సక్సెస్ వెనక పరిగెడుతూ కొన్ని సినిమాలు చేశాను. ఆ సినిమాలు చేయటం వలన సక్సెస్ రాకపోవడం పక్కనపెడితే నాకున్న గౌరవం కూడా పోయింది. మంచి సినిమాలు చేస్తాడు అని నేను నిలబెట్టుకున్న పేరు మాత్రం ఆ సినిమాల వలన పోయింది. బాలకృష్ణుడు, ఆటగాళ్లు వంటి సినిమాలను నారా రోహిత్ ప్రస్తావించాడు. అయితే కొన్ని సినిమాల్లో అతిధి పాత్రల్లో కనిపించాడు. ఇక రీసెంట్ గా విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన భైరవం సినిమాతో పలకరించాడు.
Also Read: Shekhar Kammula: ఆ సినిమా తీస్తున్నప్పుడు నాకు అవగాహన లేదు, అందుకే ఏం చేశానంటే.?