Samsung Phone: సామ్‌సంగ్ అభిమానులకు మరో శుభవార్త. టెక్ ప్రపంచంలో ప్రతీ అప్‌డేట్‌కి ఎదురుచూస్తూ ఉండే సామ్‌సంగ్ యూజర్ల కోసం ఇప్పుడు కంపెనీ కొత్త అప్‌డేట్ వన్ యూఐ 8.5ను తయారు చేస్తోంది. ప్రస్తుతం ఇది అంతర్గతంగా టెస్టింగ్ దశలో ఉందని సమాచారం. ముఖ్యంగా, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ఇప్పటికే ఈ కొత్త వన్ యూఐ 8.5ను రన్ చేస్తోందని లీకులు చెబుతున్నాయి.
ఈ అప్‌డేట్ సామ్‌సంగ్ మొబైల్ ఫోన్లకు ఒక పెద్ద మార్పును తీసుకురానుంది. డిజైన్ నుంచి యూజర్ అనుభవం వరకు, ప్రతి అంశంలో కొత్తదనం కనిపించబోతోంది. కొత్త వన్ యూఐ 8.5లో విజువల్‌గా, ఫంక్షనల్‌గా భారీ మార్పులు ఉన్నాయని సమాచారం. కొత్త యూఐ డిజైన్ మరింత కొత్తగా, సులభంగా ఉండబోతోంది. యానిమేషన్లు మరింత స్మూత్‌గా, వేగంగా పనిచేస్తాయి. యాప్‌ల మధ్య నావిగేషన్ సజావుగా, లాగ్ లేకుండా ఉంటుంది.
ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది గెలాక్సీ ఏఐ టూల్స్. సామ్‌సంగ్ ఇప్పటికే ఎస్24 సిరీస్ ద్వారా ఏఐ ఫీచర్లను పరిచయం చేసింది. ఇప్పుడు వన్ యూఐ 8.5తో ఈ టూల్స్ మరింత ఆకర్షణీయంగా మారింది. ఫోటో ఎడిటింగ్, వాయిస్ ట్రాన్స్‌లేషన్, లైవ్ ఇంటరాక్షన్, ఆటో సజెషన్ లాంటి ఫీచర్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి.
ఈ అప్‌డేట్‌తో యూజర్లు తమ ఫోన్‌ను మరింత పర్సనలైజ్ చేసుకోవచ్చు. వాల్ పేపర్లు, ఐకాన్లు, థీమ్‌లు, విడ్జెట్లలో కొత్త లుక్ వస్తుంది. సిస్టమ్ వేగం స్పష్టంగా పెరుగుతుంది. బ్యాటరీ మేనేజ్‌మెంట్, బ్యాక్‌గ్రౌండ్ యాప్ హ్యాండ్లింగ్, ప్రైవసీ కంట్రోల్స్ అన్నీ కొత్త స్థాయికి చేరుతాయని కంపెనీ అంచనా.
ప్రస్తుతం ఈ అప్‌డేట్ ఇంటర్నల్ టెస్టింగ్ దశలో ఉంది. అంటే, సామ్‌సంగ్ ఇంజనీర్లు, కొంతమంది టెస్టర్లు మాత్రమే దీనిని ఉపయోగిస్తున్నారు. కానీ పబ్లిక్ బీటా వెర్షన్ నవంబర్ చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని లీక్‌ల ద్వారా తెలుస్తోంది.
ఈ బీటా అప్‌డేట్ ముందుగా గెలాక్సీ ఎస్, గెలాక్సీ జెడ్ సిరీస్ ఫోన్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది. అంటే, గెలాక్సీ ఎస్24, ఎస్23, జెడ్ ఫోల్డ్ 6, జెడ్ ఫోల్డ్ 5, జెడ్ ఫ్లిప్ సిరీస్ యూజర్లు ముందుగా ఈ అప్‌డేట్‌ని ట్రై చేయగలరు. తర్వాత మిగిలిన మోడళ్లకు కూడా కంపెనీ విడుదల చేసే అవకాశం ఉంది.
సామ్‌సంగ్ వన్ యూఐ అప్‌డేట్‌లకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి కొత్త వెర్షన్‌లో యూజర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మార్పులు చేస్తుంది. వన్ యూఐ 8.5 కూడా అదే దారిలో ముందుకు వెళ్తుంది. ఇది ఆండ్రాయిడ్15 ఆధారంగా ఉంటుందని కూడా అనుకుంటున్నారు. నవంబర్‌లో ఈ బీటా వెర్షన్ విడుదలైన వెంటనే టెక్ ప్రియులు దీన్ని ఉపయోగించిన తరువాత దీనిపై మరిన్ని వివరాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. భవిష్యత్తులో వన్ యూఐ 9.0కి పునాది వేయబోయే ఈ 8.5 వెర్షన్ సామ్‌సంగ్ ఫోన్లకు గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.