Kannappa Pre Release Event : మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఒకప్పుడు మంచు ఫ్యామిలీ నుంచి సినిమా వస్తుంది అంటే అంతగా అంచనాలు ఉండేవి కాదు. కానీ ఈ సినిమా మీద అంచనాలు కలగడానికి కారణం ఈ సినిమాలో ప్రభాస్ నటించడం. ప్రభాస్ తో పాటు ఎంతోమంది స్టార్ యాక్టర్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా కొంతవరకు అంచనాలు పెంచండి. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది తరుణంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్.
ప్రభాస్ ఎంట్రీ ఇచ్చేది అప్పుడే
ప్రభాస్కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూడటం మొదలుపెట్టారు. ప్రస్తుతం కన్నప్ప సినిమా మీద అంచనాల పెరగడానికి కూడా కారణం ప్రభాస్. అయితే కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఎంత మేరకు నటిస్తాడు, ఏ టైంలో కనిపిస్తారు అని క్యూరియాసిటీ చాలామందికి ఉంది. దానిని కన్నప్ప ఈవెంట్లో రివిల్ చేసేసాడు రైటర్ బివిఎస్ ప్రసాద్. సరిగ్గా సెకండ్ ఆఫ్ స్టార్ట్ అయిన 15, 16 నిమిషాలకి ప్రభాస్ ఎంట్రీ సీన్ ఉంటుందే అని తెలిపాడు. ప్రభాస్ ఈ సినిమాలో రుద్ర అనే పాత్రలో కనిపిస్తున్నాడు. ట్రైలర్ లో కూడా ప్రభాస్ కు సంబంధించిన షాట్స్ కొన్ని ఆసక్తికరంగా అనిపించాయి.అయితే ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపడానికి ఈ విషయం చెప్పినా కూడా బిగ్గెస్ట్ ట్విస్ట్ రివిల్ చేసినట్టే.
రచయితగా పనిచేశారు
కన్నప్ప సినిమా కోసం చాలామందిని సంప్రదించాడు మంచి విష్ణు. అందులో ఈ సినిమాకి రాయమని బివిఎస్ రవిని కూడా అడిగారు. బి వి ఎస్ రవి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గోపీచంద్ నటించిన వాంటెడ్ సినిమాకి దర్శకుడుగా పనిచేశారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. సాయి ధరం తేజ్ హీరోగా నటించిన జవాన్ సినిమా కూడా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. అన్ స్టాపబుల్ అనే రియాలిటీ షో కి బివిఎస్ రవికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక కన్నప్ప సినిమాకి పనిచేసిన చాలామంది రచయితలు బివిఎస్ రవి కూడా ఒకరు. అందుకే ప్రభాస్ ఎంట్రీ అనౌన్స్ చేసేసాడు.