E-Paper
Advertisement

దివి అందం చూసి మాటలు రావట్లేదట.. ఏం రాశాడో చూస్తే!

దివి అందం చూసి మాటలు రావట్లేదట.. ఏం రాశాడో చూస్తే!
Advertisement

Divi Vadthya:సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాని మాత్రం తమ లేటెస్ట్ అప్ డేట్స్ తో షేక్ చేస్తుంటారు సినీ సెలెబ్రిటీలు.ఇపుడు అదే బాటలో నేనూ అంటుంది టాలీవుడ్ బ్యూటీ దివి వద్యా.ఈ క్రమంలోనే తన ఇంస్టాలో ఈ భామ కొన్ని ఫోటోలు షేర్ చేయగా అవి ఇపుడు సోషల్ మీడియాని ఇపుడు షేక్ చేస్తున్నాయి.

ఇక ఫోటోలలో నీలిరంగు ట్రెడిషనల్ డ్రెస్‌లో కనిపించిన దివి అప్సరగా మెరుస్తుందనడంలో సందేహం లేదు.ముఖ్యంగా దివి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ,ఇక డ్రెస్ కి మ్యాచ్ అయ్యేట్టుగా వేసుకున్న జ్యువెలరీ, లాంగ్ హెయిర్ మొత్తం లుక్‌కు ఒక స్పెషాలిటీని తీసుకొచ్చాయనే చెప్పాలి. అయితే దివి షేర్ చేసిన ఈఫోటోకి ఒక అభిమాని చేసిన కామెంట్ ఇపుడు అందరిని అట్రాక్ట్ చేస్తుంది.

Advertisement

ఈ ఒక్క జీవితం సరిపోదేమో

“నీ పాదాల దగ్గర ఆగిన నా చూపు, నీ కళ్ల వరకూ చేరడానికి జన్మలు అడుగుతోంది… ఒక్కో అంగుళం నిన్ను ప్రేమిస్తూ రావాలంటే, ఈ ఒక్క జీవితం సరిపోదేమో — thanuraasaadu” అంటూ దివి పోస్ట్‌కు కామెంట్ కనిపించింది. మాములుగా ఏ స్టార్ హీరోయిన్ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసినా కామెంట్స్‌లో లవ్ ఎమోజీలు, హార్ట్ ఎమోజీలు కనిపించడం కామనే. కానీ ఇలాంటి పొయెటిక్ గా ఒక అభిమాని పెట్టిన ఈ కామెంట్ ఇపుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Advertisement

బిగ్ బాస్ లో మంచి ఫ్యాన్ బేస్

ఇక దివి వద్యా విషయానికి వస్తే.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ బ్యూటీ అంతకుముందే పలు సినిమాల్లో కనిపించింది కూడా.మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దివి ఆ తర్వాత బిగ్ బాస్ లో కనిపించి మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది.ఇక ఈ క్రేజే దివికి సినిమాలు, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు తెచ్చిపెట్టాయి.

అలా ‘మా నీళ్ల ట్యాంక్’, ‘గాడ్‌ఫాదర్’, ‘ఏటీఎం’, ‘లంబసింగి’, ‘సింబా’ వంటి ప్రాజెక్టుల్లో కనిపించిన దివి, అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప 2: ది రూల్’ సినిమాల్లో కూడా తళుక్కుమంది.ప్రస్తుతం దివి సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన అప్ డేట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో అభిమానులు కూడా రెగ్యులర్ గా ఫాలో అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇక తాజాగా నీలిరంగు లెహంగా షేర్ చేయగా పొయెటిక్ గా కామెంట్ పెట్టాడు ఒక ఫాలోవర్.

సోషల్ మీడియాలో వైరల్

ఇక ఫోటో చూస్తే గ్లామర్ ని ఎక్కువగా చూపించకుండానే ట్రెడిషనల్ బ్యూటీని హైలైట్ చేసేలా రెడీ అయిపోయింది. మెడలో చోకర్, చెవులకు జుంకాలు, చేతులకు గాజులు, డ్రెస్‌పై ఉన్న గోల్డ్ ఎంబ్రాయిడరీ.. ఇవన్నీ కలిసి ఆమె లుక్‌ను మరింత రిచ్‌గా మార్చేశాయనడంలో సందేహం లేదు.అందుకే ఫోటో కంటే దానికి వస్తున్న కామెంట్లే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ALSO READ:ఉదయ భాను యాంకరింగ్‌కు అంత పారితోషికమా? ఒక్కో షోకు ఎంతంటే!

Tags

Related News

రాజకీయాల కంటే సినిమానే బెటర్… రియాలిటీలోకి వచ్చిన రోజా!

గ్లింప్స్‌తోనే కథపై క్యూరియాసిటీ పెంచేసిన ‘వెట్టువం’.. ఇదేం కాన్సెప్ట్ రా బాబు!

నాని జడల వెనుక ఇంత స్టోరీ ఉందా? లుక్ కోసం కాదా?

కొత్త ఫోన్ కోసం క్యూ కట్టడం ఏంటీ? ఐ ఫోన్ లవర్స్ కు క్లాస్ పీకిన సోనూ సూద్!

ప్యారడైజ్ కోసం నాని రెమ్యూనరేషన్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

అల్లు అర్జున్ కు సంబంధం లేదు.. భూ వివాదంపై మామ చంద్రశేఖర్ రెడ్డి క్లారిటీ!

రోజాని అలా చూసి చాలా హర్ట్ అయ్యా.. ఆమని కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×