Shruti Haasan:శృతి హసన్ …పరిచయం అక్కరలేని పేరు. కమల్ హాసన్ డాటర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అటు సింగర్ గా, ఇటు యాక్ట్రెస్ గా సత్తా చాటిన ఈ కోలీవుడ్ కుర్రది తాజాగా మగాళ్ళపై చేసిన కొన్ని కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.ఇంతకీ ఈ తమిళ పొన్ను అసలేమందో ఒకసారి చూద్దాం.
తాజాగా నటి సోహ ఆలీ ఖాన్ నిర్వహిస్తున్న ”ఆల్ అబౌట్ హర్” పాడ్ కాస్ట్ లో పాల్గొన్న శృతి హసన్ పీరియడ్స్ సమయంలో తాను ఎలాంటి ఇబ్బందులని ఫేస్ చేస్తాననే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చింది,తనకు pcos ఉండటం వల్ల పీరియడ్స్ వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నానని తెలిపింది.
కొన్ని సమయాల్లో వాంతులు
ముఖ్యంగా చిన్నప్పటి నుండే పీరియడ్స్ అంటే చాలా బాధాకరంగా ఉండేదని ,ఇక కొన్ని సమయాల్లో వాంతులు చేసుకోవడం,మూర్చ పోవడం వంటివి జరిగేవని,ఇక కొన్ని సార్లు ఏకంగా హాస్పిటల్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చాయంటూ పీరియడ్స్ సమయాల్లో తన అనుభవాలని తెలిపింది.
అయితే అన్నిటికన్నా తను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాకే ఈ సమస్య మరింత పెరిగిందని చెప్పింది.షూటింగ్ లలో యాక్షన్ సీన్స్ లాంటివి చేసే సమయంలో కడుపు నొప్పి విపరీతంగా వేదిస్తున్నా ఎవరికి చెప్పుకోలేక ఇబ్బందిగా అనిపించేదని వాపోయింది.
దాన్ని దాచుకోవడమే ఉత్తమం
ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పడం కన్నా దాన్ని దాచుకోవడమే ఉత్తమం అని అనిపించేదని మనసులోని మాటని బయటపెట్టింది.అయితే అలా తన సమస్య ని ఎవరికీ చెప్పకపోవడంతో తాను ఎందుకు అలా డల్ గా, ఎనర్జీ లేకుండా ఉన్నాననే విషయం పక్కన ఉన్న వారికి అర్థం కాకపోయేదని తెలిపింది.
అయితే సెట్ లో తోటి ఆర్టిస్ట్ కి సర్జరీ జరగడంతో ఆ విషయాన్ని మేకర్స్ కి చెప్పడంతో వాళ్ళు అన్ని రకాలుగా కావాల్సిన ఏర్పాట్లు చేశారని ,పైగా అతనికి ఇబ్బంది కాకుండా షూటింగ్ టైమింగ్స్ ని కూడా మార్చారని చెప్పుకొచ్చింది.ఇక ఆ సంఘటనని చూసే తానూ కూడా సమస్యని చెబితే అర్థం చేసుకుంటారు కదా అన్న ఆలోచన వచ్చిందని తెలిపింది.
అతడికి కూతురు ఉండటంతో
ఇక ఆ తర్వాత ఒక దర్శకుడికి తన పీరియడ్స్ గురించి చెప్పానని, అతను పాజిటివ్ గా స్పందించాడని ,పైగా అతడికి కూతురు ఉండటంతో తన తనకి మరింత ధైర్యం వచ్చిందని తెలిపింది.ఇక అప్పటి నుండి తను ఏ మాత్రం బయపడకుండా తన సమస్యని చెప్పడం మొదలెట్టానని చెప్పుకొచ్చింది.
అయితే ఈ సందర్భంలోనే మగవాళ్ళకి కూడా పీరియడ్స్ రావాలని సంచలన కామెంట్స్ చేసింది.అలా వస్తే అయినా హీరోయిన్స్ తో చేసే కాంట్రాక్టులలో పీరియడ్స్ గురించి మెన్షన్ చేస్తూ హాలిడేస్ ఇస్తారని అని సెటైర్ వేసిందిఇక దీనికి సోహ ఆలీఖాన్ నవ్వుతూ మగవాళ్లకు గనుక పీరియడ్స్ ఉంటే, ఎవరికెంత బ్లీడింగ్ అయింది, ఎవరి ట్యాంపూన్ సైజ్ పెద్దది అనే దానిపైనా పోటీ పడేవారేమో అంటూ సరదాగా కామెంట్ విసిరింది.
ఇపుడు సోషల్ మీడియాలో వైరల్
శ్రుతి హాసన్ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో ‘అనగనగా ఓ ధీరుడు’, ‘ఓ మై ఫ్రెండ్’, ‘గబ్బర్ సింగ్’, ‘బలుపు’, ‘శ్రీమంతుడు’, ‘క్రాక్’, ‘వాల్తేరు వీరయ్య’, ‘సలార్’ వంటి సినిమాల్లో సందడి చేసిన సంగతి తెల్సిందే.
ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో మిస్కిన్ దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ట్రైన్ ’లో అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాదినేని తెరకెక్కిస్తున్న తెలుగు సినిమా ‘ఆకాశంలో ఒక తార’లోనూ శ్రుతి హాసన్ కీలక పాత్రలో కనిపించనుంది ఈ కోలీవుడ్ భామ.ఏది ఏమైనా పీరియడ్స్ మగవాళ్ళకి కూడా ఉండాలంటూ శృతి హసన్ చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి !