Khushboo:బహిరంగ సభలో ప్రముఖ సినీ నటి త్రిష (Trisha) పై తమిళనాడు డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ఆయనను వెంటనే అరెస్టు చేయాలి అని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ (Khushboo Sundar) చేసిన సంచలన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆమె తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా.. “ఉదయనిధి స్టాలిన్ ప్రసంగం విన్నాను. అది చాలా అసభ్యంగా, చౌకబారుగా, తీవ్ర అవమానకరంగా ఉంది. ఆయన వారసత్వంగా పొందాలని ఆరాటపడుతున్నట్లు కనిపించే రాజకీయ సంస్కృతినే అది ప్రతిబింబిస్తోంది. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారు.. ఒక రాజకీయ పార్టీకి న్యాయకత్వం వహించాలని, ఒక రోజు రాష్ట్రాన్ని పాలించాలని ఆశపడితే. ఇక దేవుడే మనల్ని కాపాడాలి. ఇలాంటి వారి నుంచి ఇంకేం ఆశించగలం . ఉదయనిది స్టాలిన్, ఆయన తండ్రి ఎంకే స్టాలిన్ ఇన్నేళ్లుగా ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నారు. కానీ ప్రజా జీవితంలో అది ఎప్పటికీ ప్రమాణంగా మారకూడదు. ప్రతిపక్ష నాయకుడు బహిరంగ వేదికపై త్రిషను అవమానించినందుకు భేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఆయన తన తప్పును ఒప్పుకుంటాడో లేదో.. క్షమాపణ చెప్పే ధైర్యం, సంస్కారం ఆయనకు ఉన్నాయో లేదో చూద్దాం” అంటూ సంచలన ట్వీట్ చేసింది ఖుష్బూ. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అసలు విషయంలోకి వెళితే.. ఆగస్టు 3 సోమవారం తంజావూరు లోని పనగల్ బిల్డింగ్ వద్ద నిరసన సభ ఏర్పాటు చేయగా.. అందులో కావేరి జలాల హక్కులు, రైతు రుణమాఫీతో పాటు తదితర అంశాలపై డిఎంకె నేత ఉదయనిధి నిరసన సభలో ప్రసంగించారు. ఈ సమయంలో డిఎంకె కార్యకర్తలు త్రిష.. త్రిష.. అంటూ ఆమె పేరును ప్రస్తావించగా ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసాయి. కార్యకర్తలు ఒక మహిళ గురించి బహిరంగ సభలలో ప్రస్తావించడం తప్పు.. ఈ విషయం ఒక నాయకుడిగా గుర్తించి తన వారిని అదుపు చేసే ప్రయత్నం ఆయన చేయకుండా.. త్రిషను ఉద్దేశిస్తూ కావేరి నది నీళ్లు ఎక్కడికి వచ్చినా రాకున్నా అక్కడకు మాత్రం కచ్చితంగా వెళ్తాయి అంటూ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
also read:సర్జరీ తర్వాత తొలిసారి దర్శనమిచ్చిన రామ్ చరణ్.. డ్యాషింగ్ లుక్ తో!
దీంతో మండిపడ్డ టీవీకే మహిళ వింగ్ ఉదయనిధి స్టాలిన్ ను తక్షణమే అరెస్టు చేయాలి అంటూ కోరగా.. తంజావూరు పోలీసులు ఐటి చట్టంలోని నిబంధనలతో సహా మొత్తం ఆరు సెక్షన్లపై ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని మద్రాస్ హైకోర్టుకు తరలించగా నేడు మధ్యాహ్నం అత్యవసర విచారణ జరగనుంది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలలో ఈ విషయం దుమారం రేపుతోంది. మరి దీనిపై త్రిష ఏదైనా స్పందిస్తుందా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
Heard #Udhayanidhi Stalin's speech. It was crass, cheap and deeply derogatory; reflecting the very political culture he seems eager to inherit.
If those with such a mindset aspire to lead a political party and one day govern the state, then God help us. What else can one expect…
— KhushbuSundar (@khushsundar) August 4, 2026