Smriti Mandhana: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025 ) నేపథ్యంలో ఇవాళ మరో కీలక మ్యాచ్ జరుగుతోంది. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( India Women vs Australia Women ) మహిళల జట్ల మధ్య 13 మ్యాచ్ జరుగుతోంది. విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి ( ACA-VDCA Cricket Stadium, Visakhapatnam ) వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా అదరగొడుతోంది. ఇప్పటికే వందకు పైగా పరుగులు చేసింది టీమిండియా. ఈ నేపథ్యంలో టీమిండియా లేడీ విరాట్ కోహ్లీ స్మృతి మందాన ( Smriti Mandhana ) అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఒకే సంవత్సరంలో 1000 కి పైగా పరుగులు చేసి చరిత్ర సృష్టించారు.
Also Read: IND-W vs SA-W: రీల్స్ పైన ఉన్న ఫోకస్, బ్యాటింగ్ పైన లేదు…లేడీ కోహ్లీ అనుకుంటే, నట్టేట ముంచింది!
వన్డే క్రికెట్ లో టీమిండియా ( Team India) లేడీ విరాట్ కోహ్లీ స్మృతి మందాన ( Smriti Mandhana ) సరికొత్త రికార్డు సృష్టించారు. ఒకే క్యాలెండర్ ఇయర్ లో 1000 కి పైగా పరుగులు చేశారు స్మృ తి మందాన. దాదాపు 28 సంవత్సరాల తర్వాత ఈ సరికొత్త రికార్డు సృష్టించారు స్మృతి మందాన. అంతర్జాతీయ వన్డేలలో 1997 సంవత్సరంలో ఆస్ట్రేలియా ప్లేయర్ క్లార్క్ 970 పరుగులు చేశారు. ఆ తర్వాత స్మృతి మందాన ఈ రికార్డు సృష్టించారు. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఇవాల్టి మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ సింగ్ జట్టు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇవాల్టి మ్యాచ్ లో టీం ఇండియా గనుక ఓడిపోతే… పాయింట్లు పట్టికలో మరింత కిందికి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అటు ఆస్ట్రేలియా లాంటి జట్టు చేతిలో ఓడిపోతే, టీమిండియా మహిళల జట్టుపై మరింత ప్రెషర్ పడుతుంది. అందుకే ఇవాళ మంచి స్టార్టింగ్ చేసింది టీమిండియా. ఇప్పటికే 150 పరుగులకు పైగా సాధించింది. ప్రాథమిక కాంచన ప్రకారం ఇవాళ 300కు పైగా టీమిండియా పరుగులు చేసే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో ఇప్పటికే ఓపెనర్ స్మృతి మందాన 78 పరుగులు చేయగా ప్రతిక రవల్ 63 పరుగులు చేసింది. ఇద్దరు ఓపెనర్లే దాదాపు సగం ఓవర్లు ఆడేసారు. ఇదే జోరు కనబరిస్తే, 300 పరుగులు రావడం పక్కా.
ఆస్ట్రేలియా మహిళలు (ప్లేయింగ్ XI): అలిస్సా హీలీ (w/c), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, కిమ్ గార్త్, అలానా కింగ్, మేగాన్ షుట్
భారత మహిళలు (ప్లేయింగ్ XI): ప్రతికా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (c), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (w/c), అమంజోత్ కౌర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి
The most runs ever in a calendar year in women's ODIs 🔥
Smriti Mandhana makes history! pic.twitter.com/bULxTdK8Vu
— ESPNcricinfo (@ESPNcricinfo) October 12, 2025