Rahkeem Cornwall Helmet: క్రికెట్ లో అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. బౌలర్లు వేసే బంతులు బ్యాటర్లకు తగిలి అనేక ప్రమాదాలు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. గతంలో ఆస్ట్రేలియా ఆటగాడు కూడా ఇలాగే హెల్మెట్ కు బంతి తగిలి మరణించాడు. అయితే అచ్చం అలాంటి సంఘటనే తాజాగా నేషనల్ క్రికెట్ టి10 2025 టోర్నమెంట్ లో జరిగింది. బౌలర్ వేసిన బంతి నేరుగా బ్యాటర్ హెల్మెట్ కు తగిలింది. అందులోనే ఆ బంతి ఇరుక్కుపోయింది. అది కూడా రహకీమ్ కార్న్‌వాల్ హెల్మె ట్ లో బంతి ఇరుక్కుంది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: IND-W vs SA-W: రీల్స్ పైన ఉన్న ఫోకస్, బ్యాటింగ్ పైన లేదు…లేడీ కోహ్లీ అనుకుంటే, నట్టేట ముంచింది!
రహకీమ్ కార్న్‌వాల్ కు తప్పిన ప్రమాదం
వెస్టిండీస్ ఆటగాడు రహకీమ్ కార్న్‌వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడు భారీ ఊభకాయంతో కనిపిస్తాడు. ఆంటిగ్వా దేశానికి చెందిన ఈ డేంజర్ ఆటగాడు రహకీమ్ కార్న్‌వాల్ వెస్టిండీస్ జాతీయ జట్టులో ఆడతాడు. అయితే ప్రస్తుతం నేషనల్ క్రికెట్ లీగ్ 2025 టోర్నమెంట్ లో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే అట్లాంటా కింగ్స్ ( Atlanta Kings CC) తరఫున బ్యాటింగ్ చేస్తుండగా అతనికి పెను ప్రమాదం జరిగింది.
లాస్ ఏంజిల్స్ వేవ్స్ ( Los Angeles Waves CC ) ఫాస్ట్ బౌలర్.. వేసిన పదునైన బంతి నేరుగా వచ్చి కారణం రహకీమ్ కార్న్‌వాల్ హెల్మెట్ కు తగిలింది. అయితే ఆ బంతి అలాగే హెల్మెట్ కు ఇరుక్కుని, పెను ప్రమాదమే తప్పింది. అయితే, ఆ హెల్మెట్ లో ఇరుక్కోకపోయి ఉంటేనా, అతని తలకు బంతి బలంగా తాకేది. అలా జరిగి ఉంటే, రహకీమ్ కార్న్‌వాల్ అక్కడిక్కడే కుప్పకూలేవాడు. కానీ అదృష్టం బాగుండి బయటపడ్డాడు. దీనిని వీడియోలో స్పష్టంగా చూడవచ్చును. వెస్టిండీస్ ఆటగాడు రహకీమ్ కార్న్‌వాల్ కు పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
నేషనల్ క్రికెట్ టి 10 2025 టోర్నమెంట్ ఎలిమి నేటర్ మ్యాచ్ లో భాగం గా లాస్ ఏంజిల్స్ వేవ్ ( Los Angeles Waves CC ) వర్సెస్ అట్లాంటాక్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టెక్సాస్ డెల్లాస్ యూనివర్సిటీలో ఈ హై వోల్టేజ్ మ్యాచ్ నిర్వహించారు. అయితే ఇందులో భాగంగానే అట్లాంటా కింగ్స్ ( Atlanta Kings CC ) పైన లాస్ ఏంజెల్స్ వేవ్స్ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా 34 పరుగుల తేడాతో లాస్ ఏంజెల్స్ వేవ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన లాస్ట్ ఏంజిల్స్ వేవ్స్ 10 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 96 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని కూడా చేదించలేకపోయింది అట్లాంటా కింగ్స్. నిర్ణీత 10 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 62 పరుగులకే కుప్పకూలింది.
?igsh=OTl2azZudWJxeWs2