BigTV English

Nindu Noorella Saavasam Serial Today June 19th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వినోద్‌కు డెడ్‌లైన్‌ పెట్టిన చిత్ర

Nindu Noorella Saavasam Serial Today June 19th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వినోద్‌కు డెడ్‌లైన్‌ పెట్టిన చిత్ర

Nindu Noorella Saavasam Serial Today Episode: గుడిలో వినోద్‌తో కలిసి ప్రదక్షిణ చేస్తున్న చిత్రను పక్కకు లాక్కెళుతుంది మనోహరి. పక్కకు వెళ్లాక చిత్ర కోపంగా మను అసలు వాళ్లను నువ్వు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది. నేనెందుకు తీసుకొచ్చాను గుడికి వెళ్తున్నాము మమ్మల్ని ఇక్కడ డ్రాప్‌ చేయ్‌ అని వాళ్లే వచ్చారు. అసలు నువ్వు అసలు పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. దీంతో ఏంటి చేసుకునేది అంటూ చిత్ర గుడిలో లవర్స్‌ దగ్గర వినోద్‌ చేసిన గొడవ గురించి చెప్తుంది. దీంతో నేను చెప్పాను కదా వినోద్‌ పేరెంట్స్‌కు తెలియకుండా పెళ్లి చేసుకోడు అని వాళ్లకు నిజం తెలిస్తే వాళ్లు నిన్ను ఇంట్లోకి కూడా రానివ్వరు. అమర్‌ నీ గతాన్ని వెతుక్కుంటూ వెళ్లాడు. ఇక్కడ సమస్యలే తప్పా సమాధానాలు ఎక్కడున్నాయో నాకు తెలియడం లేదు అంటుంది మనోహరి.


దీంతో చిత్ర అవి తెలియకే కదా నేను నీకు ఫోన్‌ చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు మను ఫ్లీజ్‌ అని అడుక్కుంటుంది చిత్ర. దీంతో మనోహరి తిడుతూ సమస్యను ఇంతదాకా తీసుకొచ్చావు ఇప్పుడు ఏం చేద్దాం అంటే నాకు మాత్రం ఏం అర్థం అవుతుంది చెప్పు. నాకు ఏం అర్థం కావడం లేదు. అదిగో ఆ రాక్షసి ఇటే వచ్చేస్తుంది పద వెళ్దాం… అంటూ మనోహరి చెప్పగానే.. మను ఏదైనా ఐడియా చెప్పు మను అని అడుగుతుంది. ఇంతలో అమర్‌ మనుకు కాల్‌ చేస్తాడు. మను భయపడుతుంది. దీంతో చిత్ర మను కాల్‌ లిఫ్ట్‌ చేసి స్పీకర్‌ ఆన్‌ చేయ్‌ అని చెప్తుంది. అలాగే అంటూ కాల్‌ లిప్ట్‌ చేసి హలో ఆ చెప్పు అమర్‌ అంటుంది. గుడిలోనే ఉన్నావా మనోహరి అని అమర్‌ అడుగుతాడు.

అవును అమర్‌ ఏమైంది అని అడుగుతుంది మనోహరి.  చిత్ర ఒక ప్రాడ్‌ మనోహరి తన మాట మంచి అంతా ఒక అబద్దం ఆ అబద్దాన్ని చూపించే వినోద్‌ తనని ప్రేమించేలా చేసింది. ఇప్పుడు ఇంకో మోసంతో వినోద్‌కు భార్య అవ్వాలని చూస్తుంది. వినోద్‌కు నిజం చెప్పడానికి చిత్రను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను తీసుకుని వస్తున్నాను అని అమర్‌ చెప్పగానే.. మనోహరి షాక్‌ అయినట్లు నటిస్తూ ఏంటి అమర్‌ ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతుంది. దీంతో అమర్‌ అవును మనోహరి చిత్ర వినోద్‌కు సరైంది కాదు. నేను వచ్చే వరకు చిత్రకు డౌటు రాకుండా తనతో మాట్లాడుతూ ఉండు. ఎలాగోలా ఆ పెళ్లి జరగకుండా చూసుకో.. అని చెప్పగానే.. మనోహరి సరే అమర్‌ నేను చూసుకుంటాను. చిత్ర ఇంత మోసగత్తే అని నాకు కూడా తెలియదు. సరే అమర్‌ నువ్వు రా నేను మేనేజ్‌ చేస్తాను అని చెప్పగానే.. పది నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెప్తాడు అమర్‌.


