Kantara Chapter1: రిషబ్ శెట్టి (Rishabh Shetty)స్వీయ దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార చాప్టర్ 1(Kantara Chapter1) . ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కేవలం వారం వ్యవధిలోనే ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లో చేరి ఈ ఏడాది విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో అన్ని భాషలలో కూడా సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడమే కాకుండా భారీగా కలెక్షన్లు కూడా వచ్చాయి.
ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుంచి బ్రహ్మ కలశ (Brahmakalasha song )పూర్తి పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటను క్షుణ్ణంగా పరిశీలించిన నెటిజన్ లు ఒక్కసారిగా రిషబ్ శెట్టి పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ పాటలో గ్రామ ప్రజలందరూ కూర్చుని భోజనం చేస్తున్న సమయంలో అక్కడ 20 లీటర్ల ప్లాస్టిక్ వాటర్ క్యాన్ కనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్స్ ఒక్కసారిగా రిషబ్ శెట్టి పై విమర్శలు కురిపిస్తున్నారు. కాంతార చాప్టర్ 1 సినిమా 4వ శతాబ్దపు కదంబ రాజవంశం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే నాలుగవ శతాబ్దంలో ప్లాస్టిక్ ఎక్కడా కూడా లేదు కానీ ఈ పాటలో ప్లాస్టిక్ క్యాన్ కనిపించడంతో విమర్శలు వెళ్లవెత్తుతున్నాయి.
ఇక ఈ విషయంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “కదంబలు వారి కాలంలోనే ప్లాస్టిక్ ఉపయోగించారని నేను ఈ సినిమా చూసిన తర్వాతే తెలుసుకున్నాను” అంటూ ఫన్నీగా కామెంట్లు చేయగా మరికొందరు ” కాంతార1 నిర్మాతలు బిస్లరీతో ఒప్పందం కుదుర్చుకున్నారేమో అందుకే ఇలా ప్రమోట్ చేస్తున్నారు” అంటూ కామెంట్ లు పెడుతున్నారు. ఈ సినిమాలో ప్రతి చిన్న విషయాన్ని ఎంతో శ్రద్ధగా క్లుప్తంగా వివరించారు బహుశా ఈ విషయాన్ని మర్చిపోయి ఉండవచ్చు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
నేషనల్ అవార్డు అందుకున్న రిషబ్…
ఇలా ఈ సినిమాని ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన రిషబ్ శెట్టి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావయ్యా, కాస్త చూసుకోవాలి కదా అంటూ ఈ వాటర్ క్యాన్ పై నెటిజన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి ఈ విషయంపై రిషబ్ శెట్టి స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమా 2022వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార సినిమాకు ప్రీక్వెల్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాంతార సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా హీరో రిషబ్ శెట్టికి ఏకంగా నేషనల్ అవార్డు కూడా వరించింది. ఇక కాంతార చాప్టర్ వన్1 సినిమా కూడా అంతకుమించి అనేలా సక్సెస్ అందుకుంది. మరి ఈ సినిమాకు ఎలాంటి అవార్డులు వరిస్తాయో వేచి చూడాలి.