Ladakh: లేహ్, లడఖ్ నిరసనల వెనుక విదేశీ కుట్ర కోణం దాగి ఉందని ఆరోపించారు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్. మరోవైపు.. సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్‌పై ఫోకస్ చేసింది సీబీఐ. వాంగ్‌చుక్‌కు వచ్చిన విదేశీ నిధులపై ఆరా తీస్తోంది. వాంగ్‌చుక్‌కు చెందిన విద్యాసంస్థకు విదేశీ నిధులు అందినట్లు గుర్తించింది.
36 రోజులుగా ఆమరణ దీక్ష కొనసాగింపు..
ఇటీవల పాకిస్థాన్‌కు కూడా వెళ్లొచ్చారు.. వాంగ్‌చుక్. ఈ కోణాల్లో సీబీఐ వాంగ్‌చుక్‌పై దర్యాప్తు చేపట్టింది. ప్రస్తుతం లడఖ్‌లో రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నడిపిస్తున్నారు వాంగ్‌చుక్. 36 రోజులుగా ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. విద్యాసంస్థకు వస్తున్న నిధుల గురించి ఆరాతీయడం వల్లే వాంగ్‌చుక్ జనాలను రెచ్చగొట్టినట్లు భావిస్తోంది.. సీబీఐ.
సోనమ్ వాంగ్‌చుక్‌కు వచ్చిన విదేశీ నిధులపై సీబీఐ ఆరా
ఇప్పటికే లడఖ్‌లో యువత ఆందోళన చేపట్టి భారీ విధ్వంసాన్ని క్రియేట్ చేసింది. లడఖ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించి, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌ను అమలు చేయాలని వాంగ్‌చుక్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే వాంగ్‌చుక్‌కు చెందిన విద్యాసంస్థపై దర్యాప్తు చేపట్టింది CBI. విదేశీ పెట్టుబడుల చట్టం కింద ఉల్లంఘన జరిగినట్లు భావిస్తోంది. హిమాలయన్ ఇన్స్‌టిట్యూట్ ఆప్ ఆల్టర్నేటివ్స్ లడఖ్‌పై 2 నెలల క్రితమే సీబీఐ దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
ఇప్పటికే ఆందోళన చేపట్టి భారీ విధ్వంసం చేసిన యువత
ఆగస్టులో లడఖ్ అడ్మినిస్ట్రేషన్.. హెచ్ఐఏఎల్‌కు భూ కేటాయింపును రద్దు చేయటంతో మొదలైంది వివాదం. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టి రాష్ట్ర హోదా, రాజ్యాంగ విధుల కోసం పోరాటం చేస్తున్నాయి లడాఖీ గ్రూపులు. తాజా ఘర్షణల్ని.. హక్కుల కోసం పోరాడుతున్న కేంద్ర పాలిత ప్రజలపై దాడిగా ఈ గ్రూపులు ఆరోపిస్తున్నాయి. మొన్న జరిగిన అల్లర్లలో నలుగురు మృతిచెందగా, 90 మందికి గాయాలు అయ్యాయి. అందులో 40 మంది పోలీసులు కూడా ఉన్నట్లు సమాచారం.
Also Read: ఒక్కొక్కరికి ఇక సినిమానే..! డిజిటల్ బుక్‌పై టీడీపీ రియాక్షన్ ఏంటి?
తనను బంధిస్తే ప్రభుత్వానికి సమస్యలు వస్తాయన్నారు వాంగ్‌చుక్. తాజా అల్లర్లకు తనను హోంశాఖ బద్నాం చేసిందని, ఇది బలిపశువును చేసే ప్రయత్నమని ఆరోపించారు. జనాలను రెచ్చగొట్టినట్లు కేంద్ర హోంశాఖ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. పబ్లిక్ సేఫ్టీ యాక్టు కింద అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు వాంగ్‌చుక్.