Bigg Boss9 Promo:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మరో కొత్త సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.. అందులో భాగంగానే తాజాగా తొమ్మిదవ సీజన్ ప్రసారమవుతుండగా.. 9 మంది సెలబ్రిటీస్ 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఈవారం అనూహ్యంగా వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ కామనర్ దివ్యా నికిత హౌస్ లోకి అడుగుపెట్టింది. ఈమె ఒక్కొక్కరిని వారి ఆట తీరును హైలైట్ చేస్తూ కెప్టెన్సీ టాస్క్లో హీట్ పుట్టించింది. ఈ మేరకు తాజాగా ప్రోమోని విడుదల చేయగా ఇందులో వర్షంలో కూడా తన మాటలతో కెప్టెన్సీ టాస్క్ ను మరింత హీట్ పుట్టించింది.
తాజాగా 19వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. కామనర్ కేటగిరీలో వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన దివ్య నిఖిత బిగ్ బాస్ మాట్లాడుతూ.. ఇప్పుడు మీరు ఇంటిలోని సభ్యులను మీ మాటలతో ర్యాగ్ చేయాలి అని చెబుతారు. దివ్య మాట్లాడుతూ.. మీరందరూ హౌస్ లో యాక్టివ్గా కనిపించడం లేదు. దమ్ము శ్రీజ తో మాట్లాడుతూ.. నువ్వు గొడవలను సృష్టిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ సాల్వ్ చేసినట్లు కనిపించడం లేదు అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది. అలాగే ఒకరి మీద రాయి విసిరితే.. ఎదుటివారు ఊరికే ఉండమంటే ఉంటారా నీ ఎక్స్ప్రెషన్స్ కూడా నాకు నచ్చట్లేదు అంటూ శ్రీజను టార్గెట్ చేసింది.
కెప్టెన్సీ టాస్క్ కోసం ఐదు మంది ఎంపిక..
ఇక ప్రియా శెట్టిని టార్గెట్ చేస్తూ.. నీ ఆటిట్యూడ్ లుక్స్ అందరికీ విసుగు తెప్పిస్తున్నాయి. ఎవరైనా ఏదైనా సలహా ఇచ్చినప్పుడు తీసుకోవాలి. నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టు ప్రవర్తిస్తున్నావు అంటూ తన అభిప్రాయాన్ని తెలిపింది. సంజనాతో మాట్లాడుతూ.. నవ్వుతూనే ఎక్స్ప్రెషన్స్ మార్చకుండా మెయింటైన్ చేస్తారు. కానీ నొప్పి తెలియకుండా గుచ్చిపడేస్తారు అంటూ తెలిపింది. ఇమ్మానుయేల్ గురించి మాట్లాడుతూ.. మీ గురించి మీరు ఆలోచించకుండా పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తారు. వాళ్లు అడిగింది ఇవ్వడానికే ముందుంటారు అంటూ తెలిపింది. అలాగే భరణి శంకర్ గురించి మాట్లాడుతూ.. అందరికంటే మీరే స్మార్ట్ అనిపిస్తోంది నాకు అంటూ తెలిపింది. అలా తన అభిప్రాయం ప్రకారం 5 మందిని మాత్రమే బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్ కోసం ఎంపిక చేశారు.
హీటెక్కిన కెప్టెన్సీ టాస్క్..
దివ్య నిఖిత ఎంపిక చేసిన వారిలో భరణి శంకర్, ఇమ్మానుయేల్, సంజన, డిమోన్ పవన్, తనుజాలను కెప్టెన్సీ టాస్క్ కోసం ఎంపిక చేయడం జరిగింది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఐదు మందికి తప్పిస్తారా లేక గెలిపిస్తారా అనే టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్. అందులో భాగంగానే బయటనుంచి బాల్స్ విసురుతుండగా జాకెట్ వేసుకున్న కంటెస్టెంట్స్ ఆ బాల్స్ అతుక్కోకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కెప్టెన్సీ టాస్క్ కాస్త హీటెక్కించింది అని చెప్పవచ్చు.
ALSO READ:OG Collections: పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఫస్ట్ టైం… కలెక్షన్లతో దుమ్ము లేపుతున్న ఓజీ