దీంతో మనోహరి విన్నావు కదా నువ్వు ఇక్కడి నుంచి పారిపోవడానికి పది నిమిషాలే టైం ఉంది. అమర్‌ ఇక్కడికి రాక ముందే పారిపో అని చెప్తుంది మనోహరి. దీంతో చిత్ర ఎక్కడికి వెళ్లాలి మను మళ్లీ ఐదుకు పదికి అడుక్కోవాలా..? దొంగతనాలు చేయాలా..? ఏది ఏం జరిగినా వినోద్‌ను నేను పెళ్లి చేసుకుని తీరాలి అని చెప్తుంది. దీంతో మనోహరి కోపంగా ఏయ్‌ నీకు పిచ్చి పట్టిందా..? అమర్‌ తన కుటుంబం జోలికి వస్తే వదలడని చెప్పాను కదా అంటుంది. దీంతో చిత్ర అదే నా ధైర్యం కూడా నేను చిత్రగా ఉంటేనే కదా ప్రాబ్లమ్‌ చిత్ర వైఫ్‌ ఆప్‌ వినోద్‌ అయితే బావగారు నన్నేం చేయలేరు. వినోద్‌ ఎదురుగా నిజం చెప్పలేరు. ఇప్పుడు నా గతం నన్ను వెతక్కుంటూ ఉండేలోపు నేను వినోద్‌తో తాళి కట్టించుకోవాలి అని చెప్తుండగానే వినోద్‌ వస్తాడు.

చిత్ర నువ్వు ఇక్కడ ఉన్నావా..? మనోహరి గారు మీరు ఎప్పుడు వచ్చారు అని అడుగుతాడు. ఇప్పుడే వచ్చాను వినోద.. నేనే కాదు భాగీ, ఆంటీ, అంకుల్‌ కూడా వచ్చారు. భాగీకి నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిసి నిన్ను డిస్టర్బ్‌ చేయాలని వాళ్లను తీసుకుని ఇక్కడకు వచ్చింది అని చెపగానే. వినోద్‌ కోపంగా మిస్సమ్మను తిడతాడు. తర్వాత అందరూ లోపలికి వెళ్తారు. చిత్ర పూజారి దగ్గర తాళి తీసుకోవడం నిర్మల , శివరాం చూస్తారు. తాళి తీసుకుని  వినోద్‌ దగ్గరకు వెళ్లిన చిత్ర కంగారు పడుతుంది.

దీంతో వినోద్‌ చిత్ర ఏమైంది అసలు నువ్వు నన్ను గుడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతాడు. దీంతో చిత్ర డైరెక్టుగా నన్ను పెళ్లి చేసుకుంటావా..? వినోద్‌ అని అడుగుతుంది. ఆ మాటలకు  వినోద్‌ షాక్‌ అవుతాడు. ఇప్పుడే ఇక్కడే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతూ తాళి బొట్టు చూపిస్తూ  పెళ్లి చేసకుంటావా..? నన్ను మర్చిపోతావా అని కండీషన్‌ పెడుతుంది. దీంతో వినోద్‌ తాళి తీసుకుని చిత్ర మెడలో కడుతుంటాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Illu Illalu Pillalu Today Episode: హమ్మయ్య శ్రీవల్లి సేఫ్.. నర్మద మాటతో మైండ్ బ్లాక్.. ప్రేమ ధీరజ్ ఫైట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు క్లాస్ పీకిన అవని.. ప్రణతికి పెళ్లి చెయ్యబోతున్న పార్వతి.. దిమ్మతిరిగే ట్విస్ట్..

Brahmamudi Serial Today August 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నెల తప్పిన అప్పు – తప్పు చేసిందన్న రుద్రాణి

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు డబ్బులిచ్చిన కల్పన.. బాలునే సాక్ష్యం.. ప్రభావతికి మైండ్ బ్లాక్..

Nindu Noorella Saavasam Serial Today August 12th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరుకు రాఖీ కట్టిన మిస్సమ్మ  

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అన్నీ సూపర్ హిట్ చిత్రాలే…

Big Stories

×