 
					Allu Sirish Engagement: అల్లు ఇంట పెళ్లి భాజలు మోగబోతున్న సంగతి మనకు తెలిసిందే. అల్లు వారసుడు అల్లు శిరీష్(Allu Sirish) ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదనే సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఇటీవల ఈయన తన పెళ్లికి సంబంధించిన శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. అక్టోబర్ 31వ తేదీ తన నిశ్చితార్థం (Engagment)నైనిక (Nainika)అనే అమ్మాయితో జరగబోతుందని అల్లు శిరీష్ అధికారికంగా వెల్లడించారు. అయితే తనకు కాబోయే భార్య ఫోటోలను మాత్రం ఈయన ఎక్కడ షేర్ చేయలేదు. ఇక దీపావళి పండుగను పురస్కరించుకొని అల్లు కుటుంబంలో జరిగిన దీపావళి వేడుకలలో భాగంగా శిరీష్ కి కాబోయే భార్య కూడా పాల్గొన్నారు.
ఇకపోతే తాజాగా అల్లు శిరీష్ నైనిక నిశ్చితార్థపు వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ నిశ్చితార్థపు వేడుకలు జరిగాయి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి, రామ్ చరణ్, నాగబాబు వాటి తదితరులు హాజరై సందడి చేశారు. కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో అల్లు శిరీష్, నైనిక నిశ్చితార్థపు వేడుక ఎంతో అంగరంగ వైభవంగం జరిగింది. ఇక వీరి పెళ్లికి సంబంధించిన వివరాలను ఎక్కడ వెల్లడించలేదు. బహుశా వీరి వివాహం వచ్చే ఏడాదిలో జరగబోతుందని సమాచారం.త్వరలోనే వీరి వివాహానికి సంబంధించిన వివరాలను వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.
ఇక అల్లు శిరీష్ నైనిక గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇలా ఎన్ని రోజులపాటు రహస్యంగా ప్రేమాయణం నడిపిన ఇద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నైనిక ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందిన అమ్మాయి అని తెలుస్తోంది అంతేకాకుండా నైనిక అలాగే అల్లు అర్జున్(Allu Arjun) భార్య స్నేహ రెడ్డి ఇద్దరు కూడా మంచి స్నేహితులని తెలుస్తోంది. ఇలా స్నేహారెడ్డి(Sneha Reddy)కి నైనిక రెడ్డి మధ్య మంచి స్నేహబంధం ఉన్న నేపథ్యంలో నైనిక కూడా అల్లు ఇంటికి కోడలు అడుగుపెట్టబోతున్నారని సమాచారం.
బడ్డీ చివరి చిత్రం..
ఇక అల్లు శిరీష్ విషయానికి వస్తే.. గౌరవం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన శిరీష్ తదుపరి పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ అనుకున్న స్థాయిలో ఈయన ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోలేకపోయారు. ఈయన చివరిగా బడ్డీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2023లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమా తరువాత అల్లు శిరీష్ తన తదుపరి సినిమాని ఇప్పటివరకు ప్రకటించలేదు.
Also Read: Srimukhi: వచ్చే ఏడాది శ్రీముఖి పెళ్లి.. 10 మంది పిల్లలు కంటానంటోన్న లాస్య.. వీళ్లకు ఏమైంది?