Anasuya Bharadwaj:అనసూయ భరద్వాజ్.. ఈ భామ ఇంస్టాలో ఏ పోస్ట్ పెట్టినా నిమిషాల్లో వైరల్ అవ్వడం ఈమెకున్న స్పెషాలిటీ.యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత నటిగా కూడా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ వెటరన్ బ్యూటీ తాజాగా పెట్టిన ఒక పోస్ట్ కూడా ఇపుడు అలాగే తెగ వైరల్ అవుతుంది.
అనసూయ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో “Another grateful morning. Moving.. nourishing.. creating.. dancing.. and just being..” అంటూ ఓ క్యాప్షన్ పెట్టేసింది. అంటే మరో మంచి ఉదయం అంటూ తన రోజును పాజిటివ్‌గా మొదలుపెట్టినట్టు ఈ పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.తనను తాను జాగ్రత్తగా చూసుకోవడం, కొత్తగా ఏదైనా చేయడం, డ్యాన్స్ చేయడం, చివరికి ఎలాంటి హడావుడి లేకుండా తనలా తాను ఉండటం.. ఇదే తన మార్నింగ్‌లో భాగమని క్లారిటీ ఇచ్చేసింది.
సాధారణంగా అనసూయ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టిందంటే వెంటనే వైరల్ అవుతుంది. ఆమె ఫొటోలు, వీడియోలు మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ పెట్టే చిన్న చిన్న క్యాప్షన్లు కూడా ఆకట్టుకుంటాయన్న సంగతి తెల్సిందే.ఇక ఈ పోస్ట్ కి కూడా ఎక్కువ రివీల్ చేయకుండా సింపుల్ గా క్యాప్షన్ తో తన డైలీ లైఫ్ ని ఎక్ష్ప్లెయిన్ చేసేసింది.
అనసూయకు ఫిట్‌నెస్‌పై కూడా మంచి ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. తన ఆరోగ్యం, ఫిట్‌నెస్ విషయంలో ఆమె ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటుంది కూడా. షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా జిమ్ లో చెమటలు చిందిస్తుంది.
ఇక అనసూయ కెరీర్ విషయానికి వస్తే..టీవీలో యాంకర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు సినిమాల్లోనూ మంచి పేరే తెచ్చుకుంది.ముఖ్యంగా ‘క్షణం’ సినిమాలో చేసిన పాత్రతో నటిగా కూడా తానెంత క్యాలిబర్ అనేది ప్రూవ్ చేసింది అనసూయ.ఇక రంగస్థలంలో రంగమ్మత్త ఆడియన్స్ ని ఏడిపించేసింది. ఆ తర్వాత ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో దాక్షాయణిగా అనసూయ ఇచ్చిన ఫెర్మామెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
మొత్తానికి అనసూయ పెట్టిన ఈ చిన్న పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలాంటి పెద్ద స్టేట్‌మెంట్ ఇవ్వకపోయినా.. కొన్ని సింపుల్ మాటలతోనే అనసూయ పెట్టిన తాజా పోస్ట్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.