Aamir Khan: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ (Aamir Khan) ప్రస్తుతం గౌరీ స్ప్రాట్ (Gauri spratt) అనే మహిళతో డేటింగ్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా అమీర్ ఖాన్ బెంగళూరుకు చెందిన మహిళతో డేటింగ్ చేస్తున్నారు అని రూమర్లు వినిపించినప్పటికీ వాటిపై అమీర్ ఖాన్ స్పందించలేదు. కానీ తన 60వ పుట్టినరోజు నాడు అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. తన బర్త్డే రోజు తాను డేటింగ్ చేస్తున్న మహిళను మీడియా ముందుకు తీసుకువచ్చి ఈవిడతోనే నేను ప్రేమలో పడిపోయాను. బెంగళూరుకి చెందిన గౌరీ స్ప్రాట్ తో ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నాను. పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచించలేదు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు..
అయితే ఎప్పుడైతే అమీర్ ఖాన్ తన ప్రియురాలిని పరిచయం చేశారో అప్పటినుండి అమీర్ ఖాన్ పై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. 60 ఏళ్ల వయసులో అమీర్ ఖాన్ ప్రేమలు, పెళ్లిళ్లు, అమ్మాయిల వెంట పడడం ఏంటి.. పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉన్నా ఇంకా ఈయనకు బుద్ధి రావడం లేదు అంటూ కొంతమంది విమర్శించారు. మరి కొంతమందేమో అమీర్ ఖాన్ ప్రేమని గౌరవించారు.. ఎందుకంటే ప్రేమ ఏ వయసులో కలుగుతుందో చెప్పలేం. ఇదిలా ఉంటే తాజాగా అమీర్ ఖాన్ ప్రియురాలు గౌరీ స్ప్రాట్ తనని వదిలేయండి ప్లీజ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ALSO READ:Bigg Boss9 Promo: ఉత్కంఠ రేకెత్తిస్తున్న కెప్టెన్సీ టాస్క్.. వర్షంలో హీట్ పుట్టిస్తూ!
ఫోటోగ్రాఫర్లపై గౌరీ అసహనం..
అయితే ఈ వ్యాఖ్యలు అమీర్ ఖాన్ ను ఉద్దేశించే చేసింది అనుకుంటే పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే అది అమీర్ ఖాన్ ని ఉద్దేశించి కాదు. ఆమె వెంటపడిన వాళ్ళని ఉద్దేశించి మాట్లాడింది. తాజాగా గౌరీ స్ప్రాట్ ముంబైలోని బాంద్రా ఏరియాలో అటుగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడే ఉన్న కొంతమంది నెటిజన్స్ ఆమెని ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి వెంటపడ్డారు. అయితే అమీర్ ఖాన్ లాంటి సెలబ్రిటీ తో డేటింగ్ చేస్తున్నారంటే ఆవిడ కూడా సెలబ్రిటీ అయిపోయినట్టే. అందుకే చాలామంది ఫోటోలు, వీడియోల కోసం ఎగబడ్డారు.
దయచేసి తప్పుకోండి అంటూ..
అయితే వారందరూ ఆమె వెంట పడుతూ ఉంటే.. అసహనానికి గురైన గౌరీ స్ప్రాట్ వెంటనే ప్లీజ్ నన్ను వదిలేయండి..నేను వాకింగ్ కి వెళ్తున్నా.. ఇప్పుడు ఈ పనులేంటి. దయచేసి పక్కకు తప్పుకోండి అంటూ గట్టిగా అరిచింది. ప్రస్తుతం గౌరీ స్ప్రాట్ కి సంబంధించిన ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఎంత సెలెబ్రెటీ అయితే మాత్రం ఆమె ప్రైవేట్ స్పేస్ కి భంగం కలిగించడం మంచిది కాదు. ఏదో ఆమె ప్రశాంతత కోసం బయటికి నడుచుకుంటూ వస్తే ఆమె వెంటపడి విసిగించడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.
Gauri snaps at paps 😡#AamirKhan #GauriSpratt #Bandra #BollywoodNews #CelebrityLife #Paparazzi pic.twitter.com/iU5xdmFYSg
— Laughing Colours (@LaughingColours) September 25, 2025