E-Paper
Advertisement

జయం రవి విడాకుల కేస్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆర్తి తల్లి!

జయం రవి విడాకుల కేస్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఆర్తి తల్లి!
Advertisement

Sujatha Vijay Kumar:సినీ ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీలు ప్రేమించుకొని మరీ పెళ్లి చేసుకుంటారు. అయితే అనూహ్యంగా కొన్ని జంటలు జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటే.. మరికొన్ని జంటలు అనూహ్యంగా విడాకులు తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉన్న సమయంలో విడాకుల ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. అలాంటి జంటలలో రవి మోహన్ (Ravi Mohan) , ఆర్తి (Aarti)కూడా ఒకరు. బంగారం లాంటి ఇద్దరు పిల్లలను పెట్టుకొని ఈ జంట విడాకులు ప్రకటించడానికి గల కారణాలేంటి? అంటూ నెటిజన్స్ కూడా సోషల్ మీడియాలో తెగ చర్చించుకున్నారు. ముఖ్యంగా రోజుకో వార్త తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు మరొకసారి ఈ విడాకుల వ్యవహారం తెరపైకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అందుకే ప్రతి నెల రూ.40 లక్షలు అడిగాము – ఆర్తి తల్లి సుజాత

ముఖ్యంగా ఈ వ్యవహారంలో ఆర్తి తల్లి, ప్రముఖ నిర్మాత సుజాత విజయ్ కుమార్ (Sujatha Vijay Kumar) చేసిన కీలక వ్యాఖ్యలు ఇందుకు కారణం. “రవి మోహన్ నుంచి నెలకు రూ.40 లక్షల మెయింటైనెన్స్ ను ఎలాంటి కారణం లేకుండా కోరలేదని” ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆర్తి తల్లి మాట్లాడుతూ.. “కుటుంబ ఆర్థిక పరిస్థితులు, పిల్లల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆర్తి ఈ డిమాండ్ చేసింది . ఆర్తి రెండేళ్లుగా పిల్లలు స్కూల్ ఫీజులు, ఆహారం, ట్యూషన్ తో పాటు ఇతర ఖర్చులకు సరైన ఆర్థిక సహాయం అందలేదు. ఇంటికి ఐసిఐసిఐ బ్యాంకు నుంచి నోటీసు కూడా వచ్చింది. పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచే అమెరికన్ స్కూల్లో చదువుతున్నారు. ఇది ఇద్దరు తల్లిదండ్రులు కలిసి తీసుకున్న నిర్ణయం. వారి ఏడాది స్కూల్ ఫీజు సుమారుగా 86 లక్షలు ఉంటుంది ఈ స్కూల్ ఫీజులను చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

Advertisement

also read:త్రిషపై ఉదయనిధి అసభ్యకర వ్యాఖ్యలు.. కుష్బూ సంచలన ట్వీట్!

రవి మోహన్ పిల్లల్ని కలవకుండా మేము అడ్డుకోలేదు – సుజాత

పైగా రవి మోహన్ పిల్లలను కలవకుండా మేము ఎప్పుడూ అడ్డుకోలేదు. పిల్లలను కలిసేందుకు విజిటేషన్ రైట్స్ కోసం మేమే కోర్టును ఆశ్రయించాము. ఆగస్టు నుంచి ప్రతి శని, ఆదివారాలలో వారిని కలిసే అవకాశం ఉంటుందని కోర్టు తెలిపింది. కుటుంబ విషయాలను బహిరంగంగా తీసుకురావాలని ఎవరు అనుకోరు. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాము. పైగా ఆర్తి తన కుటుంబాన్ని తిరిగి ఒక్కటి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా పోరాడుతోంది” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది సుజాత.

రవి మోహన్ సినిమాలలో 100 కోట్ల వరకు పెట్టుబడి..

Advertisement

ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ..” నేను నిర్మాతగా స్వతంత్రంగా ఎదిగాను. నా సొంత డబ్బులను రవి మోహన్ సినిమాలలో వెచ్చించాను. సుమారుగా రూ.100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాను అంటూ సుజాత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి అయితే సుజాత చేసిన వ్యాఖ్యలు రవి మోహన్ , ఆర్తి విడాకుల వ్యవహారంలో మరోసారి చర్చకు దారితీసాయని చెప్పవచ్చు.

Related News

ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ ఏమన్నారంటే.. ఓ నా సిద్ధయ్య’పై ఆసక్తికర కామెంట్స్

సిగ్మా ట్రైలర్.. విజయ్ కొడుకు జేసన్ సంజయ్ అదరగొట్టాడే!

అనుపమ పెళ్లికూతురైపోయిందే….ఎంత అందంగా ఉందో!

రష్మికకు ఇదేం పిచ్చి బాబోయ్.. అనిమే కోసం ఏకంగా 25 ఎపిసోడ్లు!

వరుణ్ తేజ్-లావణ్య ఇటలీ ట్రిప్.. వాయువ్ తేజ్ క్యూట్ మూమెంట్స్ అదుర్స్!

మూవింగ్.. డ్యాన్సింగ్.. క్రియేటింగ్.. అనసూయ ఫుల్ జోష్‌లో ఉందిగా!

మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్!

దివి అందం చూసి మాటలు రావట్లేదట.. ఏం రాశాడో చూస్తే!

Big Stories

Advertisement
×